India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎయిర్ ఇండియాపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.80లక్షల జరిమానా విధించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్స్, సిబ్బంది నిర్వహణ అంశాల్లో నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణం. సిబ్బందితో ఓవర్‌టైమ్ పనిచేయించడం, తగిన విశ్రాంతి ఇవ్వకపోవడం, విమానాల్లో ఇద్దరు పైలట్లూ 60ఏళ్లుపైబడిన వారే ఉండటం వంటి తప్పులను గుర్తించినట్లు DGCA తెలిపింది. కాగా ఈ జనవరిలో ఎయిర్‌ఇండియాకు రూ.1.10కోట్ల ఫైన్ వేసింది.
TG: ఢిల్లీ CM కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ అన్నారు. ‘ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తోంది. దీనికి ఝార్ఖండ్ CM హేమంత్ సోరెన్, BRS ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు. కేంద్రం ED, CBI, IT వంటి సంస్థలను పావులుగా వాడుకుంటోంది’ అని కేసీఆర్ అన్నారు.
TG: జగిత్యాలలో టెన్త్ విద్యార్థినులు గంజాయికి బానిసలయ్యారు. ఓ అమ్మాయి కొన్ని రోజులుగా వింతగా ప్రవర్తించడంతో తండ్రికి అనుమానం వచ్చింది. ఆమె గంజాయికి అలవాటు పడిందని తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా శిశు సంరక్షణ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఆ అమ్మాయితో పాటు మరో 10 మంది గంజాయికి బానిసలైనట్లు తేలింది. ఓ సెక్స్ రాకెట్ వారికి గంజాయి ఇచ్చి, HYDలో రేవ్ పార్టీలకూ తరలిస్తున్నట్లు వెల్లడైంది.
కాసేపట్లో చెన్నై, బెంగళూరు మధ్య IPL-2024 సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కామెంటేటరీ అవతారం ఎత్తిన RCB మాజీ ప్లేయర్ AB డివిలియర్స్ ఈసారి తమ జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నా జెర్సీ నంబర్ 17. ఇది 17వ IPL సీజన్. కాబట్టి ఈసారి RCB గెలుస్తుందని అనుకుంటున్నా’ అని అన్నారు.
AP: తాను నమ్మిన నాయకులే గొంతు కోశారని కోవూరు MLA నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొందరు నేతలు తనను అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు వారంతా టీడీపీ MP అభ్యర్థి వేమిరెడ్డి పంచన చేరుతున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో వారందరికీ తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. తాను నోరు విప్పితే వేమిరెడ్డి జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనే ఉండరన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్లలో అనుపమ గ్లామర్, కొన్ని డైలాగ్స్, సీన్లు చూసి అడల్ట్ కంటెంట్ అనుకున్నారంతా. కానీ సెన్సార్ సర్టిఫికెట్‌తో అలాంటి రూమర్లకు తెరపడినట్లయింది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా టిల్లు చేరువ కానున్నాడు. కాగా ఈ సినిమా మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఎన్నికల వేళ ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటున్న బీజేపీ ఒడిశాలో ప్లాన్ మార్చింది. సీఎం నవీన్ పట్నాయక్‌కు చెందిన బీజేడీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. కేంద్రానికి మద్దతు ఇస్తున్నందుకు ఓవైపు బీజేడీకి ధన్యవాదాలు చెప్తూనే.. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగనుంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత తొలిసారి స్పందించారు. ‘కేజ్రీవాల్ ఎప్పుడూ ఢిల్లీ ప్రజల తరఫున నిలబడ్డారు. ఆయన అరెస్ట్ అక్రమం’ అని తెలిపారు. కాగా కాసేపట్లో కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై కోర్టు తీర్పు వెలువరించనుంది. కేసు నేపథ్యంలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తే సునీత లేదా విద్యాశాఖ మంత్రి అతిశీ సీఎం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
AP: పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని జనసేన పార్టీ ప్రకటించింది. వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలుపెడతారని, ఆ నియోజకవర్గంలోనే 3 రోజులు ఉంటారని తెలిపింది. తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని, అప్రమత్తంగా ఉండాలని పవన్ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు జనసేన పేర్కొంది.
మరికొద్ది సేపట్లో IPL-2024 టోర్నీ ప్రారంభం కానుండగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. IPL ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగితే ఫైనల్స్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందుతుందట. 2019 IPLలో ఇదే జరిగిందని చెబుతున్నారు. ఆ టోర్నీ తొలి మ్యాచ్‌లో RCB కేవలం 70 పరుగులే చేయడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.