news

News September 8, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,08,380కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.99,350 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 తగ్గి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 8, 2025

విశాఖలో మూగ బాలికపై అత్యాచారం!

image

AP: విశాఖలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ మూగ బాలికపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై CP శంఖబ్రత బాగ్చీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే పూర్తి వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. మద్యం మత్తులో యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

News September 8, 2025

జమ్మూకశ్మీర్‌లో భీకర కాల్పులు

image

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. ఇద్దరు పారా మిలిటరీ జవాన్లకు గాయాలయ్యాయి. మరోవైపు ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ, J&K పోలీసులు, శ్రీనగర్ CRPF దళం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

News September 8, 2025

ఈ మధ్యాహ్నం ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ

image

NDA భాగస్వామ్య పార్టీల ఎంపీలతో ప్రధాని మోదీ ఈ మధ్యాహ్నం 3గంటలకు సమావేశం కానున్నారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆ విషయంపై ప్రధాని వారితో చర్చించనున్నారు. అలాగే, కాసేపట్లో టీడీపీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు టీడీపీ ఎంపీలతో నారా లోకేశ్ భేటీ జరగనుంది.

News September 8, 2025

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ గ్రీన్‌లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 193 పాయింట్లు లాభపడి 80,904 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు వృద్ధి చెంది 24,802 వద్ద కొనసాగుతోంది. టాటా స్టీల్, ఎటర్నల్, రిలయన్స్, HDFC, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, BEL, ట్రెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, L&T, ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News September 8, 2025

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

image

రేపు జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు NDA, INDI కూటమి సిద్ధమవుతున్నాయి. ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో విపక్ష ఎంపీలకు ఇండి కూటమి మాక్ పోలింగ్ నిర్వహించనుంది. దీనికి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు. అటు AP మంత్రి నారా లోకేశ్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతుగా తమ TDP ఎంపీలతో సమావేశం కానున్నారు. మరోవైపు ఎన్నికకు BRS దూరంగా ఉండే అవకాశం ఉంది.

News September 8, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!

image

TG: స్టీల్, సిమెంట్‌పై GST 28% నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది. ఇంటి నిర్మాణానికి 180 సంచుల సిమెంట్ అవసరం కాగా సంచి ధర రూ.330-370గా ఉంది. GST తగ్గడం ద్వారా సంచిపై రూ.30 చొప్పున రూ.5,500 ఆదా అయ్యే అవకాశం ఉంది. అటు 1500 కిలోల స్టీల్ అవసరం పడుతుండగా కేజీ రూ.70-85 వరకు పలుకుతోంది. కేజీపై రూ.5 తగ్గినా రూ.7,500 ఆదా కానుంది. మొత్తం రూ.13వేల వరకు తగ్గనుంది.

News September 8, 2025

రష్యాపై మరిన్ని సుంకాలు: ట్రంప్

image

రష్యాపై మరిన్ని సుంకాలు విధిస్తామని US అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ‘రష్యాపై సెకండ్ ఫేస్ టారిఫ్స్‌కు సిద్ధంగా ఉన్నారా?’ అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నేను రేడీగా ఉన్నాను’ అని ఆయన సమాధానమిచ్చారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా అదనపు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా వంటి దేశాలపై మరిన్ని సుంకాలు విధించాలని US ట్రెజరీ సెక్రటరీ<<17644290>> బెసెంట్<<>> కూడా అన్నారు.

News September 8, 2025

జ్వరమని వెళ్తే.. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి!

image

TG: కరీంనగర్‌లో దారుణం వెలుగు చూసింది. జగిత్యాల జిల్లాకు చెందిన యువతి జ్వరమొచ్చిందని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు సమాచారం. ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆమె నిద్రపోతున్నప్పుడు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News September 8, 2025

శరవేగంగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు

image

AP: గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఇంటిగ్రేటేడ్ టెర్మినల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ 6 ఎయిరో బ్రిడ్జిలు, ILBHS(inline Bagage handling system), ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ప్రత్యేకంగా నిలవనున్నాయి. అరైవల్, డిపార్చర్ ప్యాసింజర్ల కోసం వేర్వేరుగా ఎయిరోబ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తున్నారు. ILBHS వల్ల లగేజ్ వెంటనే స్కాన్ చేసుకోవచ్చు. నూతన టెర్మినల్ పనులు 70% పూర్తి కాగా, సంక్రాంతి నాటికి ప్రారంభించే అవకాశం ఉంది.