news

News September 25, 2024

అక్టోబర్ 9న సింగరేణి కార్మికుల బోనస్ పంపిణీ

image

TG: సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటాను ప్రభుత్వం దసరా బోనస్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని అక్టోబర్ 9న చెల్లించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సింగరేణి CMD ఎన్.బలరామ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా రూ.796 కోట్ల లాభాలను GOVT బోనస్‌గా చెల్లించనుంది. సంస్థలో పని చేస్తున్న 42 వేల మంది లబ్ధి పొందనున్నారు. సగటున ఒక్కొక్కరు రూ.1.90 లక్షల చొప్పున పొందే అవకాశముంది.

News September 25, 2024

డబ్బుల కోసమే నా పై ఆరోపణలు: హర్షసాయి

image

తనపై నార్సింగి పీఎస్‌లో అత్యాచార <<14188760>>కేసు <<>>నమోదు కావడంపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియాలో స్పందించారు. ‘డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు. నేనేంటో నా ఫాలోవర్స్‌కు తెలుసు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. అటు హర్షసాయి కోసం HYD పోలీసులు గాలిస్తున్నారు.

News September 25, 2024

Ease of Business: డీక్రిమినలైజ్ కోసం 300 లా పాయింట్లు షార్ట్‌లిస్ట్

image

మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌కు బూస్ట్ ఇచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 300 లా పాయింట్లు, సెక్షన్లను షార్ట్‌లిస్ట్ చేసింది. వివిధ మంత్రిత్వ శాఖల్ని సంప్రదించి వీటిలో సగం వరకు డీక్రిమినలైజ్ చేస్తామని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అన్నారు. జన్ విశ్వాస్ 2.0 కింద కంపెనీలపై రూల్స్ ఒత్తిడి తగ్గిస్తామన్నారు. ప్రతి ఎలక్ట్రానిక్ డివైజులో మేకిన్ ఇండియా పరికరం ఉండాలన్నదే తమ గోల్‌ అని చెప్పారు.

News September 25, 2024

బాలుగారి మధుర గాత్రం చెవులకు వినిపిస్తూనే ఉంది: సీఎం

image

AP: గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ‘సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ శకాన్ని తన పరం చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మైమరపింపజేసే ఆయన మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళి అర్పిస్తున్నాను’ అని సీఎం ట్వీట్ చేశారు.

News September 25, 2024

కమలా హారిస్ క్యాంపెయిన్ ఆఫీస్‌పై కాల్పులు

image

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అరిజోనా క్యాంపెయిన్ ఆఫీస్‌పై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 16 అర్ధరాత్రి తర్వాత ఇలా జరగడం రెండోసారి అన్నారు. ఆఫీస్ ముందున్న విండోస్‌పై బుల్లెట్ హోల్స్ గుర్తించామన్నారు. BB గన్ లేదా పెల్లెట్ గన్‌తో పేల్చినట్టు వారు అనుమానిస్తున్నారు. ‘రాత్రి కావడంతో ఆఫీసులో ఎవరూ లేరు. అక్కడ పనిచేస్తున్న వారి భద్రతపై ఆందోళన కలుగుతోంది’ అని వారు పేర్కొన్నారు.

News September 25, 2024

Stock Market: పైకా.. కిందకా..

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో ఇన్వెస్టర్లు అలర్ట్‌గా ఉంటున్నారు. కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 84,963 (+40), ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,945 (+5) వద్ద ట్రేడవుతున్నాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలూ అలాగే ఉన్నాయి. పవర్ గ్రిడ్, M&M, హిందాల్కో, HDFC బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు టాప్ గెయినర్స్.

News September 25, 2024

విరాట్ కోహ్లీలో పస తగ్గింది: ఆసీస్ మాజీ క్రికెటర్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీలో జోరు తగ్గిందని, మునుపటి ఆట లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నారు. ‘గత నాలుగేళ్లుగా విరాట్ టెస్టుల్లో అంత గొప్ప ప్రదర్శనేమీ చేయటం లేదు. ఇలా ఆడితే సచిన్ రికార్డులను అధిగమించడం కష్టమే. ఆయన క్రమక్రమంగా తన మొమెంటం కోల్పోతున్నారు. బహుశా ఇంకో 10 టెస్టులు మాత్రమే కోహ్లీ ఆడతారని భావిస్తున్నా’ అంటూ హాగ్ వ్యాఖ్యానించారు.

News September 25, 2024

నేటి నుంచి ఇసుక డోర్ డెలివరీ

image

AP: ఉచిత ఇసుక స్కీంలో భాగంగా ఇసుకను డోర్ డెలివరీ చేసే అంశంపై నెలకొన్న ప్రతిష్టంభన తొలిగింది. డోర్ డెలివరీ చేసే లారీలు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా, అఫిడవిట్ రూపంలో ఒప్పందం చేసుకోవాల్సిన పని లేకుండా ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు గనుల శాఖ డైరెక్టర్‌తో టిప్పర్ల యజమానులు జరిపిన చర్చల్లో నిర్ణయించారు. నేటి నుంచి ఇసుకను రవాణా చేయనున్నట్లు టిప్పర్ల యజమానులు తెలిపారు.

News September 25, 2024

‘గేమ్ ఛేంజర్’ నుంచి క్రేజీ అప్డేట్

image

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని ‘రా మచ్చా.. మచ్చా’ అంటూ సాగే రెండో సాంగ్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘జరగండి.. జరగండి’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

News September 25, 2024

సూసైడ్ క్యాప్సుల్‌లో తొలి మరణం!

image

స్విట్జర్లాండ్‌లో ఓ మహిళ సూసైడ్ క్యాప్సుల్ ‘సార్కో పాడ్’ సాయంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆమె ఆత్మహత్యకు సహకరించారన్న ఆరోపణలతో పలువురిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. జర్మనీ సరిహద్దు మేరీషాజన్ అటవీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఆత్మహత్య జరిగింది. కాగా ఈ క్యాప్సుల్‌లోని బటన్ నొక్కగానే నైట్రోజన్ వాయువు విడుదలై అందులో పడుకున్న వ్యక్తి ఊపిరాడక నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు.