India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: పరిపాలనా అనుభవం లేకుండా సీఎం రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. HMDA పరిధిలోని గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని వెంచర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావంటే పేద ప్రజల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. LRS ఫ్రీగా చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు.

TG: రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ORRపై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్‌ల వద్ద ఈ టెస్టులు చేస్తారు. ఇప్పటికే యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. కాగా మద్యం తాగి ORRపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతుండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

AP: YCP నేత అంబటి రాంబాబు మానసిక స్థితి సరిగా లేదేమోనని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. జగన్ మెప్పు కోసం పదే పదే అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించామని ఆధారాలు చూపండి. ప్రాజెక్టు ఎత్తు తగ్గినట్లు ప్రభుత్వానికి తెలియకుండా YCP నేతలకు తెలిసిందా? ప్రాజెక్టు గురించి మేం చెబితే సరిపోదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే మాట.. ఒకటే బాట’ అని ఆయన స్పష్టం చేశారు.

1992 నుంచి 2012 వరకు డెమోక్రాట్లకు కంచుకోట అయిన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్‌లను Blue Wall states అంటారు. 44 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ 3 రాష్ట్రాలు అధ్యక్ష అభ్యర్థి విజయానికి కీలకం. ఇక్కడ గెలిచినవారిదే అధ్యక్ష పీఠం. 2016లో రిపబ్లికన్ల తరఫున మొదటిసారిగా ట్రంప్ ఈ మూడు రాష్ట్రాల్ని గెలిచారు. 2020లో మళ్లీ డెమోక్రాట్లు పాగా వేశారు. దీంతో ఈసారి ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

TG: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మనోహరాబాద్(మ) పోతారం వద్ద ట్రాక్టర్-బైక్ ఢీకొని దంపతులు, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. స్థానికంగా పలువురు రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోశారు. దీంతో రోడ్డుపై ఒకవైపు నుంచే వాహనాల రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎదురుగా వచ్చిన బైకును ట్రాక్టర్ ఢీకొట్టడంతో నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థుల కోసం పోలీసు వాహనాల్లో డబ్బు తరలిస్తున్నారని ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. పోలీసు శాఖ అధికారులే తనకు ఈ విషయాన్ని వెల్లడించారని అన్నారు. అయితే, ఈ ఆరోపణలను డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పవార్ ఊహల్లో జీవిస్తున్నారని, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే ఇలా జరిగిందని దుయ్యబట్టారు.

ఇటీవల ఓ మారథాన్‌లో పాల్గొన్న 54 ఏళ్ల CM ఒమర్ అబ్దుల్లా ఎలాంటి శిక్షణ, ప్లాన్, న్యూట్రీషన్ లేకుండా 21 KM రన్ పూర్తి చేసినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన పలువురు వైద్యులు ఈ వయసులో ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదని చెబుతున్నారు. సరైన శిక్షణ, తర్ఫీదు లేకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని సూచిస్తున్నారు. ఎక్కువ దూరం రన్నింగ్ ఈవెంట్లకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

నైజీరియాలో ఆహార నిల్వలు అడుగంటడంతో తిండి కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. నిరసన చేస్తున్న 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా పలు ఆరోపణలతో అక్కడి ప్రభుత్వం ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. విచారించిన కోర్టు మరణశిక్ష విధించింది. అందులో 29 మంది మైనర్లున్నారు. కాగా బాలల హక్కు చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని మరణ శిక్ష రద్దుచేసి, ₹5లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

ప్రస్తుతం ఏ శుభకార్యం జరిగినా అక్కడ చాక్లెట్లు ఉండాల్సిందే. ఈ చాక్లెట్లకు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. తొలుత అమెరికాలోని కోకో చెట్ల పళ్లలోని రసం తీసి తాగేవారు. 1519లో ఈ రసాన్ని స్పెయిన్ తమ దేశానికి తీసుకువచ్చింది. ఆ తర్వాత యూరప్ ప్రాంతానికి పరిచయమైంది. వందల ఏళ్లపాటు రసంగానే తాగారు. 1819లో తొలిసారిగా స్విట్జర్లాండ్‌లో చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అప్పటి నుంచి అవి బిళ్లల రూపంలోకి మారాయి.

IPL-2025లోనూ హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వహించనున్నారు. ఈక్రమంలో కెప్టెన్లకే కెప్టెన్ అంటూ పాండ్య అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. IPLలో ముంబై ఇండియన్స్ జట్టులో భారత వన్డే& టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, టెస్ట్ వైస్ కెప్టెన్ బుమ్రా, ఎమర్జింగ్ టీ20 కెప్టెన్ తిలక్ వర్మ ఉన్నారు. గతేడాది నుంచి MI కెప్టెన్‌గా పాండ్య వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.