news

News January 21, 2026

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి!

image

సరైన జీవనశైలితో అనారోగ్యాన్ని 90శాతం వరకూ దూరం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి 3-4 సార్లు వ్యాయామం, ప్రతిరోజూ 10 వేల అడుగుల నడక గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని తెలిపారు. ‘సరైన సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే ఎండలో నిలబడటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. పోషకాహారం తీసుకోవడం, రోజుకు 3 లీటర్ల నీరు తాగడం ముఖ్యం. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది’ అని చెబుతున్నారు. share it

News January 21, 2026

జగన్ పాదయాత్ర YCPని అధికారంలోకి తెస్తుందా?

image

AP: గతంలో కలిసొచ్చిన పాదయాత్రనే జగన్ మళ్లీ నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో 3,600kmపైగా నడిచిన ఆయన 151 సీట్లతో గెలిచారు. ఈసారి ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ప్రజల్లోకి వెళ్లి కూటమి పాలనను ఎండగట్టడంతో పాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో పాదయాత్రలు వర్కౌట్ అవుతున్న వేళ జగన్ ఆ ఫార్ములాతోనే మళ్లీ సీఎం అవుతారని అనుకుంటున్నారా?

News January 21, 2026

RGSSHలో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

image

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(RGSSH) 14 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, DNB, PG డిప్లొమా, MS/MD, MCh, DM అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://rgssh.delhi.gov.in

News January 21, 2026

సింగరేణి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది: కిషన్‌రెడ్డి

image

తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే సింగరేణి నిర్వహణ బాధ్యత కేంద్రం తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంత్రుల మధ్య వాటాల గొడవతోనే సింగరేణి వివాదం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు.

News January 21, 2026

వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

image

ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.

News January 21, 2026

సమయం అనుకూలించనప్పుడు చేయాల్సిన పనులు

image

కాలం కలిసి రానప్పుడు పాటించే కొన్ని ఆధ్యాత్మిక నియమాలు మనలో మార్పులు తెస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బయటకు వెళ్లేటప్పుడు నుదుట కుంకుమ, విభూతి ధరిస్తే దృష్టి దోషాలు తొలగి శుభం కలుగుతుంది. శుక్రవారం లక్ష్మీ గణపతిని ఎర్రని పూలతో పూజిస్తే అభివృద్ధి లభిస్తుంది. నిద్రించే ముందు గురు చరిత్ర పారాయణం చేయడం, ఉదయాన్నే అరచేతిని దర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

News January 21, 2026

తెలంగాణకు భారీ పెట్టుబడులు

image

TG: రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు DI పైపుల తయారీ సంస్థ రష్మి గ్రూప్‌ ముందుకు వచ్చింది. దావోస్‌లో CM రేవంత్ బృందంతో ₹12,500Cr పెట్టుబడికి MOU చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12K ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. అటు ₹6వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి ‘న్యూక్లర్ ప్రొడక్ట్స్’ సంస్థ ప్రభుత్వానికి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమర్పించింది.

News January 21, 2026

NBCC 59 పోస్టులకు నోటిఫికేషన్

image

నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (<>NBCC<<>>) 59 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి మూడో వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. జూనియర్ ఇంజినీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. వెబ్‌సైట్: https://www.nbccindia.in

News January 21, 2026

అక్రమాలకు కేంద్రంగా సింగరేణి: కిషన్‌రెడ్డి

image

TG: అవినీతి, అక్రమాలకు సింగరేణి కేంద్రంగా మారిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. BRS, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతులా వాడుకున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బొగ్గు అందించాలనే నైనీ కోల్‌బ్లాక్‌ను కేంద్రం కేటాయించిందన్నారు. కేంద్రం అనుమతులిచ్చినా టెండర్లు పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, సింగరేణి అక్రమాలపై CBI విచారణ అవసరమని తెలిపారు.

News January 21, 2026

1.12 కోట్ల ఉద్యోగాలిచ్చేలా MSMEలకు కేంద్ర ప్రోత్సాహం

image

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంటు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ₹5,000 CR EQUITY సపోర్టుగా ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. MSMEలకు రుణ ప్రోత్సాహంగా దీన్ని అమలు చేయనుంది. దీని ద్వారా 25.74 L సంస్థలకు లబ్ధి చేకూరి 1.12 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. కాగా <<18915747>>అటల్ పెన్షన్<<>> యోజన స్కీమ్‌ను 2030–31 వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.