news

News October 15, 2024

కొత్తది కొనిస్తా, స్కూటీ తిరిగివ్వండి.. దొంగకు విజ్ఞప్తి

image

పుణేకు చెందిన అభయ్ అనే యువకుడి స్కూటీ చోరీకి గురైంది. ఎంత వెతికినా దొరక్కపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఆ స్కూటీ క్యాన్సర్‌తో చనిపోయిన తన తల్లిదని అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘నా యాక్టివా దొంగిలించిన దొంగకు ఓ రిక్వెస్ట్. ఈ స్కూటీ మా అమ్మ చివరి జ్ఞాపకం. దయచేసి దాన్ని తిరిగి ఇవ్వండి. మీకు కొత్త వాహనం కొనిస్తా’ అని ప్లకార్డుతో ప్రదర్శన చేస్తున్నారు.

News October 15, 2024

‘లుక్ అవుట్’ పేరుతో ఎయిర్‌పోర్టులో సజ్జల అడ్డగింత: YCP

image

AP: TDP ఆఫీసుపై దాడి ఘటన కేసులో సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని YCP విమర్శించింది. సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాశ్, అప్పిరెడ్డి, తలశిల రఘరాంపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనమంది. నిన్న విదేశీ పర్యటన ముగించుకుని వస్తున్న సజ్జలను ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ నోటీసు పేరుతో అడ్డుకున్నారని తెలిపింది. ఆయన విదేశాలకు వెళ్లేటప్పుడు లేని నోటీసు ఇప్పుడేంటని ప్రశ్నించింది.

News October 15, 2024

మిసైల్ మ్యాన్ స్ఫూర్తిదాయక కోట్స్!

image

యువతలో స్ఫూర్తినింపేందుకు APJ అబ్దుల్ కలాం చెప్పిన సూక్తులు మీకోసం. 1. సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడమే. 2. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే.. ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి. 3. ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం. కానీ ఓ మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం. 4. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. 5. మన జననం సాధారణమైనదే కావచ్చు.. కానీ మన మరణం చరిత్ర సృష్టించేలా ఉండాలి.

News October 15, 2024

గ్రూప్-1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన ఆన్సర్లు ఇవ్వలేదని, వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని పలువురు పిటిషన్లు వేశారు. తాజాగా హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ యథావిధిగా జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

News October 15, 2024

OTTలోకి ‘తంగలాన్’ వచ్చేది ఎప్పుడంటే?

image

విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా దీపావళి కానుకగా ఓటీటీ(Netflix)లోకి రానుంది. ఈ విషయాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా తాజాగా X స్పేస్‌లో వెల్లడించారు. ఓటీటీ రిలీజ్‌కు ఎలాంటి సమస్యలు లేవని, పండుగ సందర్భంగా స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

News October 15, 2024

Satellite Pics: పాంగాంగ్ తీరం వెంట చైనా కొత్త సైనిక స్థావరం!

image

పాంగాంగ్ సరస్సు ఉత్తరతీరంలో చైనా కొత్త సైనిక స్థావరాన్ని నిర్మించినట్టు సీనియర్ మిలిటరీ సోర్సెస్ తెలిపాయి. శాటిలైట్ ఇమేజెస్‌ను విశ్లేషించి LAC సమీపంలోని డ్రాగన్ భూమిలో ఈ సైట్ గుర్తించామని పేర్కొన్నాయి. ఇందులో 70 శాశ్వత నిర్మాణాలు ఉన్నాయని, మిసైళ్ల దాడి తీవ్రతను తగ్గించడమే లక్ష్యమని వెల్లడించాయి. భారత సరిహద్దు వెంబడి మిగిలిన స్థావరాలకు లాజిస్టిక్స్, ఫుడ్ సప్లైకి వీటిని ఉపయోగించుకోవచ్చని తెలిపాయి.

News October 15, 2024

వాహనాలను కాపాడుకునేందుకు చెన్నై ప్రజల పాట్లు!

image

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చెన్నై ప్రజలు అప్రమత్తమయ్యారు. వరద నుంచి రక్షించుకునేందుకు ద్విచక్రవాహనాలను ఇళ్లలో భద్రపరిచారు. అపార్ట్‌మెంట్లలోనూ పైకి తీసుకెళ్లి ఇంట్లో, వరండాలో పార్క్ చేశారు. దీంతోపాటు చెన్నై, వేలచేరి పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్లపై స్థానికులు కార్లు పార్క్ చేసిన దృశ్యాలు వైరలవుతున్నాయి. విజయవాడలో వచ్చిన వరదల్లో కార్లు, బైక్‌లు పాడైన విషయం తెలిసిందే.

News October 15, 2024

Stock Market: పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినా..

image

ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందినా దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మెటల్, ఆటో షేర్లు తగ్గడం, కీలక కంపెనీల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 81,751 (-221), నిఫ్టీ 25,070 (-57) వద్ద చలిస్తున్నాయి. BPCL, BEL, ICICI BANK, INFY, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్. బజాజ్ ఆటో, M&M, TATA స్టీల్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లాసర్స్.

News October 15, 2024

హైదరాబాద్‌లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

image

TG: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. చెన్నై నుంచి లింగంపల్లి వచ్చిన ఆమె నానక్‌రామ్‌గూడ వెళ్లేందుకు ఈ తెల్లవారుజామున 2.30 గంటలకు ఆటో ఎక్కింది. డ్రైవర్ మసీద్ బండ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి, అక్కడే వదిలేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News October 15, 2024

మార్కెటింగ్ కంటెంట్లో AIతో జాగ్రత్త.. లేదంటే!

image

AI‌తో లాభాలున్నా సరైన పర్యవేక్షణ లేకుంటే జరిగే నష్టం అపారం. వెస్ట్రన్ కల్చర్, లాంగ్వేజెస్ వరకు పర్లేదు గానీ భారతీయ భాషలు, కల్చర్‌పై అవగాహన లేకుంటే దెబ్బ తప్పదు. ‘ఐపిల్ గర్భనిరోధక మాత్ర నిన్ను మిస్సవుతోంది పల్లవీ’ అంటూ జెప్టో పంపిన నోటిఫికేషన్ దీనినే తెలియజేస్తోంది. ఇలాంటి కంటెంట్ ఇస్తున్నప్పుడు మానవ పర్యవేక్షణ కంపల్సరీ అంటున్నారు నిపుణులు. గుడ్డిగా AIని నమ్మొద్దంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?