news

News November 21, 2024

అదానీకి డబ్బు దొరకొద్దు.. అసలు ప్లాన్ ఇదేనా!

image

నిధుల సమీకరణకు సిద్ధమైన ప్రతిసారీ అదానీ గ్రూప్‌పై US వేదికగా దాడులు జరుగుతున్నాయని SMలో చర్చ జరుగుతోంది. వ్యాపార విస్తరణకు నగదు దొరక్కుండా చేయడమే దీనివెనకున్న ప్లాన్ అని నెటిజన్లు అంటున్నారు. ADANI ENT 2023 JANలో రూ.20వేల కోట్ల FPOకు రాగా హిండెన్‌బర్గ్ దాడిచేసింది. ఇప్పుడు 600 మిలియన్ల డాలర్ బాండ్ల జారీకి సిద్ధమవ్వగా NYC కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ 2 ప్లాన్లను అదానీ గ్రూప్ రద్దుచేసుకుంది.

News November 21, 2024

ఖర్చు తగ్గించి, పొదుపు పెంచి..!

image

స్విట్జర్లాండ్‌లో ప్రతి ఏడుగురిలో ఒకరు లక్షాధికారి, ప్రతి 80వేల మందిలో ఒకరు బిలియనీర్ ఉన్నారు. తక్కువ ఖర్చు, ఎక్కువ పొదుపు చేయడమే ఇందుకు కారణం. స్విస్‌లో ఎక్కువ మంది కిరాయి ఇంట్లో ఉండేందుకు మొగ్గుచూపుతారు. ఎక్కువ రిటర్న్స్ వచ్చేదాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత ఉన్నవాటినే ఖర్చు చేస్తారు. చదువు, నైపుణ్యాలపై 5-10% ఖర్చు చేస్తారు. వీరు సేవింగ్స్, ఖర్చుల కోసం 3 బ్యాంక్ అకౌంట్స్ వాడతారు.

News November 21, 2024

PCB నివేదిక రాగానే చర్యలు: పవన్

image

AP: విశాఖలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసనమండలిలో ఎయిర్ పొల్యూషన్‌పై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘కాలుష్య తీవ్రత, నివారణపై PCB అధ్యయనం చేస్తోంది. జనవరి నాటికి రిపోర్టు ప్రభుత్వానికి అందుతుంది. రాగానే కాలుష్య నివారణ కార్యాచరణకు చర్యలు తీసుకుంటాం. పర్యావరణ క్షీణత కాకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం’ అని పవన్ వెల్లడించారు.

News November 21, 2024

BGTకి సర్వం సిద్ధం

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. ట్రోఫీతో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల కెప్టెన్లు ఫొటోషూట్‌ చేసేశారు. రేపు ఉ.7.50గంటలకు ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే ఇరుజట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. ఈ నేపథ్యంలో 5 టెస్టుల సిరీస్‌ను చేజిక్కించుకోవాలని రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయి.

News November 21, 2024

డాలర్ బాండ్ల జారీ విరమించుకున్న అదానీ

image

రూ.5000 కోట్ల విలువైన డాలర్ బాండ్ల జారీని నిలిపివేస్తున్నామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు NSEకి లేఖ రాసింది. న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో అభియోగాలు నమోదవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. రెన్యూవబుల్ ఎనర్జీ బిజినెస్‌ను విస్తరించేందుకు విదేశాల్లో నిధులు సమీకరించాలని అదానీ గ్రూప్ భావించింది. ఇందుకోసం డాలర్ డినామినేషన్లో బాండ్ల జారీకి సిద్ధమైంది. ఈ కేసుతో ఆ దారి మూసుకుపోయింది.

News November 21, 2024

గంజాయి పండించినా, తరలించినా పీడీ యాక్ట్: హోంమంత్రి

image

AP: గంజాయి సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయిపై సభ్యుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ‘5 నెలల్లో 25వేల KGల గంజాయి పట్టుకున్నాం. ఐదేళ్లలో జగన్ గంజాయిపై సమీక్ష చేయలేదు. గతంలో బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోయాయి. యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్‌తో నేరస్థులను అణచివేస్తాం’ అని ఆమె స్పష్టం చేశారు.

News November 21, 2024

‘పుష్ప-2’ ట్రైలర్‌పై శిల్పా రవి ప్రశంసలు.. బన్నీ రిప్లై

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ ట్రైలర్‌పై సినీ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్‌లో జరిగిన ట్రైలర్ ఈవెంట్ సైతం సినీ ఇండస్ట్రీని షేక్ చేసిందని కొనియాడుతున్నారు. తాజాగా హీరోను, మేకర్స్‌ను అభినందిస్తూ బన్నీ స్నేహితుడు, వైసీపీ నేత శిల్పా రవి ట్వీట్ చేశారు. దీనికి బన్నీ స్పందిస్తూ.. ‘నీ ప్రేమకు ధన్యవాదాలు బ్రదర్’ అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ వైరలవుతోంది.

News November 21, 2024

పిల్లలు పిట్టల్లా రాలుతుంటే.. CM పిట్టలదొర మాటలు: KTR

image

TG: ఎన్నడూ లేనిది గురుకుల పాఠశాలల్లో 40 మందికి పైగా విద్యార్థులు మరణించారని KTR ట్వీట్ చేశారు. ‘పిల్లలు పిట్టల్లా రాలుతుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా CM రేవంత్ వేదికల మీద పిట్టలదొర మాటలు చెబుతుండు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్ మహిళలను కోటీశ్వరులను చేస్తాడట’ అని సెటైర్లు వేశారు. ‘దవాఖానల్లో విద్యార్థులు, చెరసాలలో రైతన్నలు, ఆందోళనలో నిరుద్యోగులు’ అని పేర్కొన్నారు.

News November 21, 2024

పేసర్లు కెప్టెన్‌గా ఉండాలి: బుమ్రా

image

BGT నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ బుమ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేనెప్పుడూ పేసర్లు కెప్టెన్‌గా ఉండాలని వాదిస్తా. వారు వ్యూహాత్మకంగా మెరుగ్గా ఉంటారు. గతంలోనూ ఎన్నో ట్రోఫీలు ఇండియా గెలిచింది. ఈసారి పేసర్ కెప్టెన్సీలో కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతుంది అనుకుంటున్నా’ అని తెలిపారు. 2017, 2019, 2021, 2023లో ఇండియా BGT గెలుపొందింది. కాగా, ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు దిగిన ఫొటో వైరలవుతోంది.

News November 21, 2024

NEW RECORD: రూ.82 లక్షలను తాకిన బిట్‌కాయిన్

image

క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. తొలిసారి $95000ను తాకింది. మరికాసేపటికే $97,500 స్థాయికి దూసుకెళ్లింది. భారత కరెన్సీలో దీని విలువ రూ.82లక్షలుగా ఉంది. మూమెంటమ్ ఇలాగే కొనసాగితే $100,000ను తాకడానికి మరెంతో సమయం పట్టదు. US ప్రెసిడెంట్‌గా ట్రంప్ ఎన్నికవ్వడం, బ్లాక్‌రాక్ కొత్తగా ఆప్షన్లను ప్రవేశపెట్టడంతో BTC దూసుకెళ్తోంది.