India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
<<13400528>>రామోజీరావు<<>> 1974 AUG 10న నక్కవానిపాలెం(విశాఖ)లో ‘ఈనాడు’ తొలి ఆఫీస్‌ను ప్రారంభించారు. 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులకు పునాది వేశారు. 1995లో ETV ఛానల్‌ను ప్రారంభించి ‘ఈటీవీ.. మీటీవీ’ స్లోగన్‌తో ప్రతి ఇంట వినోదాన్ని పంచారు. 2003లో ETV-2 పేరిట తెలుగు రాష్ట్రాల్లో తొలి 24 గంటల వార్తా ఛానల్‌ను తీసుకొచ్చారు. దీన్ని 2014లో ETV AP, TGగా మార్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీని నిర్మించిన మీడియా టైకూన్ చెరుకూరి రామోజీరావు సేవలకు ఎన్నో పురస్కారాలు/ డాక్టరేట్లు వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం & శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం & శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, యుధ్వీర్ అవార్దు, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి (రాజస్థాన్) అవార్డు, బి. డి. గోయెంకా అవార్డు, 2016లో సాహిత్యం, విద్య విభాగాలలో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.
మహాకవి శ్రీరంగం శ్రీనివాసురావు (శ్రీశ్రీ) కుమారుడు శ్రీరంగం వెంకట రమణ (59) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికా కనెటికట్ రాష్ట్రంలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం స్థానికంగానే ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు. వెంకట రమణ మృతి పట్ల సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు. పాతికేళ్ల క్రితం అమెరికా వెళ్లిన వెంకట రమణ, ఫైజర్ కంపెనీ పరిశోధన విభాగంలో పనిచేస్తున్నారు.
TG: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రేపు ఉ.10.30 నుంచి 1 వరకు జరగనుంది. దీనికి TGPSC అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌లు, పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నంబర్లను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 897 కేంద్రాల్లో 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
రామోజీరావు కృష్ణా(D) పెదపారుపూడిలో 1936 NOV 16న రైతు కుటుంబంలో జన్మించారు. BSc చేసి ఓ యాడ్ ఏజెన్సీలో చేరారు. 1961లో రమాదేవిని వివాహమాడారు. 1962లో ‘మార్గదర్శి’ని ప్రారంభించారు. అదే ఆయన తొలి బిజినెస్. తర్వాత అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. 1974లో ‘ఈనాడు’ను స్థాపించారు. ఫిల్మ్‌సిటీతో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. అనేక సినిమాలు నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్‌పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.
నార్వే చెస్ టోర్నీ-2024 విజేతగా మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచారు. ఫైనల్ రౌండ్‌లో ఫాబియానో కరువానాపై విజయం సాధించారు. కార్ల్‌సన్ నార్వే చెస్ ఛాంపియన్‌గా నిలవడం ఇది ఆరోసారి. కాగా ఈ టోర్నీలో ప్రజ్ఞానంద 9వ రౌండ్‌లో ఫాబియానో చేతిలో ఓడిపోయారు. మహిళల విభాగంలో జు వెన్జున్ (చైనా) టైటిల్‌ను గెలిచారు. ఈ టోర్నీలో కార్ల్‌సన్(17.5) తొలి స్థానం సంపాదించగా, నకమురా(15.5), ప్రజ్ఞానంద(14.5) 2, 3 స్థానాల్లో నిలిచారు.
ఈనెల 15 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ప్రధానిగా మోదీ, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. లోక్‌సభలో తొలి రెండు రోజులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం సభాపతిని ఎన్నుకుంటారు. మరునాడు రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 22వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఆరోగ్యం విషమంగా ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రామోజీరావు పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నటి, నూతన MP కంగనా రనౌత్‌ను ఎయిర్‌పోర్టులో <<13392151>>చెంప దెబ్బ<<>> కొట్టిన CISF జవాన్‌పై మొహాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై 323, 341 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు, ఆ రెండు బెయిలబుల్ సెక్షన్లేనని తెలుస్తోంది. అయితే CISF కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను ప్రస్తుతానికి అరెస్ట్ చేయలేదని సమాచారం.
Sorry, no posts matched your criteria.