India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మల్లెపూలు తీసుకెళ్లినందుకు నటి <<17646725>>నవ్య నాయర్<<>>కు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులు ఫైన్ విధించారు. అక్కడికి పువ్వులు, పండ్లు, కూరగాయలు, విత్తనాలు, ముడి గింజలు, పాల ఉత్పత్తులు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, రసగుల్లా, మైసూర్ పాక్, గులాబ్ జామూన్, రస్ మలై, బియ్యం, టీ, తేనె, హోమ్ ఫుడ్, పెట్స్ ఫుడ్, పక్షులు, పక్షుల ఈకలు, ఎముకలు, బ్యాగులు, దుప్పట్లు, మేపుల్ సిరప్ తీసుకెళ్తే రూ.1,54,316 వరకు ఫైన్ విధిస్తారు.
AP: కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం(NEP)లో హిందీ తప్పనిసరి అని ఎక్కడా చెప్పలేదని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ విధానంలో మూడు భాషలు నేర్చుకోవాలని మాత్రమే చెప్పిందన్నారు. తానూ 3 భాషలు నేర్చుకున్నట్లు ఇండియా టుడే సదస్సులో చెప్పారు. చదువుపై రాజకీయాల ప్రభావం పడకూడదని అభిప్రాయపడ్డారు. నేటి తరం పిల్లలు ఐదేసి భాషలు నేర్చుకుంటున్నారని, ఎక్కువ భాషలతో విదేశాల్లో పనిచేసేందుకు వీలుంటుందన్నారు.
TG: అంగన్‌వాడీలకు పాల సరఫరా తగ్గడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై రివ్యూ నిర్వహించిన ఆమెకు గతనెల 58% మాత్రమే పాలు సరఫరా అయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో మరోసారి రిపీట్ కావొద్దని, పాలతో పాటు గుడ్లు, పప్పు, ఇతర ఆహార పదార్థాలు సక్రమంగా వచ్చేలా చూడాలని ఆదేశించారు. ప్రతి 10 రోజులకోసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని, లేదంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
పంట పొలాల్లో అత్యంత ప్రమాదకరమైన, వేగంగా వ్యాపించే మొక్క పార్థీనియం(వయ్యారిభామ). ఇది వాతావరణ అనుకూల పరిస్థితుల్లో 4 వారాల్లో పుష్పించి దాదాపు 10K-50K వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గాలి ద్వారా 3KM దూరం వరకు విస్తరించి మొలకెత్తుతాయి. భూమి నుంచి నత్రజనిని వేర్ల ద్వారా గ్రహించే శక్తి ఇతర మొక్కలతో పోలిస్తే వయ్యారిభామకు 10 రెట్లు ఎక్కువ. ఇది మొలిచిన చోట్ల పైరుల ఎదుగుదల ఆగిపోతుంది.
* ఇవి తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పుడే పీకివేసి తగలబెట్టాలి.
* పంట మొలకెత్తక ముందు లీటర్ నీటికి 4 గ్రాముల అట్రాజిన్, మొలకెత్తిన 20 రోజులకు 2,4-D సోడియం సాల్ట్ లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించుకోవచ్చు.
* ఈ మందులు పక్క పంటలపై పడకుండా జాగ్రత్త పడాలి.
* కసివింద, వేంపల్లి, తోటకూర, పసర కంప మొదలైన మొక్కలు పార్థీనియం మొక్క పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి.
☛ ఈ కలుపు మొక్క పంట పొలాల్లో 40% దిగుబడి, పశుగ్రాసాల్లో 90% దిగుబడి తగ్గిస్తుంది.
☛ ఈ మొక్క ఉత్పత్తి చేసే పుప్పొడి టమాట, మిరప, వంగ, మొక్కజొన్న పుష్పాలపై పడినప్పుడు వాటి ఉత్పత్తికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
☛ దీని పుప్పొడిని పీలిస్తే మనుషులకు డెర్మటైటిస్, ఎగ్జిమా, ఉబ్బసం, తీవ్ర జ్వరం, కళ్లు ఎర్రబడటం, శ్వాసనాళాల్లోకి వెళ్లి బ్రాంకైటిస్ లాంటి వ్యాధులను కలుగజేస్తుంది.
AP: ఈ నెల 10న అనంతపురంలో కూటమి ప్రభుత్వ విజయాలను పండగలా జరుపుకోబోతున్నట్లు TDP ఎంపీ అప్పలనాయుడు పేర్కొన్నారు. ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్టైన సందర్భంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. YCP అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల సానుభూతిపరులకు పథకాలు ఇవ్వలేదు. భవిష్యత్తులోనూ NDA కూటమి అధికారంలో ఉంటుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై దుష్ప్రచారం చేస్తోందని KTR విమర్శించారు. ‘మేడిగడ్డను రెండేళ్లుగా పక్కనబెట్టారు. కాళేశ్వరం కోసం రూ.94వేల కోట్లు ఖర్చు అయితే మేడిగడ్డలో ఒక బ్లాక్ కుంగి రూ.250 కోట్ల నష్టం జరిగింది. దాన్ని మేమే రిపేర్ చేస్తామని ఏజెన్సీ ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించట్లేదు’ అని ఫైరయ్యారు. ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లిస్తున్నారని తెలిపారు.
ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో మొబైల్స్, యాక్సెసరీస్, ట్యాబ్స్ కొనుగోలు చేసేవారికి ‘శామ్‌సంగ్’ పలు సూచనలు చేసింది. ఆన్‌లైన్‌లో రీఫర్బిష్డ్, ఫేక్ వస్తువులు కొనకుండా యూజర్లను అలర్ట్ చేసింది. అమెజాన్‌లో Clicktech Retail, STPL Exclusive, Darshital Etel సెల్లర్స్ నుంచి మాత్రమే కొనాలంది. ఫ్లిప్‌కార్ట్‌లో TrueCom Retail, Mythanglory Retail, BTPLD, Flashstar Commerceలో తీసుకోవాలంది.
తెలంగాణలో ఈనెల 21 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలిడేస్ అక్టోబర్ 3 వరకు కొనసాగుతాయని అందులో పేర్కొంది. ఈ మేరకు స్కూళ్లకు విద్యాశాఖ రిమైండర్ పంపింది. అటు జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
Sorry, no posts matched your criteria.