news

News October 31, 2024

అమిత్‌ షాపై కెనడా ఆరోపణలు: US స్పందన ఇదీ

image

HM అమిత్‌షాపై కెనడా ఆరోపణలు ఆందోళన కలిగించాయని అమెరికా తెలిపింది. దీనిపై ఆ దేశాన్ని నిరంతరం సంప్రదిస్తూనే ఉంటామని పేర్కొంది. ఆందోళన ఎందుకు కలిగిందో, ఏం తెలుసుకొనేందుకు సంప్రదిస్తారో మాత్రం వివరించలేదు. భారత్‌పై ఏమీ మాట్లాడలేదు. కెనడాలో నిజ్జర్ సహా ఖలిస్థానీలపై హింస, హత్యాయత్నాలకు కుట్రలు పన్నింది <<14488317>>అమిత్ షా<<>>నే అని డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ అక్కడి పార్లమెంటుకు చెప్పడం తెలిసిందే.

News October 31, 2024

చాలాకాలం తర్వాత హ్యాపీగా నిద్రపోయా: కిరణ్

image

చాలాకాలం తర్వాత సంతోషంగా నిద్రపోయానని టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశారు. దీపావళిని సంతోషకరంగా మార్చినందుకు అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్పారు. కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ట్వీట్ చేశారు.

News October 31, 2024

మయోనైజ్ గురించి తెలుసా?

image

బర్గర్లు, శాండ్‌విచ్‌లు, సలాడ్లలో మయోనైజ్ వేసుకుని తింటారు. పచ్చి గుడ్డులోని తెల్లసొనను నూనె, వెనిగర్/నిమ్మరసం, నీటిలో కలిపితే ఇది తయారవుతుంది. దీన్ని తయారుచేసిన 3, 4 గంటల్లోనే వినియోగించాలని లేదంటే సాల్మనెల్లా, లిస్టెరియా మోనోసైటోజెన్, స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే ప్రమాదకర బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా డయేరియా, కడుపునొప్పి లాంటి సమస్యలు వస్తాయి. తాజాగా TG ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేసింది.

News October 31, 2024

వేద పండితులకు రూ.3,000.. ఉత్తర్వులు జారీ

image

AP: రాష్ట్రంలోని వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 600 మందికి సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల నుంచి సంభావన చెల్లించాలని పేర్కొంది. ఈ సాయం పొందే పండితులు వారి నివాసానికి సమీపంలోని ఆలయంలో రోజూ గంటపాటు వేద పారాయణం చేయాలంది.

News October 31, 2024

ఈ ఆలయం దీపావళి రోజు మాత్రమే తెరుస్తారు

image

కర్ణాటకలోని హసన్‌ పట్టణంలో ఉన్న హసనాంబా ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవిగా పూజలందుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.

News October 31, 2024

మాజీ మంత్రి అప్పలరాజుకు తీవ్ర అస్వస్థత

image

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న పలాసలోని ఇంటి వద్ద వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

News October 31, 2024

పెట్టుబడులకు ఇదే మంచి సమయం: లోకేశ్

image

APలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి ఇదే మంచి సమయమని మంత్రి లోకేశ్ అన్నారు. అమెరికాలో ఆయన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటీ, ఫార్మా, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. త్వరలో అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు.

News October 31, 2024

REVIEW: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’

image

చాలీచాలని జీతం వచ్చే ఓ బ్యాంకు ఉద్యోగైన హీరో కుటుంబం కోసం అప్పులు చేసి, ఆ తర్వాత ఓ రిస్క్ చేస్తాడు. ఏం చేశాడు? ఎలా చేశాడనేదే కథ. హీరో ఎదుర్కొనే అవమానాలు ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్టవుతాయి. అక్కడక్కడ ట్విస్టులు ఆకట్టుకుంటాయి. దుల్కర్ నటన, డైరెక్టర్ వెంకీ రచన, BGM, డైలాగ్స్ సినిమాకు బలం. స్టాక్ మార్కెట్, బ్యాంకుల పనితీరు గురించి తెలియని వారికి సెకండాఫ్ అంతగా కనెక్ట్ అవ్వదు.
రేటింగ్: 3/5

News October 31, 2024

పుష్ప-2లో క్రేజీ సర్‌ప్రైజ్?

image

అల్లు అర్జున్-రష్మిక జంటగా నటిస్తోన్న పుష్ప-2కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా క్లైమాక్స్‌ ఉంటుందని సమాచారం. ఇందులోనే మూడో పార్ట్‌కు అదిరిపోయే లీడ్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారనే చర్చ టాలీవుడ్‌లో నడుస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News October 31, 2024

ఈఆర్సీ ఛైర్మన్‌గా జస్టిస్ నాగార్జున్

image

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఛైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జున్ బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ నియంత్రణ్ భవన్‌లోని ఈఆర్సీ ఆఫీస్‌లో ఆయనతో సీఎస్ శాంతికుమారి ప్రమాణస్వీకారం చేయించారు. వినియోగదారులు, విద్యుత్ సంస్థల ప్రయోజనాలను కాపాడుతానని జస్టిస్ నాగార్జున్ అన్నారు.