news

News October 19, 2024

గిన్నిస్ వరల్డ్ రికార్డు పేజీపై మెగాస్టార్‌పై కథనం

image

భారతీయ సినిమా రంగంపై చిరంజీవి చెరగని ముద్ర వేశారంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారిక పేజీలో ఆయనపై ఓ స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుడిగా నిలిచారని, 143 సినిమాల్లో 537 పాటల్లో విభిన్న డాన్సులతో ఆకట్టుకున్నారని ప్రశంసించింది. సినిమాలపై చిరంజీవి ప్రభావం తరతరాలుగా మారి, ఆయనను భారతీయ సినిమాకు ఒక చిహ్నంగా మార్చిందంటూ మెగాస్టార్ కెరీర్ హైలైట్స్‌ను GWR పంచుకుంది.

News October 19, 2024

ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయి: జగన్

image

AP: కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలింది. విజయనగరం జిల్లా గుర్లలో ప్రబలిన అతిసార ఘటనలే దీనికి ఉదాహరణ. 11 మంది చనిపోయినా ప్రభుత్వం నిద్ర వీడడం లేదు. ఆస్పత్రులున్నా స్థానిక స్కూళ్లలో బెంచీల మీద చికిత్స అందించడం దారుణం. ఇప్పటికైనా డయేరియా బాధిత గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ అని ట్వీట్ చేశారు.

News October 19, 2024

BREAKING: భారత్ ఆలౌట్

image

NZతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా అద్భుత పోరాటం ముగిసింది. 462 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ 150, పంత్ 99 రన్స్ చేశారు. కివీస్ ముందు టీమ్ ఇండియా 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ ఈ రన్స్ కొట్టకుండా రోహిత్ సేన అడ్డుకోగలదా? కామెంట్ చేయండి.

News October 19, 2024

రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: DGP

image

TG: హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

News October 19, 2024

డెలివరీ సేవలపై కర్ణాటక సెస్!

image

జొమాటో, ఓలా, ఉబర్, స్విగ్గీ తదితర సంస్థల డెలివరీ సేవలపై పన్ను విధించాలని నిర్ణయించినట్లు కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ లాడ్ తెలిపారు. ‘రవాణా మీద మాత్రమే ఈ పన్ను విధిస్తున్నాం. డెలివరీ ఏజెంట్లు రోడ్డుపైనే ఎక్కువ ఉంటారు కాబట్టి వారు ప్రమాదాలకు గురయ్యేందుకు, కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలయ్యేందుకు అవకాశాలెక్కువ. ఈ డబ్బును వారి సంక్షేమానికి, వారి పిల్లల చదువులకు వినియోగిస్తాం’ అని పేర్కొన్నారు.

News October 19, 2024

రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టు.. నటుడిపై కేసు

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టు పెట్టిన ఒడిశా నటుడు బుద్ధాదిత్య మొహంతీపై కేసు నమోదైంది. ఎన్సీపీ నేత సిద్దిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా తర్వాత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకోవాలని ఆయన పోస్టు పెట్టినట్లు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొహంతి ఆ పోస్టు డిలీట్ చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 19, 2024

కుక్క లేదా పాము కరిచిందా?

image

కుక్క, పాము కాటు బాధితులకు వెంటనే చికిత్స అందించేందుకు జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్ 15400 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. బాధితులు ఈ నంబర్‌కు కాల్ చేస్తే వ్యాక్సిన్లు ఎక్కడ లభిస్తాయో తెలియజేస్తారు. ఈ నంబర్ ఉ.9 నుంచి సా.6 గంటల వరకు పనిచేస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్లను ఏపీ వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తాజాగా ఆవిష్కరించారు.

News October 19, 2024

అయ్యో పంత్.. ఏడు సెంచరీలు మిస్!

image

రిషభ్ పంత్‌ను 90 పరుగులు దాటాక దురదృష్టం వెంటాడుతోంది. 2018లో తాను అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 7సార్లు 90ల్లో ఔటయ్యారు. 2018లో WIపై రాజ్‌కోట్, హైదరాబాద్ టెస్టుల్లో 92 రన్స్‌కి, 2021లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై 97 రన్స్, అదే ఏడాది ఇంగ్లండ్‌పై చెన్నైలో 91 రన్స్, 2022లో మొహాలీలో శ్రీలంకపై మ్యాచ్‌లో 96 రన్స్, అదే ఏడాది మీర్పూర్‌లో బంగ్లాదేశ్‌పై 93 రన్స్, ఈరోజు 99 రన్స్‌కి పంత్ ఔటయ్యారు.

News October 19, 2024

ఈ రైళ్ల టైమింగ్స్ మారాయి

image

సికింద్రాబాద్-గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్చినట్లు SCR ప్రకటించింది. ఇకపై రాత్రి 10.05 నిమిషాలకే SCలో బయల్దేరి తర్వాతి రోజు ఉ..8.55కు గూడూరు చేరుతుంది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి కూడా లింగంపల్లిలో సా.5.30కి, సికింద్రాబాద్‌లో 6.05 గం.కు బయల్దేరి తర్వాతి రోజు ఉ.5.55 గం.కు TPTY చేరుతుంది. అటు నర్సాపూర్-నాగర్‌సోల్ రైలు NSలో ఉ.9.50కు బయల్దేరి తర్వాతి రోజు ఉ.7.30కు NSL చేరుతుంది.

News October 19, 2024

రాష్ట్రంలో ఘోరం.. మహిళపై గ్యాంగ్‌రేప్

image

TG: నిజామాబాద్‌లో ఘోరం జరిగింది. బస్టాండ్ సమీపంలో నిన్న రాత్రి నలుగురు దుండగులు ఒంటరిగా ఉన్న ఓ మహిళను ఆటోలో ఎక్కించుకుని డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇవాళ ఉదయం నగరానికి చేరుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆటోకు సంబంధించిన సీసీ వీడియో కోసం పరిశీలిస్తున్నారు.