news

News June 8, 2024

‘తెలుగు’ బతకాలని.. తెలుగీకరించి..

image

తెలుగు భాష నిత్యమై, నిఖిలమై వెలగాలని ఆకాంక్షించిన వారిలో రామోజీరావు ముందుంటారు. మన భాషలో ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ పదాలను తెలుగీకరించేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ‘తెలుగు వెలుగు’ మాసపత్రికకు శ్రీకారం చుట్టారు. ‘ఈనాడు’లోనూ ఆయన పరభాష పదాల నియంత్రణకు కృషి చేశారు. ప్రతి పదాన్నీ తెలుగీకరించే క్రమంలో విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. అయినా పట్టించుకోకుండా తెలుగుపై అభిమానాన్ని మాత్రం చంపుకోలేదాయన.

News June 8, 2024

బంగ్లాదేశ్‌ పోర్టుపై భారత్ కన్ను.. చైనాకు చెక్?

image

వ్యూహాత్మకంగా ఇరాన్‌లో చాబహార్, మయన్మార్‌లో సిట్వే పోర్టులను నిర్మించిన భారత్ ఇప్పుడు మరోసారి చైనాను దెబ్బకొట్టాలని భావిస్తోంది. బంగ్లాదేశ్‌లోని మోంగ్లా పోర్టులో కొత్త టెర్మినల్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. చైనా సైతం ఈ పోర్టు నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ భారత్ ఇందులో సక్సెస్ అయితే విదేశాల్లోని తమ ప్రమేయాన్ని విస్తరించాలన్న చైనా వ్యూహాలకు చెక్ పడినట్లు అవుతుంది.

News June 8, 2024

మరో 2 నెలల్లో ‘ఈనాడు’కు 50 ఏళ్లు.. అంతలోనే..

image

రామోజీరావు మానస పుత్రిక ‘ఈనాడు’ ప్రారంభించి ఈఏడాది ఆగస్టు 10 నాటికి 50 ఏళ్లు పూర్తవుతాయి. 1974లో ఈనాడు ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీరావు ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ సంచలనం సృష్టించారు. నిత్యం తె.జా 3-4 గంటల మధ్య ఈనాడు పేపర్ చదవడం ఆయనకు అలవాటు. మరో 2 నెలల్లో ఆ పేపర్‌కు 50 ఏళ్లు నిండనుండగా ఈ అరుదైన ఘట్టాన్ని చూడకుండానే రామోజీరావు కన్నుమూయడం విషాదకరం.

News June 8, 2024

రామోజీ మరణం బాధాకరం: మోదీ

image

భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తెచ్చిన దార్శనికుడు రామోజీ రావు మరణం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. ‘భారతదేశ అభివృద్ధి పట్ల రామోజీ చాలా మక్కువ చూపేవారు. ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం చాలాసార్లు లభించడం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో రామోజీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు సానుభూతి’ అని Xలో నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు.

News June 8, 2024

తెలుగు సినిమాలో రామోజీ ‘ఉషాకిరణం’

image

‘ఉషాకిరణ్ మూవీస్’తో సినీ పరిశ్రమపైనా రామోజీ రావు తనదైన ముద్ర వేశారు. తెలుగు, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 80కిపైగా ఫీల్ గుడ్ చిత్రాలు నిర్మించారు. ఎందరో నటులు, దర్శకులు, సంగీత దర్శకులను పరిచయం చేశారు. కీరవాణి, శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, తరుణ్, డైరెక్టర్ తేజ, జెనీలియా, శ్రియ మొదలైన ప్రముఖులు అలా వచ్చిన వారే. ఆయన సినిమాల్లో ‘నువ్వే కావాలి’కి జాతీయ అవార్డు రాగా మరికొన్నింటిని నందీ అవార్డులు వరించాయి.

News June 8, 2024

రామోజీరావు మృతిపై CBN, రేవంత్, KCR, లోకేశ్ సంతాపం

image

రామోజీరావు సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారని TDP చీఫ్ చంద్రబాబు తెలిపారు. సమాజహితం కోసం అనుక్షణం పనిచేశారన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని TG CM రేవంత్ కొనియాడారు. వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల అధిపతిగా ఎనలేని సేవలందించారని KCR తెలిపారు. అలుపెరగని అక్షర యోధుడికి కన్నీటి నివాళి అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

News June 8, 2024

రామోజీ సక్సెస్‌లో ఈటీవీ 9PM న్యూస్ ఒకటి

image

రామోజీరావు కెరీర్‌ సక్సెస్‌లోETV 9PM న్యూస్ ఒకటి. రోజంతా జరిగిన ముఖ్యమైన విషయాలను 30 నిమిషాల్లో తెలిపే ఈ బులిటెన్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఇది ఇప్పటికీ హైయెస్ట్ TRPని కలిగి ఉందనడంలో అతిశయోక్తి లేదు. 1995లో ఈటీవీని రామోజీ ప్రారంభించగా కొద్ది రోజుల్లోనే ప్రజల ఆదరణ పొందింది. దీని తర్వాత ఎన్నో న్యూస్ ఛానల్స్ వచ్చినప్పటికీ ఈటీవీ 9PM న్యూస్ ఎంతో మందికి ఫేవరెట్. మరి మీకు?

News June 8, 2024

T20 వరల్డ్‌కప్‌లో మరో సంచలనం

image

టీ20 WCలో న్యూజిలాండ్‌కు అఫ్గానిస్థాన్ షాకిచ్చింది. గ్రూప్-Cలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచులో 84 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన AFG 159 రన్స్ చేయగా, అనంతరం కివీస్ 75 పరుగులకే ఆలౌటైంది. AFG జట్టులో గుర్బాజ్ 80, జద్రాన్ 44 రన్స్‌తో రాణించారు. రషీద్ ఖాన్ 4, ఫారూఖీ 4, నబీ 2 వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో ఇప్పటికే పాకిస్థాన్‌ను USA ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

News June 8, 2024

నన్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది రామోజీరావే: Jr.NTR

image

రామోజీరావు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని Jr.NTR ట్వీట్ చేశారు. ‘శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ‘‘నిన్ను చూడాలని’’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

News June 8, 2024

ఆదివారపు ‘పంచతంత్రం, శ్రీ భాగవతం’ జ్ఞాపకాలు

image

రామోజీరావు స్థాపించిన ఈటీవీలో ప్రసారమైన అనేక కార్యక్రమాలు తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా 1990వ దశకంలో పుట్టిన వారిలో చాలామందికి ఆ సీరియళ్లతో ప్రత్యేక అటాచ్‌మెంట్ ఉంటుంది. ప్రతి ఆదివారం వచ్చే పంచతంత్రం, శ్రీ భాగవతం సమయానికి టీవీల ముందు అతుక్కుపోయేవారు. వీటితో పాటు రాత్రిపూట ఆడవాళ్ల కోసం సీరియళ్లు.. అందరి కోసం రా.9గంటలకు ఎవర్‌గ్రీన్ ‘9PM న్యూస్’ టీవీల ముందు కూర్చోబెట్టేవి.