news

News June 7, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* ఈ నెల 9న సాయంత్రం మోదీ ప్రమాణస్వీకారం
* ఈ నెల 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
* చివరి మ్యాచ్ ఆడేసిన సునీల్ ఛెత్రి
* ఎంపీ కంగనకు చెంపదెబ్బ.. CISF కానిస్టేబుల్ సస్పెండ్
* ఎలక్షన్స్ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేత
* నటి హేమ ‘మా’ సభ్యత్వంపై సస్పెన్షన్
* TG: దోస్త్ ఫేజ్-1లో 76,290 సీట్లు కేటాయింపు

News June 7, 2024

తొలి ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్నకు ఆధిక్యం

image

TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 1,04,248, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్‌కు 29,697 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వీటిలో తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం దక్కింది.

News June 6, 2024

పంజాబ్ రైలు ప్రమాదానికి కారణమిదే

image

పంజాబ్‌లో గూడ్స్ రైలు <<13360515>>ప్రమాదానికి<<>> లోకోపైలట్లే కారణమని అధికారులు వెల్లడించారు. లోకో‌పైలట్‌తో సహా అసిస్టెంట్ కూడా నిద్రపోవడంతో రెడ్ సిగ్నల్ పడినా బ్రేకులు వేయలేదని నిర్ధారించారు. ఇదే విషయాన్ని వారు అంగీకరించినట్లు పేర్కొన్నారు.

News June 6, 2024

ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఓటమే!

image

AP: కాకినాడ జిల్లాకు చెందిన చలమలశెట్టి సునీల్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతూనే ఉంది. 2009 నుంచి ఇదే తంతు జరుగుతోంది. సునీల్ 2009లో PRP తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2014లో YCP తరఫున, 2019లో TDP తరఫున, 2024లో YCP తరఫున MPగా పోటీ చేయగా ఆయన ఓడిపోయారు. అలాగే ఆయన ప్రాతినిథ్యం వహించిన పార్టీలు కూడా ఓడాయి. దీంతో ఆయన ప్రతీసారి ఓడిపోబోయే పార్టీలోకే వెళ్తారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

News June 6, 2024

BREAKING: పిన్నెల్లికి హైకోర్టులో ఊరట

image

AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఈవీఎంల ధ్వంసం సహా 4 కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్‌ను పొడిగించింది. వారంపాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులపై గురువారం తదుపరి విచారణ చేస్తామని తెలిపింది. కాగా పిన్నెల్లిని ఇవాళ అరెస్టు చేస్తారని ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.

News June 6, 2024

హింసాత్మక ఘటనలపై పవన్ స్పందించాలి: బాలినేని

image

AP: ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి Xలో శుభాకాంక్షలు తెలిపారు. ‘హింసాత్మక ఘటనలకు తావులేదని నిన్న మీరిచ్చిన సందేశం హర్షణీయం. మీ వ్యాఖ్యలకు భిన్నంగా, ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింస, భౌతిక దాడులు, వేధింపులపై మీరు స్పందించాలి. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు’ అని రాసుకొచ్చారు.

News June 6, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు 897 కేంద్రాలు: TGPSC

image

TG: ఈ నెల 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లో 897 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఎగ్జామ్స్‌ను సజావుగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు ఒక అడిషనల్ కలెక్టర్‌తోపాటు ఓ ఉన్నతాధికారిని నియమించామన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ కోసం ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు.

News June 6, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రేపు రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, విజయ నగరం, విశాఖలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News June 6, 2024

‘ఆపరేషన్ కాంబోడియా’.. 12 మంది ఏజెంట్ల అరెస్ట్: విశాఖ సీపీ

image

AP: ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలించగా వారిలో 68 మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఈ వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశామన్నారు. భారతీయులు లక్ష్యంగా ఏపీవాసులతో సైబర్ క్రైమ్‌లు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 90 మందిని కాంబోడియా నుంచి తీసుకురావాల్సి ఉందని వెల్లడించారు.

News June 6, 2024

2027లో మహేశ్-రాజమౌళి మూవీ రిలీజ్?

image

రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటించబోయే మూవీ షూటింగ్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లో షూటింగ్ చేస్తారని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.100 కోట్లతో భారీ సెట్ వేశారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ సిద్ధం చేశారని టాక్ నడుస్తోంది.