news

News October 24, 2024

డాక్టర్లు పేషెంట్లను ఎడమవైపునే ఎందుకు కూర్చోబెడతారు?

image

దాదాపు అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లు తమ పేషెంట్ల కోసం తమకు ఎడమవైపున కుర్చీ ఏర్పాటు చేసి ఉంచుతారు. కుడివైపు నుంచి రోగి గుండె, లివర్, పొత్తికడుపును పరీక్షించడం సులభంగా ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్లలో చాలామంది కుడిచేతి వాటం కావడం వల్ల స్టెతస్కోప్ వంటి పరికరాలు వాడటంలో ఎలాంటి ఇబ్బంది ఎదురవదు. అందుకే మెడికల్ స్టూడెంట్స్‌ కాలేజీ నుంచే దీన్ని అలవర్చుకుంటారు. అయితే దీని వెనుక ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు.

News October 24, 2024

Skoda Autoలో 50% వాటా కొంటున్న M&M!

image

స్కోడా ఆటో ఇండియా ఆపరేషన్స్‌లో 50% వాటా కొనుగోలుకు M&M సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ డీల్ తుదిదశకు చేరినట్టు సమాచారం. ప్రస్తుతం స్కోడా విలువ $1 బిలియన్లుగా ఉంది. షేర్ల కేటాయింపు, నగదు రూపంలో M&M ఈ లావాదేవీని పూర్తి చేయనుంది. భారత మార్కెట్లో పోటీని తట్టుకోవడం స్కోడాకు కష్టంగా మారింది. 2024లో నెట్ ప్రాఫిట్ 69% తగ్గి రూ.96 కోట్లకు చేరింది. అందుకే డీల్‌కు మొగ్గుచూపినట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.

News October 24, 2024

మంత్రి పొంగులేటి సంచలన కామెంట్స్

image

TG: గత ప్రభుత్వంలోని ముఖ్యులపై ఫైల్స్ సిద్ధమయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నవంబర్ 1 నుంచి 8 వరకు అందరూ లోపలికి వెళతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మరో రెండుమూడు రోజుల్లో సంచలనం జరగబోతోందంటూ బాంబు పేల్చారు. మంత్రి దేని గురించి మాట్లాడారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News October 24, 2024

నవంబర్ మొదటి వారంలో మెగా డీఎస్సీ?

image

AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తోంది. 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది.

News October 24, 2024

భారీగా వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం

image

AP: భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు సీఎంకు వివరించారు. నేడూ భారీ వర్షాలున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.

News October 24, 2024

జగన్ హయాంలోనే డ్రోన్ల వినియోగం: YCP

image

AP: కష్టం ఎవరిదైనా క్రెడిట్ కొట్టేయడంలో శాడిస్ట్ చంద్రబాబుది అందెవేసిన చేయి అంటూ వైసీపీ విమర్శించింది. వైఎస్ జగన్ హయాంలో డ్రోన్లని విరివిగా వాడినా ఇప్పుడు ఆ ఘనత తనదేనంటూ చంద్రబాబు గప్పాలు కొడుతున్నారని మండిపడింది. ఇదంతా జనం చూసి నవ్విపోతారనే సోయి లేకపోతే ఎలా అంటూ ట్వీట్ చేసింది. జగన్ హయాంలో ఎరువులు, విత్తనాలు చల్లేందుకు డ్రోన్లను వాడినట్లు పేర్కొంది.

News October 24, 2024

ఓటీటీలో రికార్డు సృష్టించిన ‘సలార్’

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ సినిమా హవా ఓటీటీలో కొనసాగుతోంది. నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘సలార్’ హిందీ వెర్షన్ రికార్డు సృష్టించినట్లు హాట్‌స్టార్ పేర్కొంటూ ఆయనకు విషెస్ తెలిపింది. హిందీ వెర్షన్ ఏకంగా 250 రోజులుగా ట్రెండింగ్‌లో ఉందని హాట్ స్టార్ పేర్కొంది. కాగా, ‘నెట్‌ఫ్లిక్స్’లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సహా ఇంగ్లిష్ భాషల్లో విడుదలైంది.

News October 24, 2024

INCOME TAX: ప్రియాంకా గాంధీ ఫ్యామిలీ రూ.75 కోట్లు బాకీ!

image

రూ.75 కోట్ల పన్ను బకాయిలు/పెనాల్టీలు/అసెస్‌మెంట్ ఆర్డర్లపై ప్రియాంకా గాంధీ కుటుంబం CIT(A) వద్ద అప్పీల్ చేసింది. AY2012-13లో రూ.15.75 లక్షలు చెల్లించాలని IT నోటీసులు ఇచ్చిందని అఫిడవిట్లో ప్రియాంక వెల్లడించారు. తర్వాతి సంవత్సరాల్లో రీఫండ్స్ పోగా ఆ విలువ రూ.11.11 లక్షలుగా ఉందన్నారు. AY2010 నుంచి 20 వరకు రూ.75 కోట్లు చెల్లించాల్సిందిగా 20.03.23న తన భర్త వాద్రాకు నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు.

News October 24, 2024

గుడ్‌న్యూస్: తగ్గిన బంగారం ధరలు

image

పసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. ఇటీవల భారీగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్ ఇవాళ తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.600, 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.550 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ.79,470కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.72,850గా నమోదైంది. అటు కేజీ వెండి ధర కూడా రూ.2000 తగ్గి, రూ.1,10,000కు లభిస్తోంది.

News October 24, 2024

VROలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

image

TG: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో త్వరలోనే మళ్లీ వీఆర్‌వోలను నియమించేందుకు కసరత్తులు చేస్తోంది. మంత్రి పొంగులేటి సైతం తాజాగా ఇదే విషయం చెప్పారు. గత ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసిందని, త్వరలోనే గ్రామానికో వీఆర్‌వోను నియమిస్తామని అన్నారు.