India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సోషల్ మీడియా మాధ్యమం X(ట్విటర్)లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. యాప్ లోడ్ అవట్లేదని నెటిజన్లు చెబుతున్నారు. ఒక వేళ ప్రయత్నిస్తే Retry అని డిస్ ప్లే అవుతుందని అంటున్నారు. అయితే ఈ సమస్య భారత్‌లోనే ఉందా ఇతర దేశాల్లోనూ ఉందా అనేది తెలియాల్సి ఉంది. మీకు ఇలాంటి సమస్య ఎదురవుతుందా? కామెంట్.

TCSలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. 6 నెలల్లో 30 వేల మందిని ఇంటికి పంపిన కంపెనీ అవసరమైతే మరింత మందిని తీసేస్తామని చెప్పింది. ‘నంబర్ ఇంత అని నిర్ణయించలేదు. కానీ వచ్చే త్రైమాసికంలోనూ తొలగింపులు ఉంటాయి. సరైన కారణం, అంతర్గత ఆడిట్ ద్వారానే ఇవి జరుగుతాయి’ అని తెలిపింది. ప్రస్తుతం TCSలో 5,82,163 మంది పని చేస్తున్నారు. సెప్టెంబర్ క్వార్టర్‌లో 19,755 మంది, డిసెంబర్ క్వార్టర్‌లో 11,151 మందిని తీసేసింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’కు హిందీలో దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి 3 రోజుల్లో రూ.15.75 కోట్లు (గ్రాస్) మాత్రమే వసూలు చేసింది. అటు ధురంధర్ మూవీ 38వ రోజు హిందీలో రూ.6.5 కోట్లకు పైగా (నెట్) వసూలు చేయడం విశేషం. కాగా ప్రభాస్ నటించిన బాహుబలి-2, కల్కి సినిమాలు హిందీలో ఫస్ట్ వీకెండ్ రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి.

TG: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా మంది కరెంట్ బిల్లులు చెల్లించట్లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘పాతబస్తీలో ప్రతిరోజు 20 లక్షల యూనిట్ల ఎలక్ట్రిసిటీని దొంగిలిస్తున్నారు. అంటే దాని విలువ ఏడాదికి రూ.500 కోట్లు. ఇది 2023 డేటా. ఇప్పుడు ప్రతి ఏడాది రూ.600 కోట్లకు పైగా ఉండొచ్చు’ అని పాత వార్తలను షేర్ చేశారు.

రాజాసాబ్ రిజల్ట్ విషయంలో ప్రభాస్ తనకు సపోర్ట్‌గా నిలిచినట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ‘మూవీ గురించి ఎక్కువ అప్డేట్‌గా ఉన్నది ప్రభాసే. నిరంతరం నాతో టచ్‌లో ఉన్నారు. వర్రీ కావద్దన్నారు. కొత్త ప్రయత్నం చేశాం. ఆడియెన్స్‌కు చేరడానికి కొంత టైమ్ పడుతుందన్నారు. రీసెంట్‌గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ఆయనకు మెసేజ్ చేశా. ఆ సీన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయని అన్నారు’ అని మీడియా సమావేశంలో తెలిపారు.

AP: రాష్ట్ర వైద్య శాఖకు కేంద్రం ₹567 కోట్లు విడుదల చేసిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కింద ఇచ్చే ₹2600 కోట్లలో ఇవి చివరి విడత నిధులన్నారు. PHC భవనాలు, డయాగ్నొస్టిక్ పరికరాలు, ఇతర అభివృద్ధి పనులకు వీటిని వినియోగిస్తారు. కాగా FY25-26 నిధులు, ఖర్చుపై మంత్రి సమీక్షించారు. కేంద్ర నిధులను పూర్తిగా సాధించాలని అధికారులను ఆదేశించారు. విఫలమైతే సంబంధిత అధికారులే బాధ్యులని స్పష్టం చేశారు.

కరూర్ తొక్కిసలాట ఘటనలో TVK పార్టీ అధినేత విజయ్‌కు <<18836427>>సీబీఐ<<>> మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా నిన్న విజయ్‌ను సీబీఐ 7 గంటల పాటు ప్రశ్నించింది. గతేడాది జరిగిన ఆ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయాలయ్యాయి.

AP: తెలుగు ప్రజలకు CM చంద్రబాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ‘సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి జరుపుకుంటున్న ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షిస్తున్నా. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని.. అందుకు అండగా ఉంటానని తెలియజేస్తున్నా. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

రైలు ప్రమాదాల నివారణకు వీలుగా కేంద్రం రానున్న బడ్జెట్లో ప్రయాణికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వనుందని ‘మింట్’ పేర్కొంది. ‘బడ్జెట్లో రైల్వేకు ₹1.3 లక్షల కోట్లు కేటాయించవచ్చు. ఇందులో సగం సేఫ్టీకి ఖర్చు చేస్తారు. ట్రాక్‌ల పునరుద్ధరణ, సిగ్నలింగ్ అప్‌గ్రేడ్, ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్‌ను విస్తరిస్తారు’ అని తెలిపింది. కాగా ఇటీవల ప్రమాద ఘటనలపై రాజకీయ విమర్శలతో కేంద్రం రైల్వేపై దృష్టి సారించింది.

TG: సంక్రాంతి సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో రూ.277 కోట్ల నిధులను ఆర్థికశాఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు భట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.