India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో వరుస విజయాలతో అఫ్గానిస్తాన్ టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు కచ్చితంగా సెమీస్ చేరుతుందని ఆ టీమ్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది అన్నారు. తమతో పాటు AUS, IND, ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరుతాయని అంచనా వేశారు. కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శనతో వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాకిస్థాన్ పేరును షాహిది పక్కన పెట్టడం గమనార్హం.

AP: తిరుమల కొండను అపవిత్రం చేసిన పాపం జగన్‌ను ఊరికే వదలదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘జగన్.. శిశుపాలుడిలా మీ నూరు తప్పులు పూర్తయ్యాయి. ఇప్పటికైనా ఆ భగవంతుడి ముందు తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకుని పూజలు చేయండి. చేసిన పాపానికి కొంతైనా పరిహారం దొరుకుతుంది’ అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా పథకాలు ఆపడం లేదన్నారు. అనర్హులు పథకాలు పొందకుండా కట్టడి చేస్తామన్నారు.

డీఆర్‌డీవో, ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అడ్వాన్స్‌డ్ బాలిస్టిక్ ఫర్ హైఎనర్జీ డిఫీట్ పేరుతో ఓ తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను తయారు చేశారు. దీని ముందు, వెనక ఉండే కవచాలు 360 డిగ్రీల రక్షణను అందజేస్తాయని రక్షణ శాఖ తెలిపింది. 8.2 కేజీలు, 9.5 కేజీల కనీస బరువుతో వీటిని రూపొందించినట్లు పేర్కొంది. పాలిమర్లు, స్వదేశీ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్థాలను దీని తయారీలో ఉపయోగించినట్లు తెలిపింది.

TG: నీటి పారుదల శాఖను గత BRS ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదన్నారు. ఈ ప్రాజెక్టు తమకు ప్రాధాన్యమని, దీంతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతలనూ పూర్తి చేస్తామని తెలిపారు. 6 నెలల్లోపు ఉదండాపూర్, బీమా, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు అరుదైన అవకాశం దక్కింది. 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అక్టోబర్ 2 నుంచి 11వ తేదీ వరకు ఈ మూవీని ప్రదర్శించనున్నారు. 8, 9 తేదీల్లో BIFFలోని బహిరంగ థియేటర్‌లో షోలు వేయనున్నారు. ఈ ఏడాది జూన్‌లో రిలీజైన ఈ సినిమా రూ.1200కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే.

ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబర్ 25న ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం జరుపుకుంటారు. అందరికీ స్వచ్ఛమైన గాలి అందాలి, హెల్తీ లంగ్స్ ఉండాలనేది ఈ ఏడాది థీమ్. హెల్తీ లంగ్స్ కోసం పొగాకు వాడకాన్ని తగ్గించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వద్దు. డైలీ వ్యాయామం చేయాలి. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి. హెల్తీఫుడ్ తినాలి. ఫ్లూ, నిమోనియాకి టీకాలు తీసుకోవాలంటున్నారు.

1932: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జననం
1820: ప్రసిద్ధ బెంగాలీ కవి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జననం
1867: తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జననం
1947: సంఘ సంస్కర్త బంకుపల్లె మల్లయ్యశాస్త్రి మరణం
1966: సాహిత్యవేత్త అట్లూరి పిచ్చేశ్వరరావు మరణం
✤ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం

TG: హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 234 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

AP: పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చలు ముగిశాయి. అన్ని క్లినికల్ విభాగాల్లో 20 శాతం ఇన్ సర్వీస్ రిజర్వేషన్ ఇచ్చేందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లో చేరాలని సత్యకుమార్ వారిని కోరారు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.