news

News June 7, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 7, శుక్రవారం ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:15 గంటలకు అసర్: సాయంత్రం 4:51 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6:49 గంటలకు ఇష: రాత్రి 8.11 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 7, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 7, శుక్రవారం
జ్యేష్ఠమాసం, శు.పాడ్యమి: సా.04.45 గంటల వరకు
మృగశిర: రాత్రి 07:43 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.08:13 నుంచి 09:05 వరకు తిరిగి మధ్యాహ్నం గం.12.32 నుంచి 01.23 వరకు
వర్జ్యం: అర్ధరాత్రి గం.01.44 నుంచి 03.18 వరకు

News June 7, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 7, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* ఈ నెల 9న సాయంత్రం మోదీ ప్రమాణస్వీకారం
* ఈ నెల 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
* చివరి మ్యాచ్ ఆడేసిన సునీల్ ఛెత్రి
* ఎంపీ కంగనకు చెంపదెబ్బ.. CISF కానిస్టేబుల్ సస్పెండ్
* ఎలక్షన్స్ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేత
* నటి హేమ ‘మా’ సభ్యత్వంపై సస్పెన్షన్
* TG: దోస్త్ ఫేజ్-1లో 76,290 సీట్లు కేటాయింపు

News June 7, 2024

తొలి ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్నకు ఆధిక్యం

image

TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 1,04,248, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్‌కు 29,697 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వీటిలో తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం దక్కింది.

News June 6, 2024

పంజాబ్ రైలు ప్రమాదానికి కారణమిదే

image

పంజాబ్‌లో గూడ్స్ రైలు <<13360515>>ప్రమాదానికి<<>> లోకోపైలట్లే కారణమని అధికారులు వెల్లడించారు. లోకో‌పైలట్‌తో సహా అసిస్టెంట్ కూడా నిద్రపోవడంతో రెడ్ సిగ్నల్ పడినా బ్రేకులు వేయలేదని నిర్ధారించారు. ఇదే విషయాన్ని వారు అంగీకరించినట్లు పేర్కొన్నారు.

News June 6, 2024

ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఓటమే!

image

AP: కాకినాడ జిల్లాకు చెందిన చలమలశెట్టి సునీల్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతూనే ఉంది. 2009 నుంచి ఇదే తంతు జరుగుతోంది. సునీల్ 2009లో PRP తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2014లో YCP తరఫున, 2019లో TDP తరఫున, 2024లో YCP తరఫున MPగా పోటీ చేయగా ఆయన ఓడిపోయారు. అలాగే ఆయన ప్రాతినిథ్యం వహించిన పార్టీలు కూడా ఓడాయి. దీంతో ఆయన ప్రతీసారి ఓడిపోబోయే పార్టీలోకే వెళ్తారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

News June 6, 2024

BREAKING: పిన్నెల్లికి హైకోర్టులో ఊరట

image

AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఈవీఎంల ధ్వంసం సహా 4 కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్‌ను పొడిగించింది. వారంపాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులపై గురువారం తదుపరి విచారణ చేస్తామని తెలిపింది. కాగా పిన్నెల్లిని ఇవాళ అరెస్టు చేస్తారని ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.

News June 6, 2024

హింసాత్మక ఘటనలపై పవన్ స్పందించాలి: బాలినేని

image

AP: ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి Xలో శుభాకాంక్షలు తెలిపారు. ‘హింసాత్మక ఘటనలకు తావులేదని నిన్న మీరిచ్చిన సందేశం హర్షణీయం. మీ వ్యాఖ్యలకు భిన్నంగా, ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింస, భౌతిక దాడులు, వేధింపులపై మీరు స్పందించాలి. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు’ అని రాసుకొచ్చారు.

News June 6, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు 897 కేంద్రాలు: TGPSC

image

TG: ఈ నెల 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లో 897 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఎగ్జామ్స్‌ను సజావుగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు ఒక అడిషనల్ కలెక్టర్‌తోపాటు ఓ ఉన్నతాధికారిని నియమించామన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ కోసం ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు.