India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మీడియా దిగ్గజం రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.
రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపై పొలిటికల్ లీడర్లు KTR, హరీశ్, షర్మిల సంతాపం ప్రకటించారు. ‘రామోజీ మృతితో బాధపడ్డాను. రామోజీ స్వీయ నిర్మిత వ్యక్తి, ఆయన కథ స్ఫూర్తిదాయకం’ అని కేటీఆర్ అన్నారు. ‘అనేక రంగాల్లో అద్భుత విజయాలందుకుని, భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు’ అని షర్మిల.. ‘రామోజీరావు తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
వందేభారత్ రైళ్ల సగటు వేగం గత మూడేళ్లలో 84.48Kmph నుంచి 76.25Kmphకి తగ్గిందని RTI కింద అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానమిచ్చింది. ఈ రైళ్ల గరిష్ఠ వేగం ఢిల్లీ-ఆగ్రా మార్గంలో 160KM ఉండగా, మిగతా ప్రాంతాల్లో 130km లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల వేగాన్ని పెంచేందుకు రైల్వే ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఆ పనులు పూర్తయిన తర్వాత రైళ్లు 250km వేగంతో వెళ్తాయని చెబుతున్నారు.
టీ20వరల్డ్ కప్‌లో శ్రీలంకకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9వికెట్లకు 124 రన్స్ మాత్రమే చేసింది. ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఓటమితో శ్రీలంక సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ అక్కడి నుంచే సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఓ మీడియా దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి.
తెలుగు భాష నిత్యమై, నిఖిలమై వెలగాలని ఆకాంక్షించిన వారిలో రామోజీరావు ముందుంటారు. మన భాషలో ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ పదాలను తెలుగీకరించేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ‘తెలుగు వెలుగు’ మాసపత్రికకు శ్రీకారం చుట్టారు. ‘ఈనాడు’లోనూ ఆయన పరభాష పదాల నియంత్రణకు కృషి చేశారు. ప్రతి పదాన్నీ తెలుగీకరించే క్రమంలో విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. అయినా పట్టించుకోకుండా తెలుగుపై అభిమానాన్ని మాత్రం చంపుకోలేదాయన.
వ్యూహాత్మకంగా ఇరాన్‌లో చాబహార్, మయన్మార్‌లో సిట్వే పోర్టులను నిర్మించిన భారత్ ఇప్పుడు మరోసారి చైనాను దెబ్బకొట్టాలని భావిస్తోంది. బంగ్లాదేశ్‌లోని మోంగ్లా పోర్టులో కొత్త టెర్మినల్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. చైనా సైతం ఈ పోర్టు నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ భారత్ ఇందులో సక్సెస్ అయితే విదేశాల్లోని తమ ప్రమేయాన్ని విస్తరించాలన్న చైనా వ్యూహాలకు చెక్ పడినట్లు అవుతుంది.
రామోజీరావు మానస పుత్రిక ‘ఈనాడు’ ప్రారంభించి ఈఏడాది ఆగస్టు 10 నాటికి 50 ఏళ్లు పూర్తవుతాయి. 1974లో ఈనాడు ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీరావు ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ సంచలనం సృష్టించారు. నిత్యం తె.జా 3-4 గంటల మధ్య ఈనాడు పేపర్ చదవడం ఆయనకు అలవాటు. మరో 2 నెలల్లో ఆ పేపర్‌కు 50 ఏళ్లు నిండనుండగా ఈ అరుదైన ఘట్టాన్ని చూడకుండానే రామోజీరావు కన్నుమూయడం విషాదకరం.
భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తెచ్చిన దార్శనికుడు రామోజీ రావు మరణం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. ‘భారతదేశ అభివృద్ధి పట్ల రామోజీ చాలా మక్కువ చూపేవారు. ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం చాలాసార్లు లభించడం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో రామోజీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు సానుభూతి’ అని Xలో నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు.
‘ఉషాకిరణ్ మూవీస్’తో సినీ పరిశ్రమపైనా రామోజీ రావు తనదైన ముద్ర వేశారు. తెలుగు, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 80కిపైగా ఫీల్ గుడ్ చిత్రాలు నిర్మించారు. ఎందరో నటులు, దర్శకులు, సంగీత దర్శకులను పరిచయం చేశారు. కీరవాణి, శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, తరుణ్, డైరెక్టర్ తేజ, జెనీలియా, శ్రియ మొదలైన ప్రముఖులు అలా వచ్చిన వారే. ఆయన సినిమాల్లో ‘నువ్వే కావాలి’కి జాతీయ అవార్డు రాగా మరికొన్నింటిని నందీ అవార్డులు వరించాయి.
Sorry, no posts matched your criteria.