news

News March 22, 2024

‘నేను నమ్మిందే నిజమైంది’.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు మాజీ జడ్జి

image

అధికారం వస్తే దురాశ మనల్ని ఆవహిస్తుందనే విషయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ స్పష్టం చేసిందన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే. “అవినీతిపై ఉద్యమిస్తున్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్తేనే అవినీతి అంతం చేయగలమని ఓ వర్గం వాదించింది. కానీ నేను ఏకీభవించలేదు. ఇప్పుడు నేను నమ్మిందే నిజమైంది” అని తెలిపారు. కాగా గతంలో అన్నా హజారే, కేజ్రీవాల్‌తో కలిసి హెగ్డే అవినీతిపై ఉద్యమించారు.

News March 22, 2024

పాత రూ.100 నోట్లు చెల్లవంటూ ప్రచారం

image

పాత రూ.100 నోట్లు చెల్లవంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ‘పాత రూ.100 నోట్లను మార్చి 31లోపు ఖర్చు పెట్టుకోండి. లేదా బ్యాంకులో రిటర్న్ చేయండి. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి అవి చెల్లుబాటు కావు’ అంటూ మెసేజ్‌లను కొందరు వైరల్ చేస్తున్నారు. అయితే పాత రూ.100 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఫేక్ మెసేజ్‌ను నమ్మకండి. ఇతరులకు ఫార్వర్డ్ చేయకండి.

News March 22, 2024

కంటైనర్‌లోని డ్రగ్స్ శాంపిల్స్‌ పరిశీలన

image

AP: విశాఖలో నిన్న పట్టుబడిన కంటైనర్‌లోని డ్రగ్స్ శాంపిల్స్‌ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. సీబీఐ న్యాయమూర్తి సమక్షంలో నేషనల్ ఫోరెన్సిక్ టీం డ్రగ్ టెస్ట్ చేస్తోంది. ఇందుకోసం 140 శాంపిల్స్ తీయాలని నిర్ణయించారు. కాగా, బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్‌లోని 25వేల కేజీల మాదకద్రవ్యాలను నిన్న సీబీఐ పట్టుకుంది.

News March 22, 2024

కొత్త ‘లిక్కర్ పాలసీ’ని ఎందుకు తెచ్చింది?

image

మద్యం వ్యాపారంలో మాఫియా నియంత్రణ, ప్రభుత్వ ఆదాయం పెంపు, వినియోగదారుల సమస్యల పరిష్కారం వంటి ఆలోచనలతో ఢిల్లీలోని AAP ప్రభుత్వం లిక్కర్ పాలసీని తెచ్చింది. ఈ ప్రకారం మద్యం విక్రయాలు ప్రైవేటు పరం అయ్యాయి. MRP కంటే తక్కువకే మద్యం అమ్మేలా ప్రోత్సహించడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి 27%ఆదాయం పెరిగిందని ప్రకటించింది. BJP ఆరోపణలతో ED రంగప్రవేశం చేయగా పాలసీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

News March 22, 2024

అమరావతిని నం.1గా తీర్చిదిద్దుతాం: లోకేశ్

image

AP: రాబోయే ఎన్నికల్లో తమను గెలిపిస్తే అమరావతిని దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని నారా లోకేశ్ చెప్పారు. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని లక్ష్యంతో చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తే.. మంగళగిరి MLA ఆర్కే కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. TDP-జనసేన-BJP కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ప్రతి ప్రాంతానికి సురక్షిత నీటిని అందిస్తామని హామీనిచ్చారు.

News March 22, 2024

IPLలో టాప్ కాంట్రవర్సీలు(Part 1)

image

* 2008: శ్రీశాంత్‌(PKBS)పై చేయి చేసుకున్న భజ్జీ(MI).
* 2009: డోప్ టెస్ట్‌లో పాక్ బౌలర్ ఆసిఫ్(DC) ఫెయిల్.. బ్యాన్.
* 2010: వేరే జట్టుతో బేరమాడటంతో జడేజా(RR)పై నిషేధం.
* 2011: క్రికెటర్లపై లైంగిక ఆరోపణలు చేసిన చీర్ లీడర్ గాబ్రియెల్లా పాస్‌క్వాలోటో(MI)పై వేటు.
* 2012: వాంఖడేలో సెక్యూరిటీతో షారుఖ్‌(KKR) గొడవ.. ఖాన్‌పై వాంఖడే నిషేధం.
* 2013: ఫిక్సింగ్‌కు‌ పాల్పడ్డ శ్రీశాంత్, చండీలా, చవాన్‌‌(RR).

News March 22, 2024

IPLలో టాప్ కాంట్రవర్సీలు(Part 2)

image

* 2014: తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పంజాబ్ కోఓనర్‌ వాడియాపై ప్రీతి జింటా ఫిర్యాదు.
* 2015: నిబంధనలు ఉల్లంఘించి స్టేడియంలో ప్రేయసి అనుష్కను కలిసిన కోహ్లీ.
* 2015: CSK, RRపై రెండేళ్ల నిషేధం.
* 2019: బట్లర్(RR)ను మన్కడ్ రూపంలో ఔట్ చేసిన అశ్విన్(PKBS)
* 2022: నోబాల్ వివాదంతో ఆటగాళ్లను వెనక్కి పిలిచిన పంత్(DC).
* 2023: కోహ్లీ, గంభీర్ మధ్య గొడవ.

News March 22, 2024

డ్రగ్స్ కేసు కూపీ లాగుతున్న సీబీఐ

image

AP: విశాఖలో పట్టుబడ్డ 25 వేల కేజీల డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు కాకినాడ జిల్లాకు చేరింది. యు.కొత్తపల్లి మండలం మూలపేటలోని సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పరిశ్రమలో ఇవాళ సీబీఐ అధికారులు దాడులు చేశారు. అక్కడి సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్‌ని విశాఖకు తరలించినట్లు సమాచారం. కాగా విశాఖకు చేరుకున్న డ్రగ్స్ కంటెయినర్ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పేరుతో బుక్ అయింది.

News March 22, 2024

రూ.49కే 25 GB

image

ఇవాళ్టి నుంచి IPL-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో జియో తన యూజర్లకు శుభవార్త చెప్పింది. రూ.49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌తో రోజుకు 25 జీబీ డేటాను అందిస్తోంది. ఆల్రెడీ యాక్టివ్ ప్లాన్ ఉన్న వారికే ఇది వర్తిస్తుంది. ఎయిర్‌టెల్‌లోనూ ఇదే ప్లాన్ ఉండగా.. 20GB డేటా మాత్రమే లభిస్తుంది. అలాగే జియో రూ.444 ప్లాన్‌లో 60 రోజుల వ్యాలిడిటీతో 100 GB డేటా లభిస్తుంది.

News March 22, 2024

IPL: CSKకు గుడ్‌న్యూస్

image

IPLలో తొలి మ్యాచుకు ముందు CSKకు గుడ్‌న్యూస్. గాయం కారణంగా దూరమైన ఆ జట్టు యంగ్ పేసర్ మతీశా పతిరణ ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని అతడి మేనేజర్ ట్విటర్‌లో ప్రకటించారు. అయితే పతిరణకు లంక బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే అతడు CSK జట్టులో చేరనున్నారు. దీంతో ఒకటి, రెండు మ్యాచులకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. కాగా ఇవాళ తొలి మ్యాచులో RCBతో CSK తలపడనుంది.

error: Content is protected !!