India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీమ్ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ హ్యాట్రిక్ సెంచరీ బాదారు. SMATలో భాగంగా ఇవాళ మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ (151) సెంచరీ చేశారు. 67 బంతుల్లోనే ఆయన 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 151 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. కాగా దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో కూడా తిలక్ వరుస సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే. 3rd, 4th మ్యాచుల్లో ఆయన శతకాలు బాదారు.

మహారాష్ట్రలో మహాయుతి విజయంలో మరాఠ్వాడా కీలకంగా నిలిచింది. 46 సీట్లున్న బీజేపీ, శివసేన, NCP 32+ నియోజకవర్గాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం నడిపిన మనోజ్ జరంగేకు ఇది భారీ షాకే. ఆయన మొదట MVAకు మద్దతిచ్చారు. తర్వాత సొంతంగా కొందరిని పోటీకి నిలుపుతామన్నారు. కాంగ్రెస్ కూటమి ఓట్లు చీలొద్దని తర్వాత మానుకున్నారు. ఈ విజయంతో మహాయుతిని ఆయనిక బ్లాక్‌మెయిల్ చేయలేరని విశ్లేషకుల అంచనా.

మహారాష్ట్ర ఎన్నికల్లో మరోసారి మహాయుతి భారీ మెజార్టీ సాధిస్తున్న వేళ ప్రధాని మోదీ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. మహారాష్ట్రలో ఫలితాలు, సీఎం ఎంపికపైనా ఆయన చర్చించే అవకాశం ఉంది.

బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న రేట్లు ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) రూ.820 పెరిగి రూ.79,640కి చేరింది. 22 క్యారెట్ల బంగారం (10గ్రాములు) రూ.750 పెరిగి రూ.73,000కి చేరింది. వెండి ధర కిలో రూ.1,01,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

TG: కేరళ వయనాడ్‌లో జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆది నుంచీ ఆధిక్యంలో కొనసాగుతుండటంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వయనాడ్ ప్రజలు ఆమెను కచ్చితంగా రికార్డు మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రియాంక ఇప్పటికే 2లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

వయనాడ్‌లో ప్రియాంక గాంధీ బంపర్ విక్టరీ ఖాయమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆమె మెజార్టీ 2 లక్షలు దాటింది. దీంతో కాంగ్రెస్ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా కాంగ్రెస్ కంచుకోటలో పోటీ చేస్తున్న నవ్య హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితంపై సర్వే సంస్థలు అంచనా వేసిన నంబర్లు తారుమారవుతున్నాయి. ఇక్కడ మహాయుతి 150, MVA 100+ సీట్లొస్తాయని చెప్పుకొచ్చాయి. కానీ, ఫలితాలు చూస్తుంటే మహా కూటమి 200+సీట్లు గెలిచేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా MD ప్రదీప్ గుప్తా తమ సర్వే రిజల్ట్స్‌ను రీట్వీట్ చేశారు. తమ అంచనా నిజమవుతుందని మరోసారి గుర్తుచేశారు. ప్రస్తుతం MHలో 225స్థానాల్లో ‘మహా’ ముందంజలో ఉంది.

ఇండియాతో సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 2000 నుంచి స్వదేశంలో టెస్టుల్లో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయిన చెత్త రికార్డును ఆసీస్ మూటగట్టుకుంది. తక్కువ స్కోరు చేసిన మ్యాచుల్లో ఇది మూడోవదిగా నిలిచింది. సౌత్ ఆఫ్రికాతో 85, ఇంగ్లాండ్‌తో 98, ఇండియాతో 104, పాకిస్థాన్‌తో 127, న్యూజిలాండ్‌తో 136, ఇంగ్లండ్‌తో 138 రన్స్‌కు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.

ప్రతి మగవాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుంది అనేది నానుడి. మహారాష్ట్రలో మహాయుతి విక్టరీ దిశగా వెళ్లేలా మహిళలు వెన్నుదన్నుగా నిలిచారు. ఆడవాళ్లకు ‘లాడ్లీ బెహనా యోజన’ నెలవారీ ఆర్థిక సాయం రూ.2100కు పెంచుతామని NDA ప్రకటించింది. తద్వారా 2కోట్లకు పైగా మహిళా ఓట్లను టార్గెట్ చేసింది. ఈ ఓటు బ్యాంకులో చాలా వరకు పాజిటివ్‌గా కన్వర్ట్ అయినట్లు ప్రస్తుత ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

ఝార్ఖండ్‌లో పోస్ట్ రిజల్ట్స్ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాంచీలో వాలిపోయారు. ఫలితాల సరళిని చూస్తే ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కాసేపట్లో గెలుపు గుర్రాలతో భట్టి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమితో పోలిస్తే సీట్ల తేడా తక్కువగా ఉండటంతో JMM, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.