news

News September 8, 2025

BRSకు రాజకీయంగా కనెక్టివిటీ పోయింది: ఎంపీ చామల

image

TG: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేమని <<17647664>>BRS<<>> చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితంతో రాజకీయంగా వీరికి కనెక్టివిటీ పోయిందని దుయ్యబట్టారు. ఏ పార్టీకి చెందని సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికలకు దూరంగా ఉండటం చూస్తే లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ అవసరం లేని పార్టీగా మారిపోయిందన్నారు.

News September 8, 2025

రాష్ట్రంలో యూరియా సమస్య ఉండొద్దు: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించి యూరియా పంపిణీపై ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యూరియా సమస్య లేకుండా చూడాలని, దీనిపై రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు. ‘క్వింటా ఉల్లి ధర రూ.1,200కు తగ్గకూడదు. రూ.1,200కు తగ్గితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అరకు కాఫీ తోటల్లోని బెర్రీ బోరర్ తెగులు ఇతర ప్రాంతాలకు సోకకుండా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన దిశానిర్దేశం చేశారు.

News September 8, 2025

CPGET ఫలితాలు విడుదల

image

TG: రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల్లో MA, M.COM, MSC తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన CPGET (Common Post Graduate Entrance Tests-2025) ఫలితాలు విడుదలయ్యాయి. <>https://cpget.tgche.ac.in/<<>>లోకి వెళ్లి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఆగస్టు 6 నుంచి 11 వరకు జరిగిన ఈ పరీక్షలకు 45,477 మంది హాజరయ్యారు.

News September 8, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఏ పార్టీ మద్దతు ఎవరికి?

image

రాధాకృష్ణన్(ఎన్డీఏ అభ్యర్థి): బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన-షిండే, YCP, LJP, అన్నాడీఎంకే(పళనిస్వామి), JDS, జనసేన, RLD, అప్నాదళ్, NCP(అజిత్ పవార్), SKM, స్వతంత్రులు.
సుదర్శన్ రెడ్డి (ఇండీ కూటమి): కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, TMC, ఆప్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్), NCP(శరద్ పవార్), RJD(లాలూ), CPM, CPI, ఎంఐఎం.
* బీఆర్ఎస్(4), బీజేడీ(7) దూరం.

News September 8, 2025

ఆసియాకప్ విజేతలు వీరే..

image

1984 నుంచి 2023 వరకు 14 సార్లు వన్డే, రెండు సార్లు టీ20 ఫార్మాట్లలో జరిగిన ఆసియాకప్‌లో అత్యధిక సార్లు టీమ్ ఇండియా(8) విజేతగా నిలిచింది. శ్రీలంక ఆరు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజయం సాధించాయి. ఈ సారి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లోనే ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. చివరగా వన్డే ఫార్మాట్‌లో జరగగా రోహిత్ సారథ్యంలో భారత జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది.

News September 8, 2025

మూత్ర విసర్జన ఆపినందుకు కాల్చి చంపాడు

image

USలో గన్ కల్చర్ తీవ్రతకు అద్దం పట్టే ఘటన ఇది. హరియాణాకు చెందిన కపిల్ (26) రూ.45 లక్షలు ఖర్చు పెట్టి 2022లో డంకీ రూట్ ద్వారా USకు వెళ్లాడు. అక్కడ అరెస్టై లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా బయటకు వచ్చి కాలిఫోర్నియాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శనివారం బహిరంగంగా మూత్రవిసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని అడ్డుకున్నాడు. దీంతో వాగ్వాదం చెలరేగింది. అతడు కాల్పులు జరపడంతో కపిల్ తీవ్రగాయాలతో ప్రాణాలు వదిలాడు.

News September 8, 2025

ఎరువుల సరఫరాలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష: పొన్నం

image

TG: ఎరువుల సరఫరా విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని ఫైరయ్యారు. తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది వారి ఉద్దేశమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవమని తెలిపారు.

News September 8, 2025

రూ.20 కోట్ల విలువైన వాచ్ ధరించిన పాండ్య

image

టీమ్ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన విలాసవంతమైన జీవనశైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. దుబాయ్‌లో జరగనున్న ఆసియా కప్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన రూ.20 కోట్ల విలువైన లగ్జరీ వాచ్ ధరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన వాచ్‌లలో ఒకటి. రిచర్డ్ మిల్లె RM 27-04 మోడల్ వాచ్‌లు ప్రపంచంలో మొత్తం 50 మాత్రమే ఉన్నాయి. ఆసియా కప్ (₹2.6CR) ప్రైజ్ మనీ కంటే వాచ్ ధర దాదాపు పది రెట్లు ఎక్కువ.

News September 8, 2025

ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలి: సుప్రీంకోర్టు

image

ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలని ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ ఆధార్ కార్డు జెన్యూన్‌గా ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించింది. దీనిని 12వ డాక్యుమెంట్‌గా పరిగణించాలని పేర్కొంది. బీహార్ సమగ్ర ఓటరు సర్వేపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది.

News September 8, 2025

IASల బదిలీ.. TTD ఈవోగా సింఘాల్

image

ఏపీ ప్రభుత్వం 11 మంది IAS అధికారులను <>బదిలీ<<>> చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌, GAD సెక్రటరీగా శ్యామలారావు, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబు, ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముకేశ్ కుమార్ మీనా, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, హెల్త్ సెక్రటరీగా సౌరవ్ గౌర్‌ను నియమించింది.