news

News March 22, 2024

ఈసారి RCB గెలుస్తుందని ఆశిస్తున్నా.. ఎందుకంటే?: ABD

image

కాసేపట్లో చెన్నై, బెంగళూరు మధ్య IPL-2024 సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కామెంటేటరీ అవతారం ఎత్తిన RCB మాజీ ప్లేయర్ AB డివిలియర్స్ ఈసారి తమ జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నా జెర్సీ నంబర్ 17. ఇది 17వ IPL సీజన్. కాబట్టి ఈసారి RCB గెలుస్తుందని అనుకుంటున్నా’ అని అన్నారు.

News March 22, 2024

నమ్మిన వారే గొంతు కోశారు: MLA నల్లపురెడ్డి

image

AP: తాను నమ్మిన నాయకులే గొంతు కోశారని కోవూరు MLA నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొందరు నేతలు తనను అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు వారంతా టీడీపీ MP అభ్యర్థి వేమిరెడ్డి పంచన చేరుతున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో వారందరికీ తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. తాను నోరు విప్పితే వేమిరెడ్డి జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనే ఉండరన్నారు.

News March 22, 2024

టిల్లు స్క్వేర్ మూవీకి U/A సర్టిఫికెట్

image

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్లలో అనుపమ గ్లామర్, కొన్ని డైలాగ్స్, సీన్లు చూసి అడల్ట్ కంటెంట్ అనుకున్నారంతా. కానీ సెన్సార్ సర్టిఫికెట్‌తో అలాంటి రూమర్లకు తెరపడినట్లయింది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా టిల్లు చేరువ కానున్నాడు. కాగా ఈ సినిమా మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

News March 22, 2024

ఒడిశాలో పట్నాయక్‌తో బీజేపీ కటీఫ్

image

ఎన్నికల వేళ ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటున్న బీజేపీ ఒడిశాలో ప్లాన్ మార్చింది. సీఎం నవీన్ పట్నాయక్‌కు చెందిన బీజేడీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. కేంద్రానికి మద్దతు ఇస్తున్నందుకు ఓవైపు బీజేడీకి ధన్యవాదాలు చెప్తూనే.. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగనుంది.

News March 22, 2024

భర్త అరెస్టుపై స్పందించిన కేజ్రీవాల్ భార్య

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత తొలిసారి స్పందించారు. ‘కేజ్రీవాల్ ఎప్పుడూ ఢిల్లీ ప్రజల తరఫున నిలబడ్డారు. ఆయన అరెస్ట్ అక్రమం’ అని తెలిపారు. కాగా కాసేపట్లో కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై కోర్టు తీర్పు వెలువరించనుంది. కేసు నేపథ్యంలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తే సునీత లేదా విద్యాశాఖ మంత్రి అతిశీ సీఎం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

News March 22, 2024

పిఠాపురం నుంచే పవన్ ప్రచారం షురూ

image

AP: పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని జనసేన పార్టీ ప్రకటించింది. వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలుపెడతారని, ఆ నియోజకవర్గంలోనే 3 రోజులు ఉంటారని తెలిపింది. తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని, అప్రమత్తంగా ఉండాలని పవన్ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు జనసేన పేర్కొంది.

News March 22, 2024

ఇలా జరిగితే ముంబైదే IPL-2024 కప్పు!

image

మరికొద్ది సేపట్లో IPL-2024 టోర్నీ ప్రారంభం కానుండగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. IPL ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగితే ఫైనల్స్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందుతుందట. 2019 IPLలో ఇదే జరిగిందని చెబుతున్నారు. ఆ టోర్నీ తొలి మ్యాచ్‌లో RCB కేవలం 70 పరుగులే చేయడం గమనార్హం.

News March 22, 2024

సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే?

image

CM పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే విద్యాశాఖ మంత్రి ఆతిశీ, వైద్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఈ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేజ్రీవాల్‌కు ఆతిశీ అత్యంత సన్నిహితురాలు. సౌరభ్ సైతం చురుగ్గా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లగలరనే పేరుంది. వీరికి తోడు కేజ్రీవాల్ సతీమణి సునీత పేరు కూడా వినిపిస్తోంది.

News March 22, 2024

ఎవరు ఎలాంటి వారో నేడు అర్థమైంది: శ్రీదేవి

image

AP: వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆసక్తికర ట్వీట్ చేశారు. టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ సీటు ఆశించిన ఆమెకు భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో ‘రాజకీయాలు ఎలా ఉంటాయో..ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమయింది’ అని ట్వీట్ చేశారు. బాపట్ల జిల్లా మ్యాప్‌, ట్యాగ్‌ని జత చేసి పక్కన కత్తి సింబల్ ఉంచారు. కాగా ఈ సీటును మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్‌కు టీడీపీ కేటాయించింది.

News March 22, 2024

మనుషులు కాదు.. క్రూర మృగాలు

image

AP: ధన దాహంతో మనుషులు క్రూర మృగాళ్లలా మారుతున్నారు. బంగారు నగల కోసం ఓ వృద్ధురాలని ముక్కలుగా నరికి చంపేశారు. అనంతపురం(D) ఎర్రగుంట్లలో ఈ దారుణం జరిగింది. ఓబులమ్మ(84) అనే వృద్ధురాలు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇంట్లో శుభకార్యం కోసం 7తులాల బంగారం ఇచ్చింది. వారు తిరిగి ఇవ్వకపోవడంతో పెద్దలను ఆశ్రయించింది. దీంతో కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు గొడవకు దిగి ఆమెను ముక్కలుగా నరికి పెనకచర్ల డ్యామ్‌లో పడేశారు.

error: Content is protected !!