news

News October 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 16, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 16, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:57 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:09 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:02 గంటలకు
అసర్: సాయంత్రం 4:16 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:53 గంటలకు
ఇష: రాత్రి 7.06 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 16, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 16, బుధవారం
చతుర్దశి: రాత్రి.8.40 గంటలకు
ఉత్తరాభాద్ర: రాత్రి 7.17 గంటలకు
వర్జ్యం: ఉదయం 6.36-8.00 గంటల వరకు, తెల్లవారుఝామున 5.48 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 11.29-12.16 గంటల వరకు

News October 16, 2024

INDvNZ: వరుణుడు జాలి చూపిస్తాడా..?

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య రేపు జరిగే టెస్టు మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉంది. మంగళవారం వాన ధాటికి ఇరు జట్లూ నెట్ ప్రాక్టీస్ కూడా చేయలేకపోయాయి. ‘వెదర్.కామ్’ ప్రకారం రేపు భారీ వర్షం పడటానికి 93శాతం అవకాశం ఉంది. వచ్చే 5 రోజులూ వర్షపాతం ఛాన్స్ ఉంది. అయితే, చిన్నస్వామి గ్రౌండ్‌ దేశంలోనే అత్యంత వేగంగా ఆరిపోయే గ్రౌండ్ కావడంతో అభిమానులు మ్యాచ్‌పై ఆశలు పెట్టుకున్నారు.

News October 16, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* TG: దామగుండంలో రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్
* గురుకులాలను వెంటనే తెరవకపోతే చట్టపరమైన చర్యలు: మంత్రి పొన్నం
* గ్రూప్-1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
* ఏపీ జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల ప్రకటన
* కూటమి ప్రభుత్వం మూడేళ్లే ఉంటుంది: కాకాణి
* వయనాడ్ ఉపఎన్నిక బరిలో ప్రియాంక: AICC
* మహారాష్ట్రలో నవంబర్ 20న, ఝార్ఖండ్‌లో NOV 13, 20వ తేదీల్లో పోలింగ్

News October 16, 2024

ఇంగ్లండ్‌కు షాక్.. సెమీస్ చేరిన విండీస్

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు విండీస్ షాకిచ్చింది. కీలక మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఛేదనలో విండీస్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. ఇంగ్లండ్ ఓటమితో దక్షిణాఫ్రికా కూడా చేరడం గమనార్హం.

News October 16, 2024

ఏపీకి కేంద్రం శుభవార్త

image

ఏపీకి కేంద్రం మరో శుభవార్త అందించింది. కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. దీంతో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దేశ రక్షణ, సౌకర్యాల కల్పనలో కృష్ణా జిల్లా కీలకపాత్ర పోషిస్తోందని CM చెప్పారు. DRDO ఆధ్వర్యంలో ఈ టెస్టింగ్ సెంటర్ అందుబాటులోకి రానుంది.

News October 16, 2024

‘ఎల్లమ్మ’కు నితిన్ గ్రీన్ సిగ్నల్?

image

‘బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ‘ఎల్లమ్మ’ కథను నాని, శర్వానంద్, తేజా సజ్జ వంటి హీరోలకు ఆయన వినిపించారు. తాజాగా ఈ కథ విన్న నితిన్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాబిన్ హుడ్, తమ్ముడు అనే చిత్రాల షూటింగ్ ముగియగానే ‘ఎల్లమ్మ’ మొదలవుతుందని టాలీవుడ్ టాక్. ఈ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు.

News October 16, 2024

ఈ నెల 17న గరుడ సేవ ఊరేగింపు

image

తిరుమ‌లలో ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నెల 17న పౌర్ణమి సందర్భంగా నెలవారీ గరుడసేవ జరుగనుంది. దీనిలో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్ప స్వామి గరుడ వాహనంపై తిరు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు దర్శనమిస్తారు.