India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP పర్యటనకు వస్తున్నట్లు ట్వీట్ చేసిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే రేపటి కార్యక్రమం రాష్ట్రాభివృద్ధిలో కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా తామంతా ఎదురుచూస్తున్నట్లు సీఎం చెప్పారు.
అయోధ్య రామమందిరంలోకి ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించాడు. కళ్ల జోడుకు ప్రత్యేకంగా అమర్చిన కెమెరాలతో మందిరంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో ఆలయ అధికారులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వడోదరకు చెందిన జైకుమార్‌గా గుర్తించారు. కాగా మందిరంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం.
చలికాలంలో నిద్రపై మనం రాత్రి తినే ఆహారం ప్రభావం ఉంటుంది. సుఖవంతమైన నిద్ర కోసం మంచి ఆహారం తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. కివి పండ్లు, చిలకడదుంప, అరటిపండ్లు తీసుకుంటే నిద్రకు ఉపక్రమించే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. పడుకునే ముందు గోరువెచ్చని పాలు, తేనే తీసుకుంటే నిద్రలేమి సమస్య తగ్గుతుందని అంటున్నారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్మారకచిహ్నం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంపై ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి తన కృతజ్ఞతల్ని తెలియజేశానని ఆమె ట్విటర్లో తెలిపారు. ‘నా మనస్ఫూర్తిగా పీఎంకు ధన్యవాదాలు. మేం అడగకపోయినా ప్రభుత్వం ఈ గౌరవం ఇవ్వడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఏ మాత్రం ఊహించలేదు’ అని పేర్కొన్నారు.
AP: మాజీ CM YS జగన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబరు 20న జగన్ పాస్‌పోర్టు గడువు ముగిసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టుకు NOC ఇచ్చేలా ఆదేశించాలన్న ఆయన విజ్ఞప్తిని ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.
AP: ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల సమర్పణ గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో మరో 5 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్వే వివరాలు ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ షాక్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఆప్‌నకు మరోసారి రావాలని గతంలోనూ ఆయన ఆకాంక్షించారు. తమకు మద్దతిచ్చినందుకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. యూపీతో సరిహద్దును పంచుకొనే ఢిల్లీలో అఖిలేశ్ మద్దతు తమకు లాభం చేకూరుస్తుందని ఆప్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షలు కేంద్రం తక్షణమే అందజేస్తుందని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు.
ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని విషయాల్లో నియంత్రణ అవసరం. జీవితాన్ని ఉత్తమంగా మార్చేందుకు ఈ 5Mను కంట్రోల్లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. *MOUTH-ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. *MIND-ప్రతి విషయంలో సానుకూల దృక్పథంతో ఉండాలి. *MANNER- మర్యాదపూర్వక ప్రవర్తన. *MOOD- భావోద్వేగాల నియంత్రణ. *MONEY- ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ వంటివి పాటిస్తే జీవితం మెరుగ్గా ఉంటుందని సూచిస్తున్నారు.
తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని ప్రతిపాదించింది. 2023 జులైలో రాష్ట్ర హైకోర్టు సీజేగా అలోక్ నియమితులయ్యారు. మరోవైపు బాంబే హైకోర్టు సీజే దేవేంద్ర కుమార్‌ను ఢిల్లీ HCకి బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.
Sorry, no posts matched your criteria.