news

News June 8, 2024

పెదపారుపూడి ‘పద్మవిభూషణ్’

image

రామోజీరావు కృష్ణా(D) పెదపారుపూడిలో 1936 NOV 16న రైతు కుటుంబంలో జన్మించారు. BSc చేసి ఓ యాడ్ ఏజెన్సీలో చేరారు. 1961లో రమాదేవిని వివాహమాడారు. 1962లో ‘మార్గదర్శి’ని ప్రారంభించారు. అదే ఆయన తొలి బిజినెస్. తర్వాత అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. 1974లో ‘ఈనాడు’ను స్థాపించారు. ఫిల్మ్‌సిటీతో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. అనేక సినిమాలు నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

News June 8, 2024

రామోజీరావు కన్నుమూత

image

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్‌పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.

News June 8, 2024

నార్వే చెస్ టోర్నీ విజేతగా కార్ల్‌సన్

image

నార్వే చెస్ టోర్నీ-2024 విజేతగా మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచారు. ఫైనల్ రౌండ్‌లో ఫాబియానో ​​కరువానాపై విజయం సాధించారు. కార్ల్‌సన్ నార్వే చెస్ ఛాంపియన్‌గా నిలవడం ఇది ఆరోసారి. కాగా ఈ టోర్నీలో ప్రజ్ఞానంద 9వ రౌండ్‌లో ఫాబియానో చేతిలో ఓడిపోయారు. మహిళల విభాగంలో జు వెన్జున్ (చైనా) టైటిల్‌ను గెలిచారు. ఈ టోర్నీలో కార్ల్‌సన్(17.5) తొలి స్థానం సంపాదించగా, నకమురా(15.5), ప్రజ్ఞానంద(14.5) 2, 3 స్థానాల్లో నిలిచారు.

News June 8, 2024

15 నుంచి లోక్‌సభ సమావేశాలు!

image

ఈనెల 15 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ప్రధానిగా మోదీ, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. లోక్‌సభలో తొలి రెండు రోజులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం సభాపతిని ఎన్నుకుంటారు. మరునాడు రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 22వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

News June 8, 2024

రామోజీరావు ఆరోగ్యం విషమం

image

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఆరోగ్యం విషమంగా ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రామోజీరావు పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలుస్తోంది.

News June 8, 2024

కంగనాను కొట్టిన CISF జవాన్‌పై కేసు

image

బాలీవుడ్ నటి, నూతన MP కంగనా రనౌత్‌ను ఎయిర్‌పోర్టులో <<13392151>>చెంప దెబ్బ<<>> కొట్టిన CISF జవాన్‌పై మొహాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై 323, 341 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు, ఆ రెండు బెయిలబుల్ సెక్షన్లేనని తెలుస్తోంది. అయితే CISF కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను ప్రస్తుతానికి అరెస్ట్ చేయలేదని సమాచారం.

News June 8, 2024

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు

image

TG: నైరుతి పవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. 10, 11 తేదీల్లో నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని సూచించింది.

News June 8, 2024

కాంగ్రెస్ పార్లమెంటరీ నేతగా రాహుల్?

image

ఈ సార్వత్రిక ఎన్నికల్లో 99 MP స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ గత 10ఏళ్లలో మొదటిసారి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందనుంది. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ హోదాను స్వీకరించాలని పార్టీలోని ఓ వర్గం బలంగా కోరుతోంది. నేడు జరిగే CWC, పార్లమెంటరీ పార్టీ భేటీల్లో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

News June 8, 2024

నేడు ఢిల్లీలో CWC భేటీ

image

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు ఢిల్లీలో నేడు CWC భేటీ జరగనుంది. ఉ.11గంటలకు ఇది మొదలుకానుంది. ఈ భేటీకి సోనియా, ప్రియాంక, రాహుల్‌తో పాటు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకులు, పీసీసీ అధ్యక్షులు హాజరవుతారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అందరికీ విందు ఇవ్వనున్నారు. సాయంత్రం 5.30గంటలకు పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంటుంది.

News June 8, 2024

రామోజీరావుకు తీవ్ర అస్వస్థత

image

ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు గుండె సంబంధిత సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం రామోజీరావు ఐసీయూలో కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.