news

News March 22, 2024

తెలంగాణ వ్యక్తికి MP టికెట్ ఇచ్చిన చంద్రబాబు

image

AP: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు బాపట్ల (SC) ఎంపీ టికెట్ కేటాయించారు. 1960లో HYDలో జన్మించిన ఈయన NIT వరంగల్, అహ్మదాబాద్ IIMలో చదివారు. 1984లో IPSగా ఎంపికై.. మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలపడంలో కీలకపాత్ర పోషించారు. విజయవాడ సీపీగా పని చేశారు. ఈయన కొద్ది రోజుల క్రితం వరంగల్ BJP ఎంపీ టికెట్ ఆశించారు.

News March 22, 2024

లిక్కర్ స్కాం మొత్తం రూ.600 కోట్లకు పైనే: ED లాయర్

image

కేజ్రీవాల్ కనుసన్నల్లోనే ఢిల్లీ మద్యం విధానానికి రూపకల్పన జరిగిందని ఈడీ తరఫు లాయర్ ఎస్వీ రాజు కోర్టు దృష్టికి తెచ్చారు. ‘కిక్‌బ్యాక్‌లకు బదులుగా సౌత్ గ్రూప్ మద్యం వ్యాపారంపై పట్టు సాధించింది. ఈ నేర ఆదాయం రూ.100 కోట్ల లంచం మాత్రమే కాదు. లంచం చెల్లించే వారి ద్వారా వచ్చే లాభాలు కూడా ఉన్నాయి. అవన్నీ కలిపితే రూ.600 కోట్లకు పైమాటే. రూ.45 కోట్లు హవాలా ద్వారా గోవాకు బదిలీ చేశారు’ అని తెలిపారు.

News March 22, 2024

ఈ ఇద్దరు నేతలకు నిరాశే!

image

AP: YCP నుంచి TDPలో చేరి సస్పెన్షన్‌కు గురైన ఇద్దరు నేతల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు(D) తాడికొండ Ex MLA శ్రీదేవి, నెల్లూరు(D) ఉదయగిరి Ex MLA చంద్రశేఖర్ రెడ్డికి TDP మూడో జాబితాలోనూ చుక్కెదురైంది. ఆ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో.. ఇక వీరు ఈ ఎన్నికల బరిలో లేనట్లేనని తెలుస్తోంది. మరో ఇద్దరు నేతలు కోటంరెడ్డి(నెల్లూరుR), రామనారాయణ రెడ్డి(ఆత్మకూరు)కి TDP సీట్లు కేటాయించింది.

News March 22, 2024

అప్పుడు కటింగ్ షాప్.. కట్ చేస్తే రూ.1200 కోట్లు

image

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనేది నిజమే. ఇందుకు ఈ రమేశ్ ఉత్తమ ఉదాహరణ. తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణలో పెడితే వచ్చిన ఫలితం రూ.1200 కోట్లు. ఇంతకీ ఆయనకు వచ్చిన ఆ ఆలోచన ఏంటి, ఏం చేశారు? కటింగ్ షాపు నుంచి సీన్ కట్ చేస్తే ఇంత సంపద ఎలా వచ్చింది..? అనే విషయాల కోసం ఇక్కడ <>క్లిక్ చేయండి<<>>. ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం ఈ పేజ్ ఫాలో చేయండి.

News March 22, 2024

బిగ్‌బాస్ నటి అరెస్ట్

image

కన్నడ బిగ్‌బాస్ ఫేమ్ సోను శ్రీనివాస గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిదేళ్ల బాలికను ఆమె అక్రమంగా దత్తత తీసుకోవడంతో బైదరహళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను బాలికను దత్తత తీసుకున్నానంటూ ఇటీవల సోను సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు ఆమెపై ఫిర్యాదు చేశారు. సమాజంలో సానుభూతి, పేరు ప్రఖ్యాతల కోసమే ఆమె చిన్నారిని దత్తత తీసుకున్నట్లు పేర్కొన్నారు.

News March 22, 2024

పెస్టిసైడ్స్‌తో వణుకుడు రోగం

image

ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మనిషి శరీర భాగాల్లో వణుకు మొదలవుతుంది. కాగా ఈ వ్యాధికి పెస్టిసైడ్స్ ఓ కారణమని పరిశోధకులు తేల్చారు. అట్రాజైన్, లిండేన్, సిమేజైన్ వంటి 14 రకాల క్రిమిసంహారక మందుల ద్వారా ఈ వ్యాధి ప్రబలుతోందని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసేవారు, ఆయా పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందట.

News March 22, 2024

వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్

image

యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఏదైనా ఒక ముఖ్యమైన మెసేజ్‌ను టాప్‌లో పిన్ చేసుకునేందుకు అవకాశం ఉండగా, ఇకపై గరిష్ఠంగా 3 మెసేజ్‌లను పిన్ చేసుకునే వీలు కల్పించింది. పర్సనల్ చాట్‌లతోపాటు గ్రూప్స్‌, పోల్స్, ఫొటోలు, ఎమోజీలను కూడా పిన్ చేసుకోవచ్చు. ఇవి డిఫాల్ట్‌గా ఏడు రోజులు టాప్‌లో ఉంటాయి. కావాలనుకుంటే ఒక రోజు, 30 రోజులకు సెట్ చేసుకోవచ్చు.

News March 22, 2024

IPL-2024: సైన్ లాంగ్వేజ్‌లో కామెంటరీ

image

మరికొద్ది సేపట్లో IPL 2024 టోర్నీ ప్రారంభం కానుంది. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ కీలక ప్రకటన చేసింది. IPL చరిత్రలో తొలిసారి చెవుడు, దృష్టి లోపం ఉన్న క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వారికోసం సైన్ లాంగ్వేజ్‌లో కామెంటరీ చేయనున్నట్లు వెల్లడించింది. స్టార్ స్పోర్ట్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

News March 22, 2024

షిప్ లేటయింది.. గుట్టు రట్టయింది: TDP

image

AP: విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టుబడటంపై TDP ట్వీట్ చేసింది. ‘ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపు పోలీసులతో డ్రగ్స్ దింపేసి, బ్రెజిల్ మాఫియా దగ్గర డబ్బులు కొట్టేద్దామని ప్లాన్ వేశాడు. షిప్ వారం లేటుగా వచ్చింది. ఈలోపు ఇంటర్‌పోల్, CBI రంగంలోకి దిగి పట్టేశాయి. జగన్ రెడ్డి పోలీసులని, అధికారులను పంపించి CBI విచారణను అడ్డుకున్నారు. కానీ CBI నట్లు బిగించి సరుకు పట్టేసింది’ అని ఆరోపించింది.

News March 22, 2024

ధోనీ ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: మాజీ క్రికెటర్

image

IPLలో CSK కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ధోనీ ఆటగాడిగా కూడా రిటైర్ అయితే బాగుండేది. MSD ప్లేయర్‌గా ఉన్న జట్టును కెప్టెన్‌గా ముందుకు నడిపించడం రుతురాజ్‌కు సాధ్యం కాదు. కొత్త కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ధోనీ అంగీకరించవచ్చు. వద్దని చెప్పవచ్చు. ధోనీ గ్రౌండ్‌లో ఉంటే రుతురాజ్ సొంత నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు’ అని చెప్పుకొచ్చారు.

error: Content is protected !!