India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ ‘బంగ్లాదేశ్ ఛాత్రా లీగ్’ను యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద అక్కడి తాత్కాలిక ప్రభుత్వం బ్యాన్ చేసింది. హసీనా 15ఏళ్ల నిరంకుశ పాలనలో వీరు లెక్కలేనన్ని నేరాలు చేసినట్టు పేర్కొంది. ఆమెపై ఉద్యమించిన స్టూడెంట్ గ్రూప్ ADSM డిమాండ్ మేరకే ఛాత్రా లీగ్‌ను బ్యాన్ చేయడం గమనార్హం. హసీనాకు మద్దతుగా మరో ఉద్యమం నిర్మిస్తారనే బ్యాన్ చేసినట్టు ఛాత్రా లీగ్ సపోర్టర్స్ ఆరోపిస్తున్నారు.

AP: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గౌరవార్థం డిసెంబర్ 15ను ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, NOV 1న రాష్ట్ర అవతరణ, జూన్ 2న రాష్ట్ర విభజన తేదీల్లో దేనిని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై చర్చించింది. దీనిపై మంత్రుల సూచనలను CM కోరారు. జూన్ 2ను నవనిర్మాణ దినంగా నిర్వహించనున్నారు.

భర్తను భార్య హిజ్రా అని పిలవడం మానసిక హింసకు గురి చేయడమే అని పంజాబ్, హరియాణా హైకోర్టు వ్యాఖ్యానించింది. కింది కోర్టు ఇచ్చిన విడాకులు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తన భార్య పోర్న్ సైట్లకు బానిసయిందని, తనను శారీరకంగా బలహీనంగా ఉన్నానంటూ అవమానించేదని భర్త వాదించారు. కేసులో భార్య ప్రతివాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం కింది కోర్టు ఉత్తర్వుల్ని సమర్థించింది.

బంగ్లాలో మరో పొలిటికల్ గేమ్‌కు రంగం సిద్ధమవుతోంది! భారత్‌కు బయల్దేరేముందు జాతినుద్దేశించి మాట్లాడాలనుకున్న షేక్ హసీనాకు సైన్యం టైమివ్వలేదు. ఇంట్లో కీలక డాక్యుమెంట్లు, కొన్ని వస్తువులు సర్దుకొని ఫ్లైటెక్కే హడావిడిలో ఆమె రిజైన్ చేశారో లేదో తెలియడం లేదు. తాజాగా ఆ దేశ ప్రెసిడెంట్ షాబుద్దీన్ ఆమె రిజైన్ చేశారనడానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదనడం వివాదాస్పదమైంది. అంటే టెక్నికల్‌గా హసీనాయే PM అన్నమాట!

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టు నేడు తొలి వన్డే ఆడనుంది. మ్యాచ్ అహ్మదాబాద్‌లో మ.1.30గం.కు ప్రారంభమవుతుంది. T20 వరల్డ్ కప్ గెలిచి జోరుమీదున్న న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడం భారత్‌కు సవాల్‌తో కూడుకున్న పనే. అటు భారీ అంచనాలతో బరిలోకి దిగిన హర్మన్ సేన పేలవమైన ప్రదర్శనతో సెమీస్ కూడా చేరకుండా ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు కివీస్‌ను భారత్ ఎలా నిలువరిస్తుందో చూడాలి.

AP: రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు గాను మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి నవంబర్ 1వరకు ఆయన అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్, పెప్సికో వంటి దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరించనున్నారు.

TG: రాష్ట్రంలో సామాన్యులపై కరెంట్ ఛార్జీలు పెంచబోమని డిస్కం సీఎండీ ముషారఫ్ స్పష్టం చేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా ఛార్జీల భారం పడదని చెప్పారు. నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగదారులకు ఫిక్స్‌డ్ ఛార్జీల రూపంలో రూ.50 పెంపు కోసం ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముషారఫ్ ఇలా స్పందించారు.

AP: కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కార్తీక శని, ఆది, సోమ, పౌర్ణమి, ఏకాదశి రోజులలో సామూహిక, గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను రద్దు చేసింది. ఆయా రోజులలో స్వామివారి అలంకార దర్శనానికే అనుమతిచ్చింది. సాధారణ రోజులలో అభిషేకాలు, స్పర్శ దర్శనాలు మూడు విడతలుగా అందుబాటులో ఉండనున్నాయి. కాగా నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి.

AP: తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాన్ ఏ క్షణమైనా తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకావం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.

AP: చెల్లి రాజకీయాల్లో ఉంటే సైకో జగన్ తట్టుకోలేకపోతున్నారని TDP విమర్శించింది. రాజకీయాల నుంచి తప్పుకుంటేనే ఆస్తులు రాసిస్తానని షర్మిలను బెదిరిస్తున్నారని ఆరోపించింది. ‘రాజకీయంగా నాకు అడ్డు రాకు. అప్పుడే ఆస్తులు రాసిస్తా. నన్ను ఇబ్బందులు పెడుతుంటే నీకు ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? సరస్వతి సిమెంట్స్ షేర్స్ తిరిగి ఇచ్చేయండి. అమ్మపై, నీపై కేసు వేస్తున్నా’ అని షర్మిలకు జగన్ లేఖ రాశారని ట్వీట్ చేసింది.
Sorry, no posts matched your criteria.