news

News January 20, 2026

₹15 లక్షల భరణం అడిగిన భార్య.. భర్త ఏం చేశాడంటే..

image

భార్య ₹15 లక్షల భరణం అడిగిందని ఉద్యోగానికి రిజైన్ చేశాడో భర్త. కెనడాకు చెందిన దంపతులు సింగపూర్‌లో ఉంటున్నారు. 2023లో అతడు భార్యతో విడిపోయాడు. తనకు, పిల్లల(4)కు కలిపి నెలకు S$20వేలు(₹15L) భరణం ఇవ్వాలని ఆమె అడగడంతో జాబ్ మానేశాడు. 2023లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా అతడి వార్షిక జీతం S$8.6 లక్షలు(₹6Cr). ఈ క్రమంలో ఆమెకు S$6.34 లక్షలు(₹4.47Cr) చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది.

News January 20, 2026

పెట్టుబడుల గమ్యస్థానం AP: CM CBN

image

AP: బ్రాండ్‌ ఇమేజ్ కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీని మించిన పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని స్పష్టం చేశారు. వెయ్యి KMల సముద్రతీరం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు రాష్ట్రానికి బలమని పేర్కొన్నారు. 2047కు భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందన్నారు. దావోస్ సమ్మిట్‌లో ఇండియా లాంజ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.

News January 20, 2026

జోగి సోదరులకు బెయిల్

image

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకు బెయిల్ మంజూరైంది. భవానీపురంలో నమోదైన కేసులో బెయిల్ లభించగా, మొలకలచెరువు కేసులో ఆయన రిమాండ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

News January 20, 2026

4 గంటలుగా కొనసాగుతున్న హరీశ్ విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పీఎస్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ కొనసాగుతోంది. సుమారు 4 గంటలకుపైగా సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి హరీశ్ కూడా దీటుగా సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. అటు మాజీ మంత్రి విచారణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.

News January 20, 2026

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

image

పశ్చిమ గోదావరి జిల్లా కోర్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు JAN 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అర్హత సాధించి ఉండాలి. వయసు 18 – 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. westgodavari.dcourts.gov.in

News January 20, 2026

హోసూర్ ఎయిర్ పోర్టు: CBNపై TNలో వార్తలు

image

కృష్ణగిరి(D) హోసూరు(TN) ఎయిర్ పోర్టుకు అనుమతి రాకపోవడం వెనుక CBN హస్తముందని కొన్ని తమిళ పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విమానయాన మంత్రి రామ్మోహన్ TDP కావడమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నాయి. అక్కడికి దగ్గరలోని తన నియోజకవర్గం కుప్పంలో CBN ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయడాన్ని గుర్తుచేస్తున్నాయి. అయితే బెంగళూరు ఎయిర్ పోర్టు, HALకు దగ్గరలో ఉన్నందున హోసూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం అనుమతివ్వడం లేదు.

News January 20, 2026

కలియుగ విపత్తుల నుంచి రక్షణ పొందాలంటే..

image

‘కలి’ అంటే నీటిలో లీనమయ్యే యుగమని అర్థం. కలియుగ ప్రభావంతో అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించి జనజీవనం అతలాకుతలమవుతుంది. మనుషులు ప్రవాహాల్లో కొట్టుకుపోయేంత ప్రకృతి వైపరీత్యాలు ఈ కాలంలో సంభవిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఉపశమనం, మనశ్శాంతి పొందడానికి నిరంతర దైవధ్యానం, భగవంతుడి నామస్మరణ మాత్రమే ఏకైక మార్గమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. భక్తి మార్గమే ఈ కలి దోషాలకు నివారణ.

News January 20, 2026

పుత్తడి పరుగులు.. పెళ్లి చేసేదెలా?

image

ఫిబ్రవరి 19 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్న తరుణంలో బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడం సామాన్యులను కలవరపెడుతోంది. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే బంగారం తప్పనిసరి కావడంతో, ఈ పెరుగుదల సామాన్య కుటుంబాలపై పెను భారంగా మారింది. పసిడి పరుగులు ఇలాగే కొనసాగితే పెళ్లిళ్ల సమయానికి 10 గ్రాముల బంగారం రూ. 2 లక్షలకు చేరుతుందేమోనన్న భయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం 24క్యారెట్ల 10gల బంగారం ధర రూ.1.52లక్షలుగా ఉంది.

News January 20, 2026

INTER EXAMS: 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

image

TG: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. గతేడాది అమలు చేసిన ఈ నిబంధనలు ఈసారి కూడా కొనసాగించనున్నట్లు ఇంటర్ బోర్డ్ పేర్కొంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

News January 20, 2026

సరిహద్దుల్లో ఉగ్ర బంకర్లు.. మ్యాగీ, బియ్యం..

image

J&Kలోని కిష్త్వార్‌లో జైషే మహ్మద్(JeM) టెర్రరిస్టుల భారీ బంకర్‌ను భద్రతా బలగాలు కనుగొన్నాయి. వాళ్లు నెలల తరబడి అక్కడ షెల్టర్ తీసుకున్నారని గుర్తించాయి. 50 మ్యాగీ ప్యాకెట్లు, తాజా కూరగాయలు, 15 రకాల దినుసులు, 20KGs బాస్మతి బియ్యం, గ్యాస్ స్వాధీనం చేసుకున్నాయి. జైషే కమాండర్ సైఫుల్లా అక్కడ ఉన్నట్లు భావిస్తున్నాయి. బంకర్‌ను తాము గుర్తించడంతో టెర్రరిస్టులు గ్రనేడ్లు విసిరి <<18892238>>పారిపోయినట్లు<<>> తెలిపాయి.