news

News June 6, 2024

APలో కూటమి విజయంపై అనుమానాలు: YCP MLA

image

APలో TDP, JSP, BJP కూటమి ఘన విజయంపై ఎన్నో అనుమానాలున్నాయని ప్రకాశం(D) యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై అవిశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లు వారు నడుచుకున్నారని విమర్శించారు. అటు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు, టికెట్ ఇచ్చిన జగన్‌కు రుణపడి ఉంటానని చంద్రశేఖర్ అన్నారు.

News June 6, 2024

టీ20 ప్రపంచకప్‌లో నేడు 3 మ్యాచ్‌లు

image

టీ20 వరల్డ్ కప్‌లో ఈరోజు మూడు మ్యాచ్‌లు క్రికెట్ ప్రియులను అలరించనున్నాయి. ఇప్పటికే పపువా న్యూగినియా, ఉగాండా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఉ.6గంటలకు ఆస్ట్రేలియా, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రా.9గంటలకు పాకిస్థాన్‌ను అమెరికా ఢీకొంటుంది. దీంతో పాటు రా.12.30గంటలకు నమీబియా, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.

News June 6, 2024

అంతరిక్షంలో 1000 రోజులు!

image

వివిధ మిషన్లలో భాగంగా అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపిన తొలి వ్యోమగామిగా రష్యాకు చెందిన ఒలెగ్ కొనొనెంకో (59) నిలిచారు. 2008 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన అనుభవం ఒలెగ్‌కు ఉంది. కాగా ప్రస్తుత మిషన్ 2023 సెప్టెంబరు 15న ప్రారంభం కాగా ఈ ఏడాది SEP 23 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో మంగళవారం ఆయన ఈ రికార్డ్ చేరుకున్నట్లు రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్‌కాస్మోస్ వెల్లడించింది.

News June 6, 2024

TDP చరిత్రలో గెలవలేకపోయిన 2 స్థానాలు

image

AP: ఈసారి TDP ఎలక్షన్ వార్‌ను వన్‌సైడ్ చేసింది. అయితే చరిత్రలో గెలవలేకపోయిన 2 స్థానాల్లో(పులివెందుల, యర్రగొండపాలెం) ఈసారీ గెలవలేకపోయింది. పులివెందులలో 1978 నుంచి YS కుటుంబం గెలుస్తూ వస్తోంది. అక్కడ ప్రస్తుతం YS జగన్, ప్రకాశం(D) యర్రగొండపాలెంలో చంద్రశేఖర్(YCP) గెలిచారు. ఇది 1972లో నియోజకవర్గంగా రద్దయి 2009లో ఉనికిలోకి వచ్చింది. కాగా డీలిమిటేషన్‌తో ఏర్పడ్డ 6 స్థానాల్లో TDP ఈసారి బోణీ కొట్టింది.

News June 6, 2024

నేడు సునీల్ ఛెత్రీ ఆఖరి మ్యాచ్

image

భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రీ నేడు తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నారు. కోల్‌కతాలో కువైట్‌తో జరగనున్న ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో ఆడి వీడ్కోలు పలకనున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ప్రపంచకప్ మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్‌లో ఛెత్రి ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఛెత్రీ శకం నేటితో ముగియనుంది. ఈ మ్యాచ్ రాత్రి గం.7కు ప్రారంభమవుతుంది.

News June 6, 2024

T20ల్లో హిట్‌మ్యాన్ అరుదైన ఘనత

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ ఈ మార్క్ దాటారు. అలాగే తక్కువ బంతుల్లో 4వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్‌గానూ హిట్‌మ్యాన్ రికార్డులకెక్కారు.

News June 6, 2024

25ఏళ్లే అయినా అదరగొట్టారు!

image

ఈ లోక్‌సభ ఎన్నికల్లో 25ఏళ్ల వయసున్న నలుగురు అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి సత్తాచాటారు. బిహార్‌లోని సమస్తిపుర్‌‌‌లో శాంభవీ (LJP) 1.87లక్షల మెజార్టీతో గెలుపొందారు. రాజస్థాన్‌లోని భరత్‌పుర్ నుంచి పోటీకి దిగిన సంజనా జాతవ్ (కాంగ్రెస్) 51వేల మెజార్టీతో గెలిచారు. ఇక యూపీలోని కౌశాంబి నుంచి పుష్‌పేంద్ర సరోజ్ (SP) లక్ష మెజార్టీతో గెలుపొందారు. మచలీషెహర్‌లో ప్రియా సరోజ్ (SP) 35వేల మెజార్టీతో గెలిచారు.

News June 6, 2024

యాపిల్‌ను దాటేసిన ఎన్‌విడియా!

image

ప్రముఖ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియా (Nvidia) మార్కెట్ విలువలో యాపిల్‌ను దాటేసింది. బుధవారం సంస్థ షేర్లు దూసుకెళ్లడంతో మార్కెట్ విలువ $3 ట్రిలియన్ చేరింది. దీంతో ఆ సంస్థ అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రెండో స్థానానికి చేరింది. స్టాక్స్‌ను మరింత విభజించేందుకు Nvidia సిద్ధమవుతున్న నేపథ్యంలో షేర్లు దూసుకెళ్లాయి. కాగా అగ్రస్థానంలో మైక్రోసాఫ్ట్ ($3.14 ట్రిలియన్) కొనసాగుతోంది.

News June 6, 2024

LS POLLS: తగ్గిన మహిళా ఎంపీల సంఖ్య

image

ఈ లోక్‌సభ ఎన్నికల్లో 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తే 74 మంది విజేతలుగా నిలిచారు. గరిష్ఠంగా బెంగాల్ నుంచి 11 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే మహిళా ఎంపీల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అప్పుడు 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. దీంతో 18వ లోక్‌సభలో మహిళా ఎంపీల ప్రాతినిథ్యం 13.62శాతంగా ఉండనుంది. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

News June 6, 2024

మోదీ ప్రమాణ స్వీకారం.. మిత్రదేశాల నేతలకు ఆహ్వానం?

image

ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి మిత్రదేశాల నేతలను కేంద్రం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల నేతలు ఉన్నారు. మోదీ ఇప్పటికే నేపాల్ పీఎం ప్రచండ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక ప్రెసిడెంట్ విక్రమసింఘేను సంప్రదించారు. నేడు సంబంధిత దేశాల నేతలు అందరికీ అధికారికంగా ఆహ్వానం పంపించొచ్చని సమాచారం. కాగా ఈ వారంలోనే మోదీ ప్రమాణస్వీకారం ఉండనుంది.