news

News April 18, 2025

కాసేపట్లో మ్యాచ్.. స్టేడియం వద్ద వర్షం

image

క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా RCB-PBKS మ్యాచ్ జరగాల్సి ఉండగా ప్రస్తుతం అక్కడ వర్షం మొదలైంది. దీంతో గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు. వాన త్వరగా తగ్గి మ్యాచ్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వర్షంతో ఇవాళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.

News April 18, 2025

కమిన్స్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడా?

image

SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫొటో చర్చనీయాంశమైంది. ఎయిర్‌పోర్టులో భర్తతో కలిసి ఫొటో దిగిన ఆమె ‘గుడ్‌బై ఇండియా’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో కమిన్స్ మిగతా మ్యాచులు ఆడకుండా IPL మధ్యలోనే ఆసీస్ వెళ్లిపోతున్నాడా? అని SRH ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే అతడు భార్యకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మాత్రమే ఎయిర్‌పోర్టు వెళ్లాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

News April 18, 2025

రేపు దేశవ్యాప్త నిరసనలకు VHP పిలుపు

image

హింసాత్మక ఘటనల నేపథ్యంలో బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వహిందూ పరిషత్(VHP) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు VHP ప్రెసిడెంట్ ఆలోక్ కుమార్ రేపు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో సంస్థ సభ్యులు, మద్దతుదారులు ధర్నాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ జిల్లాల మెజిస్ట్రేట్లకు మెమోరాండం సమర్పించాలని సూచించారు.

News April 18, 2025

అందుకే వైసీపీ నుంచి బయటికి వచ్చాను: విజయసాయి రెడ్డి

image

AP: వైసీపీలో తాను నంబర్ 2గా ఉన్నానని, జగన్‌కు వెన్నుపోటు పొడిచానని మీడియాలో రాస్తున్నారని ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 స్థానమనేది ఓ మిథ్య. నాయకుడికి నాపై ఓ కోటరీ చాలా అపోహలు కల్పించింది. ఆయన మనసులో నాకు స్థానం లేదని గ్రహించి అవమాన భారం తాళలేక పార్టీని వీడాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే నా స్థానం 2వేలకు పడిపోయింది’ అని పేర్కొన్నారు.

News April 18, 2025

ఆ నటుడు డ్రగ్స్ డిమాండ్ చేసేవాడు.. నిర్మాత ఆరోపణ

image

‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు శ్రీనాథ్ భాసీ ప్రస్తుతం ‘నముక్కు కొడత్తియిల్ కాణం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా నిర్మాత హజీబ్ మలబార్ శ్రీనాథ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. షూటింగ్ సమయంలో తనకు ఫోన్ చేసి డ్రగ్స్ తీసుకురావాలని వేధించేవాడని, షూట్ సమయంలో కారవాన్‌లో డ్రగ్స్‌ను దాచి వాడేవాడని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అతడి కారణంగా తమ సినిమా షూటింగ్, డబ్బింగ్ ఆలస్యమయ్యాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

News April 18, 2025

జగన్‌కు వ్యతిరేకంగా చెబుతానని మీడియా భ్రమపెట్టింది: VSR

image

AP: మద్యం కేసులో సిట్ విచారణపై తనకేమీ అత్యుత్సాహం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తనకు తెలిసిన విషయాలు చెప్పానని, మరోసారి పిలిస్తే వస్తానని పేర్కొన్నారు. ‘ఈ నెల 18న విచారణకు సిట్ నోటీసు ఇచ్చింది. అయితే నేను అత్యుత్సాహంగా ముందుగానే వచ్చి YS జగన్‌కు వ్యతిరేకంగా చెప్పబోతున్నాననే భ్రాంతిని కొన్ని మీడియా సంస్థలు కలిగించాయి. ఇలాంటి జర్నలిస్టు ప్రమాణాలు మానుకోవాలి’ అని పేర్కొన్నారు.

News April 18, 2025

TGలో భారీ పెట్టుబడులు.. జపాన్‌లో సీఎం రేవంత్ ఒప్పందం

image

TG: రాష్ట్రంలో జపాన్‌కు చెందిన NTT డేటా సంస్థ రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. జపాన్ పర్యటనలో ఉన్న CM రేవంత్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 25వేల జీపీయూలతో AI సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్‌ను లిక్విడ్ ఇమ్మర్షన్ టెక్నాలజీతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ కూడా HYD శివారు రుద్రారంలో రూ.592 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు సీఎం బృందంతో ఎంవోయూ కుదుర్చుకుంది.

News April 18, 2025

నేషనల్ హెరాల్డ్ కేసుతో BJPకి సంబంధం లేదు: బండి

image

నేషనల్ హెరాల్డ్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ పునరుద్ఘాటించారు. 2011లో UPA ప్రభుత్వ హయాంలోనే సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందన్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్ పొందారని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి రూ.2 వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకు వారు ప్రయత్నించారని ఆరోపించారు. వారికి చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు.

News April 18, 2025

భర్తను 36 సార్లు పొడిచి.. ప్రియుడికి వీడియో కాల్ చేసిన భార్య

image

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో దారుణం జరిగింది. 25 ఏళ్ల రాహుల్ అనే వ్యక్తిని మైనర్ అయిన భార్య, ప్రియుడి స్నేహితులు 36 సార్లు బీరు బాటిల్‌తో పొడిచి చంపారు. షాపింగ్‌కు వెళ్దామని భర్తను బయటకు తీసుకెళ్లగా ప్రియుడు యువరాజ్‌ స్నేహితులు వారిని వెంబడించారు. ఓ చోట ఆగగానే అతణ్ని పొదల్లోకి తీసుకెళ్లి బీరు బాటిల్‌తో పొడిచి చంపేశారు. అనంతరం ‘పని అయిపోయింది’ అని భార్య తన ప్రియుడికి వీడియో కాల్ చేసింది.

News April 18, 2025

ఆ విషయం రాజ్ కసిరెడ్డినే అడగాలి: VSR

image

AP: మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ 3 గంటలపాటు విచారించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘లిక్కర్‌కు సంబంధించి రెండు సమావేశాలు జరిగినట్లు నేను అధికారులకు చెప్పా. ఫస్ట్ మీటింగ్‌లో వాసుదేవరెడ్డి, మిథున్, సత్యప్రసాద్, కసిరెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. రాజ్ కసిరెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎవరికి వెళ్లాయో నాకు తెలియదు. ఈ విషయాన్ని ఆయన్నే అడిగి తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!