news

News June 8, 2024

తెలుగు సినిమాలో రామోజీ ‘ఉషాకిరణం’

image

‘ఉషాకిరణ్ మూవీస్’తో సినీ పరిశ్రమపైనా రామోజీ రావు తనదైన ముద్ర వేశారు. తెలుగు, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 80కిపైగా ఫీల్ గుడ్ చిత్రాలు నిర్మించారు. ఎందరో నటులు, దర్శకులు, సంగీత దర్శకులను పరిచయం చేశారు. కీరవాణి, శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, తరుణ్, డైరెక్టర్ తేజ, జెనీలియా, శ్రియ మొదలైన ప్రముఖులు అలా వచ్చిన వారే. ఆయన సినిమాల్లో ‘నువ్వే కావాలి’కి జాతీయ అవార్డు రాగా మరికొన్నింటిని నందీ అవార్డులు వరించాయి.

News June 8, 2024

రామోజీరావు మృతిపై CBN, రేవంత్, KCR, లోకేశ్ సంతాపం

image

రామోజీరావు సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారని TDP చీఫ్ చంద్రబాబు తెలిపారు. సమాజహితం కోసం అనుక్షణం పనిచేశారన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని TG CM రేవంత్ కొనియాడారు. వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల అధిపతిగా ఎనలేని సేవలందించారని KCR తెలిపారు. అలుపెరగని అక్షర యోధుడికి కన్నీటి నివాళి అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

News June 8, 2024

రామోజీ సక్సెస్‌లో ఈటీవీ 9PM న్యూస్ ఒకటి

image

రామోజీరావు కెరీర్‌ సక్సెస్‌లోETV 9PM న్యూస్ ఒకటి. రోజంతా జరిగిన ముఖ్యమైన విషయాలను 30 నిమిషాల్లో తెలిపే ఈ బులిటెన్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఇది ఇప్పటికీ హైయెస్ట్ TRPని కలిగి ఉందనడంలో అతిశయోక్తి లేదు. 1995లో ఈటీవీని రామోజీ ప్రారంభించగా కొద్ది రోజుల్లోనే ప్రజల ఆదరణ పొందింది. దీని తర్వాత ఎన్నో న్యూస్ ఛానల్స్ వచ్చినప్పటికీ ఈటీవీ 9PM న్యూస్ ఎంతో మందికి ఫేవరెట్. మరి మీకు?

News June 8, 2024

T20 వరల్డ్‌కప్‌లో మరో సంచలనం

image

టీ20 WCలో న్యూజిలాండ్‌కు అఫ్గానిస్థాన్ షాకిచ్చింది. గ్రూప్-Cలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచులో 84 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన AFG 159 రన్స్ చేయగా, అనంతరం కివీస్ 75 పరుగులకే ఆలౌటైంది. AFG జట్టులో గుర్బాజ్ 80, జద్రాన్ 44 రన్స్‌తో రాణించారు. రషీద్ ఖాన్ 4, ఫారూఖీ 4, నబీ 2 వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో ఇప్పటికే పాకిస్థాన్‌ను USA ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

News June 8, 2024

నన్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది రామోజీరావే: Jr.NTR

image

రామోజీరావు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని Jr.NTR ట్వీట్ చేశారు. ‘శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ‘‘నిన్ను చూడాలని’’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

News June 8, 2024

ఆదివారపు ‘పంచతంత్రం, శ్రీ భాగవతం’ జ్ఞాపకాలు

image

రామోజీరావు స్థాపించిన ఈటీవీలో ప్రసారమైన అనేక కార్యక్రమాలు తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా 1990వ దశకంలో పుట్టిన వారిలో చాలామందికి ఆ సీరియళ్లతో ప్రత్యేక అటాచ్‌మెంట్ ఉంటుంది. ప్రతి ఆదివారం వచ్చే పంచతంత్రం, శ్రీ భాగవతం సమయానికి టీవీల ముందు అతుక్కుపోయేవారు. వీటితో పాటు రాత్రిపూట ఆడవాళ్ల కోసం సీరియళ్లు.. అందరి కోసం రా.9గంటలకు ఎవర్‌గ్రీన్ ‘9PM న్యూస్’ టీవీల ముందు కూర్చోబెట్టేవి.

News June 8, 2024

రామోజీరావుకు వెంకయ్య నాయుడు, చిరంజీవి నివాళి

image

మీడియా దిగ్గజం రామోజీరావుకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిరంజీవి, చంద్రబోస్ నివాళులర్పించారు. ‘రామోజీ రావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణం’ అని వెంకయ్య నాయుడు Xలో పోస్ట్ చేశారు. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివి కేగిందని చిరంజీవి ట్వీట్ చేశారు.

News June 8, 2024

తన పేరు తానే పెట్టుకున్న రామోజీ

image

మీడియా టైకూన్ రామోజీరావు అసలు పేరు అది కాదు. తల్లిదండ్రులు వెంకటసుబ్బారావు-సుబ్బమ్మ ఆయనకు ‘రామయ్య’ అని పేరు పెట్టారు. కానీ బడిలో టీచర్లకు తన పేరును రామోజీరావుగా చెప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన పేరు అలాగే స్థిరపడిపోయింది. మీడియా సంస్థల అధిపతిగా, దిగ్గజ వ్యాపారవేత్తగా రామోజీ రావు అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనేంతలా ఆయన ఎదిగిపోయారు.

News June 8, 2024

రామోజీరావు నిర్మించిన సినిమాలు

image

శ్రీవారికి ప్రేమలేఖ(1984), మయూరి(1985), మౌన పోరాటం(1989), ప్రతిఘటన(1987), పీపుల్స్ ఎన్‌కౌంటర్(1991), అశ్వని(1991), మెకానిక్ మామయ్య(1999), మూడుముక్కలాట (2000), చిత్రం, నువ్వే కావాలి(2000), ఇష్టం(2001), ఆనందం (2001), ఆకాశ వీధిలో(2001), నిన్ను చూడాలని(2001), తుఝె మేరీ కసమ్, వీధి(2005), నచ్చావులే(2008), నిన్ను కలిశాక(2009), దాగుడుమూత దండాకోర్(2015) వంటి 87 సినిమాలను రామోజీరావు నిర్మించారు.

News June 8, 2024

బాలీవుడ్‌పై కంగన ఫైర్.. పోస్ట్ డిలీట్

image

తనపై CISF కానిస్టేబుల్ దాడి చేయడంపై బాలీవుడ్ స్పందించకపోవడాన్ని నటి, MP కంగన తప్పుబట్టారు. ‘నాపై ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై మీరు మౌనంగా ఉండొచ్చు. భవిష్యత్తులో మీరు మన దేశంలో లేదా విదేశాల్లో నడుచుకుంటూ వెళుతుంటే ఇజ్రాయెల్/పాలస్తీనా వారు మీపై, మీ పిల్లలపై దాడి చేయొచ్చు. అప్పుడు మీ వాక్‌స్వాతంత్ర్యం కోసం నేను పోరాడుతున్నానని గుర్తిస్తారు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వెంటనే దాన్ని డిలీట్ చేశారు.