India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అన్ని పథకాల్లో అవినీతి చేసి ఉత్తర కుమారుడిలా KTR ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. నాలుగు రోజులు ఆగితే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఎన్ని కబుర్లు చెప్పినా ఇకపై తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను విశ్వసించబోరని పేర్కొన్నారు.

TG: గ్రూప్-1 పరీక్షలో ఓ మహిళా అభ్యర్థి కాపీ కొడుతూ పట్టుబడింది. మహబూబ్‌నగర్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన మహిళ రంగారెడ్డి జిల్లాలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇవాళ ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్షకు హాజరైంది. ఈక్రమంలోనే చీరకొంగులో చీటీలు పెట్టుకొచ్చి, కాపీయింగ్ కొడుతుండగా ఇన్విజిలేటర్ గుర్తించారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

AP: షర్మిలను జగన్ మోసం చేశారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ‘జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎంతగానో ఉపయోగించుకున్నారు. కానీ ఆయనకు ఇప్పటికీ టీడీపీ సభ్యత్వం ఇవ్వలేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావునూ అలాగే మోసం చేశారు. హెరిటేజ్‌లో ఆయన తోబుట్టువులకు ఏమైనా వాటాలు ఇచ్చారా? జగన్ ఇంట్లో చిచ్చు పెట్టి చంద్రబాబు చలి కాచుకుంటున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

మిస్టర్ కూల్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ MS ధోనీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఝార్ఖండ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఓటర్లకు అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది. ఈసీ విజ్ఞప్తి మేరకు వీడియోను ఎన్నికల కమిషన్‌కు అందించారని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఓటింగ్ పర్సెంటేజ్‌ను పెంచేందుకు ఈసీ ఈ ప్రచారం చేయించనుందని సమాచారం. రాష్ట్రంలో NOV 13, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

AP: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని మరింత సులభతరం చేసింది. సీనరేజీ ఫీజు విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా సీనరేజీ ఫీజు, మెరిట్ ఆన్ శాండ్, డీఎంఎఫ్ మాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో స్థానికంగా ఇసుక లభ్యత, రవాణా పెరుగుతుందని తెలిపింది.

పరువు నష్టం కేసులో దోషిగా తేలిన శివసేన UBT MP సంజయ్ రౌత్‌కు ముంబై సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరుగుదొడ్ల నిర్మాణంలో ₹100 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ రౌత్ చేసిన ఆరోపణలపై బీజేపీ నేత కీర్తి సోమయ సతీమణి మేధా కోర్టుకెక్కారు. ఈ కేసులో మెజిస్ట్రేట్ కోర్టు రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష సహా ₹25K జరిమానా విధించింది. దీన్ని సవాల్ చేసిన రౌత్ ₹50 వేల పూచీకత్తుపై బెయిల్ పొందారు.

తన కంటే రెట్టింపు వయసున్న హీరోలతో నటించడంలో తప్పేమీ లేదని హీరోయిన్ ఊర్వశీ రౌతేలా అన్నారు. ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాలో సన్నీ డియోల్ సరసన నటించిన సమయంలో తన ఏజ్ 19 ఏళ్లని చెప్పారు. వయసు పరంగా హీరోకు తనకు మధ్య వ్యత్యాసం 38 ఏళ్లని తెలిపారు. అయితే కథకు అనుగుణంగా నటించడంలో ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న NBK 109లో కీలక పాత్రలో నటిస్తున్నారు.

AP: రాష్ట్రంలో ఉచిత సిలిండర్‌కు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. ఈనెల 29 నుంచి గ్యాస్ బుకింగ్ ప్రారంభం కానుండగా దీపావళి సందర్భంగా 31న తొలి ఉచిత సిలిండర్ డెలివరీ చేస్తామని తెలిపింది. కాగా ఆర్థిక సంవత్సరంలో 4 నెలలకు ఒకటి చొప్పున మొత్తం 3 సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.

50 Statesలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు 435 ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి 2 ఎలక్టోరల్ ఓట్లు సెనెట్ ద్వారా వస్తాయి. తద్వారా మొత్తం 535 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. వాషింగ్టన్ డీసీకి 3 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి (Winner-take-all). వీరు డిసెంబర్‌లో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జనవరిలో కాంగ్రెస్ ధ్రువీకరిస్తుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలక్టోరల్ కాలేజ్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ అయినప్పటికీ, నేరుగా ప్రజలు అధ్యక్షుడిని ఎన్నుకోరు. వారు తమ సొంత రాష్ట్రంలో ఎలక్టర్లకు ఓటు వేస్తారు. ఈ ఎలక్టర్లు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, అభ్యర్థికి గెలవడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. ప్రతి రాష్ట్రానికి జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ప్రజలు వీరికి ఓటేస్తారు.
Sorry, no posts matched your criteria.