India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సౌతాఫ్రికాతో రెండో టీ20లో డకౌట్ అయిన సంజూ శాంసన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. షార్ట్ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ సార్లు(4) సున్నాకే వెనుదిరిగిన భారత ప్లేయర్‌గా నిలిచారు. రోహిత్ శర్మ 2018లో, విరాట్ కోహ్లీ 2024లో మూడుసార్ల చొప్పున డకౌటయ్యారు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక సార్లు(12) సున్నాకే ఔటైన అవాంఛిత రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది.

‘అమరన్’ సినిమాలో సాయిపల్లవి నటన సూపర్ అంటూ హీరోయిన్ జ్యోతిక ఇన్‌స్టా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపై సాయి పల్లవి స్పందిస్తూ మీకు సినిమా నచ్చినందుకు ఆనందంగా ఉందని బదులిచ్చారు. ‘సాయి.. నువ్వు గొప్ప నటివి. నీ నటన నాకు నచ్చుతుంది. నువ్వు ఎంచుకున్న పాత్రకు న్యాయం చేస్తావు. అందుకే నువ్వు నాకు స్పెషల్’ అని పల్లవికి జ్యోతిక రిప్లై ఇచ్చారు.

MPకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డా.PN.మిశ్రా అదిరిపోయే ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. రాబోయే మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కచ్చితంగా అంచనా వేస్తే రూ.కోటి బహుమతి ఇస్తానని ప్రకటించారు. సరిగ్గా అంచనా వేయలేకపోయినవారు బహిరంగ క్షమాపణ చెప్పాలని షరతు పెట్టారు. కొందరు శాస్త్రీయ ఆధారాలు లేకుండా అంచనాలు వేస్తూ, మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారని అంటున్నారు.

AP: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. పీకలదాకా మద్యం తాగిన జగదీశ్ అనే సీనియర్ విద్యార్థి పది మంది జూనియర్లను ర్యాగింగ్ చేశాడు. కారిడార్‌లోకి తీసుకొచ్చి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నరకం చూపించాడు. ఎదురుతిరిగిన ముగ్గురిని కొట్టాడు. దీంతో వారు తల్లిదండ్రులతో కలిసి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు.

సర్వాంతర్యామి తత్వానికి ప్రతీక శివుడు. అందుకే ఆ మహాదేవుడు లింగ రూపంలో మనకోసం ఉద్భవించాడు. లింగానికి ఏది ముందు, ఏది వెనక వైపు అనేది లేదు. నువ్వే దిక్కని మనం ఏ దిక్కు నుంచి కొలిచినా ఆయన అపార కరుణామృతాన్ని మనపై వర్షిస్తాడు. దైవ రూపంలో మొదటిది లింగం. అది బ్రహ్మాండము, పూర్ణముకు చిహ్నం. అందులేనిది లేదు. అన్నీ ఆ అండము నుంచే ఏర్పడ్డాయి. శివమనగా సర్వశుభకరమని, శివుడనగా సర్వ శుభాలను చేకూర్చువాడని అర్థం.

దక్షిణాఫ్రికాతో రెండో టీ20లోనూ భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ నిరాశపరిచారు. దీంతో ఆయన ప్రదర్శనపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిషేక్ కేవలం IPLలోనే ఆడుతారని దుయ్యబడుతున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో జింబాబ్వేపై సెంచరీ మినహా ఆయన పెద్దగా రాణించింది లేదని, రుతురాజ్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. కాగా గత సీజన్‌లో సత్తా చాటిన అభిషేక్‌ను SRH రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

యాదాద్రిని యాదగిరి గుట్ట అనే ప్రస్తావించాలని CM రేవంత్ ఇటీవల ఆదేశించారు. అయితే యాదగిరి గుట్టను గత CM KCR రూ.వందల కోట్లతో పునర్నిర్మించాక శ్రీవైష్ణవ మఠాధిపతి చిన్నజీయర్ స్వామి సూచనతో యాదాద్రి అని పిలవడం మొదలుపెట్టారు. భద్రాచలం కూడా భద్రాద్రి అని వాడుకలోకి వచ్చింది. అయితే అధికారికంగా యాదాద్రి అనే పేరు మార్పు జరగలేదు. కానీ, రికార్డుల్లో మాత్రం యాదాద్రి అని రాయడం కొనసాగుతూ వచ్చింది.

AP: ఇవాళ ఉదయం 10.30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో శాసనసభకు వెళ్లొద్దని నిర్ణయించిన నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే అవకాశం ఉంది. శాసన మండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

TG: ఇప్పటికే సరైన ధర లభించడం లేదని దిగులు పడుతున్న పత్తి రైతులపై మరో పిడుగు పడింది. సీసీఐ ధరలతో పాటు తేమ, బరువు విషయంలో విధించిన కఠిన నిబంధనలకు నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని రాష్ట్ర కాటన్ మిల్లర్లు, ట్రేడర్ల సంక్షేమ సంఘం నిర్ణయించింది. దీంతో అన్ని సీసీఐ కేంద్రాలతో పాటు మార్కెట్లలోనూ పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి.

TG: అర్హులైన సినీ పరిశ్రమ కార్మికులకు హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఇళ్లు ఇప్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిన్న సినిమాలు తీసే వారికి థియేటర్లు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నారన్నారు. వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.