India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక పోరులో నిలిచిన రెండు ప్రాంతీయ పార్టీలు 100% స్ట్రైక్ రేట్ సాధించి సత్తా చాటాయి. ఏపీలో 21 అసెంబ్లీ, 2MP స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపిన జనసేన అన్నింట్లో గెలిచింది. అలాగే NDA కూటమి సీట్ల పంపకాల్లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి కేటాయించిన 5 MP స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కృషితో అన్నిచోట్లా నెగ్గింది. దీంతో అందరిచూపు పవన్, చిరాగ్ పాశ్వాన్ వైపు మళ్లింది.
AP: వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా మూడు హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 6 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ్టితో ఆ గడువు ముగియనుంది. దీంతో నరసరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
AP: టీడీపీ సీనియర్ నేతలతో నేడు చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడంపై బీజేపీ ప్రతిపాదనలు, రాష్ట్ర మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇటు ఇదే అంశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించి వారి అభిప్రాయాలను పవన్ తీసుకోనున్నారు.
AP అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి మొత్తంగా 55.28శాతం ఓట్లు సాధించగా, YCP 39.37శాతానికే పరిమితమైంది. విడివిడిగా చూస్తే టీడీపీకి 1,53,84,576(45.60%) ఓట్లు రాగా, YCPకి 1,32,84,134(39.37%), జనసేనకు 6.85శాతం ఓట్లు పోలయ్యాయి. YCP కంటే కూటమికి 53,72,166 ఓట్లు అధికంగా రాగా.. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య 21,00,442 ఓట్ల వ్యత్యాసం ఉంది. ఎన్నికల్లో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8, YCP 11 స్థానాల్లో గెలిచాయి.
AP: ఐపీఎస్ అధికారులు బిందుమాధవ్, అమిత్ బర్దార్‌లపై సస్పెన్షన్‌ను ఎన్నికల సంఘం ఎత్తివేసింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోవడంలో వీరు విఫలమయ్యారని వీరిపై ఈసీ వేటు వేసింది. మే 16న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది.
ఈ ఎన్నికల్లో <<13383445>>జైలు<<>> నుంచి పోటీ చేసిన అమృత్‌పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్ MPలుగా గెలిచారు. అయితే వారు జైలు నుంచి MPగా లోక్‌సభకు వెళ్లొచ్చా? అనే సందేహం చాలామందిలో నెలకొంది. జైల్లో ఉన్నవారు సభకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదు. అయినప్పటికీ వారు తాము సభకు హాజరుకాలేకపోతున్నామని స్పీకర్‌కు లేఖ పంపాలి. స్పీకర్ వారి అభ్యర్థనలను హౌస్ కమిటీకి పంపుతారు. ఆ తర్వాత కమిటీ చేసిన సిఫార్సుపై సభలో ఓటింగ్ ఉంటుంది.
AP: ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తన మావయ్య, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ Xలో విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందించారు. ‘థాంక్యూ వెరీ మచ్ అమ్మ’ అంటూ జూ.ఎన్టీఆర్‌కు బదులిచ్చారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలిపిన రామ్‌చరణ్, మహేశ్ బాబు, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులకు సైతం ఆయన ధన్యవాదాలు తెలిపారు.
AP: CBN కేబినెట్‌లో TDP నుంచి ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. అచ్చెన్నాయుడు, కూన రవి, కోండ్రు మురళి, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాస్, అయ్యన్న, పల్లా శ్రీనివాస్, యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని, RRR, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల, సోమిరెడ్డి, ఆనం, పరిటాల సునీత, అఖిలప్రియ, గౌరు చరిత సహా పలువురు రేసులో ఉన్నారు.
AP: తాజా ఎన్నికల్లో శ్రీనివాస్ పేరుతో NDA కూటమిలో మొత్తం 13 మంది గెలిచారు. వీరిలో అసెంబ్లీకి 11 మంది, లోక్‌సభకు ఇద్దరు వెళ్లనున్నారు. టీడీపీ నుంచి ఏడుగురు, జనసేన నుంచి ముగ్గురు, BJP నుంచి ఒకరు MLAలుగా ఎన్నికయ్యారు. బీజేపీ, జనసేన నుంచి ఒకరు చొప్పున MPలుగా గెలిచారు. 13 మందిలో కొందరి పేర్లు శ్రీనివాస్ కాగా, మరికొందరి పేర్లు శ్రీనివాసరావుగా ఉండటం గమనార్హం.
AP EAPCET ఫలితాల విడుదలలో జాప్యం కొనసాగుతోంది. వైసీపీ ఓడిపోవడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పదవికి హేమచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఉన్నత విద్యాశాఖ ఈ రాజీనామాపై అభ్యంతరం చెప్పడంతో ఆయన మెడికల్ లీవ్ పెట్టారు. దీంతో వైస్ ఛైర్మన్ రామమోహన్ రావుకు ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో EAPCET ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఏపీలోనూ త్వరగా విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.