India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో ‘పెద్ద తలకాయలు’ ఉన్నాయంటూ మొదటినుంచీ అనుమానిస్తున్న ఈడీ.. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. ఇక నెక్ట్స్ టార్గెట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాలేనని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆ రాష్ట్ర మంత్రి అతిశీ ఆరోపించారు. దీంతో తాము చట్టపరమైన అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఈడీని ఆదేశించాలంటూ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.
TG: హోలీ పండగలోపు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను సీఎంగా ఉన్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి కార్యకర్తలదేనన్నారు. ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మల్కాజిగిరి క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతా అనుసరించేలా చేయాలని సూచించారు.
AP: విశాఖపట్నం తీరంలో CBI భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖకు వచ్చిన కంటైనర్‌లో 25వేల కేజీల డ్రగ్స్‌ను గుర్తించింది. డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసి వెయ్యి బ్యాగుల్లో 25కేజీల చొప్పున ప్యాక్ చేశారు. ఇంటర్‌పోల్ సమాచారంతో CBI ఆపరేషన్ ‘గరుడ’ పేరుతో ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ పట్టుకుంది. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ అడ్రస్‌తో డెలివరీ చేసేందుకు యత్నించినట్లు తేల్చింది.
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జనరల్ టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద నగదు చెల్లింపుల్లో ఇబ్బందులకు చెక్ పెడుతూ క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, BHIM ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. దీంతో ప్రయాణికులకు చిల్లర కష్టాలు తొలగిపోనున్నాయి. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలోని 31 కౌంటర్ల వద్ద ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు.
CSK కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడంపై ఆ జట్టు CEO కాశీ విశ్వనాథన్ స్పందించారు. కెప్టెన్ల సమావేశానికి ముందే ఈ విషయం తనకు తెలిసినట్లు చెప్పారు. ధోనీ నిర్ణయాన్ని గౌరవించామన్నారు. మిస్టర్ కూల్ ఏం చేసినా అది జట్టుకు మేలు చేస్తుందన్నారు. కాగా కెప్టెన్ల ఫొటోషూట్‌లో ధోనీ లేకపోవడంతో ఆయన సారథిగా తప్పుకున్న విషయం బయటకు వచ్చింది. ఫొటోషూట్ తర్వాత కాసేపటికే CSK కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రకటించింది.
బాడీ మసాజర్‌ను అడల్ట్ సెక్స్ టాయ్‌గా పరిగణించలేం బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అందుకే దానిని నిషేధిత దిగుమతి వస్తువుల జాబితాలో చేర్చకూడదని పేర్కొంది. బాడీ మసాజర్ సెక్స్ టాయ్ కాదంటూ 2023 మేలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ కస్టమ్స్ అధికారులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు తాజాగా కొట్టేసింది.
భారత్ తరఫున అద్భుతంగా ఆడిన బ్యాటర్లలో బెస్ట్ ఎవరో మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ వెల్లడించారు. సునీల్ గవాస్కర్, సచిన్, ధోనీ, కోహ్లీలలో అత్యుత్తమ బ్యాటర్‌గా విరాట్‌నే ఎంపిక చేస్తానన్నారు. కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టారని, టెక్నికల్‌గా అతడు ఉత్తమ ఆటగాడని అభిప్రాయపడ్డారు. తన జట్టు కోసం అత్యుత్తమంగా ఆడతారని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. తమిళనాడులోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై బరిలో నిలవనున్నారు. కోయంబత్తూరు-అన్నామలై, చెన్నై సెంట్రల్-వినయ్ పి.సెల్వం, వెల్లూర్-ఏసీ షన్ముగం, కృష్ణగిరి-సి.నరసింహన్, నీలగిరి-మురుగన్, పెరంబళూర్-పారివేంధర్, తూత్తుకుడి-నాగేంద్రన్, కన్యాకుమారి-రాధాకృష్ణన్ పోటీ చేయనున్నారు.
AP: టెట్ ఫలితాలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని https://aptet.apcfss.in/లో ప్రకటించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం మార్చి 14నే రిజల్ట్స్ రావాల్సి ఉన్నా అధికారులు వెల్లడించలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని తాజాగా ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.