news

News October 19, 2024

డీఎస్సీ ఉచిత కోచింగ్.. ఎల్లుండే లాస్ట్ డేట్

image

AP: ఉచిత DSC కోచింగ్‌కు హాజరయ్యే SC, ST అభ్యర్థులు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 27న దరఖాస్తుదారులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 3 నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఇప్పటికే అభ్యర్థుల కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో ప్రత్యేక గదులు, కాన్ఫరెన్స్ హాల్, తరగతి గదులు, రీడింగ్ రూమ్ ఉన్నాయి.

News October 19, 2024

IND vs NZ: రిషభ్ పంత్ వచ్చేశాడు

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చారు. ప్రస్తుతం సర్ఫరాజ్‌తో కలిసి ఆయన ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించే పనిలో ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో కీపింగ్ చేస్తుండగా పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. మోకాలివాపుతో ఆయన నిన్న ఫీల్డింగ్‌కు రాలేదు. దీంతో బ్యాటింగ్‌కు కూడా దిగుతారో లేదోనని అనుమానాలు తలెత్తాయి. ఎట్టకేలకు బ్యాట్ పట్టారు.

News October 19, 2024

ఢిల్లీకి కప్పం కట్టకపోతే చిట్టి పదవి మటాష్: కేటీఆర్

image

TG: హైడ్రా ఎఫెక్ట్‌తో GHMC పరిధిలో నిర్మాణాలకు బ్రేక్ పడిందని ఓ మీడియాలో వచ్చిన వార్తపై కేటీఆర్ స్పందించారు. ‘RR Tax కట్టాలి కదా? ఢిల్లీకి మన చిట్టి కప్పం కట్టకపోతే పదవి మటాష్ కదా! మనమే ఏరికోరి తెచ్చుకున్న మార్పు కదా’ అంటూ సీఎం రేవంత్‌పై Xలో సెటైర్లు వేశారు.

News October 19, 2024

విస్తారా విమానానికి బాంబు బెదిరింపు!

image

ఢిల్లీ నుంచి లండన్‌కు బయల్దేరిన విస్తారా విమానానికి సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించినట్లు తెలిపింది. విమానం ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, తనిఖీలు చేస్తున్నట్లు సంస్థ ప్రకటన చేసింది. భద్రతా ఏజెన్సీలు క్లియర్ చేసిన తర్వాతే లండన్‌కు బయల్దేరుతుందని తెలిపింది.

News October 19, 2024

వెంకటేశ్ కోసం నిర్మాతగా నితిన్?

image

విక్టరీ వెంకటేశ్, తమిళ్ డైరెక్టర్ టీఎన్ సంతోషన్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తన హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై హీరో నితిన్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని సమాచారం.

News October 19, 2024

SHOCKING: కేజీ చికెన్ రూ.50

image

HYD ప్రకాశ్‌నగర్‌లో బాలయ్య అనే వ్యక్తి కుళ్లిన చికెన్ అమ్ముతున్న కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి చాలా తక్కువ ధరకు చికెన్‌ను దిగుమతి చేసుకుంటున్నాడు. జనతా బార్స్, కల్లు కాంపౌండ్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌కు కేజీ చికెన్‌ను రూ.30-50కే విక్రయించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. 10 నుంచి నెల రోజుల నాటి చికెన్ అమ్ముతున్నట్లు నిర్ధారించారు.

News October 19, 2024

కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు బ్రేక్?

image

APలో కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటుకు అడ్డంకులు ఎదురువుతున్నట్లు తెలుస్తోంది. రేషన్ షాపుల విభజన ప్రక్రియ సరిగ్గా జరగడం లేదంటూ కొందరు డీలర్లు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 35 ప్రకారం రేషనలైజేషన్ ప్ర్రక్రియను కొనసాగించడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో షాపుల విభజనను నిలిపేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కొత్తగా 2,774 షాపులు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది.

News October 19, 2024

నేడు అమరావతి పనుల పునఃప్రారంభం

image

AP: రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 11 గంటలకు సీఆర్డీఏ కార్యాలయ పనులను ఆయన ప్రారంభిస్తారు. రూ.160 కోట్లతో ఏడంతస్తుల్లో ఈ ఆఫీసును నిర్మించనున్నారు. కాగా జనవరి నాటికి దాదాపు రూ.49వేల కోట్ల విలువైన వివిధ రకాల పనులకు టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 19, 2024

రెండు సినిమాలకు అక్కినేని అఖిల్ గ్రీన్‌సిగ్నల్?

image

‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత వెండి తెరకు కాస్త బ్రేక్ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పుడు 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించే ఓ చిత్రాన్ని UV క్రియేషన్స్ నిర్మించనుందని సమాచారం. అలాగే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ డైరెక్షన్‌లో మరో మూవీకి ఆయన ఓకే చెప్పినట్లు టాక్. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి.

News October 19, 2024

ఇంటర్ అమ్మాయి దారుణ హత్య

image

AP: ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. కర్నూలు(D) నగరూరుకు చెందిన అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి రాగా అదే గ్రామానికి చెందిన సన్నీ ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంటికి వెళ్లాడు. తనను ప్రేమించాలని బెదిరించాడు. యువతి నిరాకరించడంతో పురుగుమందు ఆమె నోట్లో పోసి పరారయ్యాడు. పేరెంట్స్ వచ్చి చూడగా అశ్విని చావుబతుకుల్లో కనిపించింది. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది.