news

News January 7, 2026

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలపై చర్చించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించాలని వినతి పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిధులు, పెండింగ్ అంశాలు, అమరావతి శాశ్వత రాజధాని బిల్లుపైనా చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధాని బిల్లు పెట్టే అవకాశం ఉంది.

News January 7, 2026

‘జన నాయగన్’ వాయిదా.. రాజాసాబ్‌కు జాక్‌పాట్

image

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా వాయిదా పడటంతో ప్రభాస్ ‘రాజాసాబ్’ జాక్‌పాట్ కొట్టింది. తమిళనాడులోని దాదాపు అన్ని మెయిన్ థియేటర్లలో జన నాయగన్ స్థానంలో రాజాసాబ్‌కు షోలు కేటాయిస్తున్నారు. దీంతో పండుగ వేళ తెలుగుతో పాటు తమిళంలో భారీగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఈ రెండు సినిమాలు జనవరి 9కి రిలీజ్ కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యలతో విజయ్ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

News January 7, 2026

ఎన్నికల్లో కూటమి దౌర్జన్యాలపై SEC, HCకి ఫిర్యాదు: జగన్

image

AP: MPP ఉప ఎన్నికల్లో కూటమినేతలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఎన్నికల సంఘం, హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని YCP చీఫ్ జగన్ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరపాల్సిన ఎన్నికను దౌర్జన్యంతో గెలుపొందడం దారుణమని మండిపడ్డారు. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ MPTC సభ్యులు జగన్‌ను కలిసి ఎన్నికలో ప్రభుత్వ తీరును వివరించారు. కాగా రేపు 11amకి జగన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.

News January 7, 2026

తల్లి వాడే పర్ఫ్యూమ్‌ వల్ల బిడ్డ విలవిలలాడింది!

image

వైద్యశాస్త్రానికే సవాలు విసిరిన ఓ వింత కేసు MH పుణేలో జరిగింది. ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి 8 నెలల పాటు ఎడతెరిపి లేని దగ్గుతో విలవిలలాడింది. వైద్యులు మందులు మార్చినా తగ్గలేదు. కానీ ఒక నర్సు సూక్ష్మ పరిశీలన అద్భుతాన్ని చేసింది. ఆ తల్లి పర్ఫ్యూమ్ వల్లే బిడ్డ దగ్గుతోందని ఆమె గుర్తించింది. దానిని వాడటం మానేయగానే పాప కోలుకుంది. కొన్నిసార్లు మనం వాడే వస్తువులే పిల్లలను ఇబ్బందిపెడతాయని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

News January 7, 2026

భారత్ మాకు విలువైన భాగస్వామి.. మోదీ ట్వీట్‌కు నెతన్యాహు రిప్లై

image

భారత్-ఇజ్రాయెల్ ప్రధానులు మోదీ, నెతన్యాహు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు నూతన ఏడాది శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ప్రాంతీయ పరిస్థితుల గురించి చర్చించామని మోదీ తెలిపారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని ట్వీట్ చేశారు. ‘భారతదేశంతో ఉన్న లోతైన భాగస్వామ్యాన్ని ఇజ్రాయెల్ విలువైనదిగా భావిస్తుంది. కలిసి ఉగ్రవాదాన్ని ఓడిద్దాం’ అని నెతన్యాహు రిప్లై ఇచ్చారు.

News January 7, 2026

H-1B వీసా ప్రోగ్రామ్ రద్దు కోరుతూ బిల్

image

విదేశీయులు USలో ఉద్యోగాలు చేయడానికి వీలుగా ఉన్న H-1B వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని రిపబ్లికన్ నేత మార్జోరీ టైలర్ గ్రీన్ హౌస్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. H-1B వీసాతో పాటు అమెరికా పౌరుల ప్రయోజనాలకు ఇమిగ్రేషన్‌ యాక్ట్‌లో పలు మార్పులను బిల్లులో ప్రతిపాదించారు. అయితే బిల్లు పెట్టి కాసేపటికే ఆమె రిజైన్ చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ బయటకు రావడంతోపాటు పలు వివాదాల్లో చిక్కుకున్నారు.

News January 7, 2026

ఒకే బెడ్‌రూమ్‌లో రెండు బెడ్‌లు ఉండవచ్చా?

image

ఒకే బెడ్‌రూమ్‌లో రెండు బెడ్‌లు ఉండడం వాస్తు ప్రకారం సరికాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఇది భార్యాభర్తల మధ్య గొడవలు తేవొచ్చని అంటున్నారు. విరిగిపోయిన ఫర్నిచర్, పనికిరాని పాత వస్తువులు ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘గురువుల చిత్రపటాలు చదువుకునే గదిలో ఉంచితే వారి ఆశీస్సులు అందుతాయి. ఇంటి శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఈ నియమాలు పాటించాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 7, 2026

మీ పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

image

తల్లిదండ్రులతో టీనేజర్స్ ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారు. అయితే ఇది కౌమారదశలో ఓ భాగమని నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్ ఏమంటారోనని భయంతో, ‘మేం మంచి పిల్లలం’ అనిపించుకోడానికి అబద్ధాలు చెబుతారని అంటున్నారు. తమ హద్దులు, అమ్మానాన్నల రియాక్షన్స్ తెలుసుకోవడానికి నిజాలు దాస్తారని పేర్కొంటున్నారు. వాళ్లు మరింత స్వేచ్ఛను కోరుకుంటున్నారని అర్థమని, అతిగా నిర్బంధించవద్దని సూచిస్తున్నారు.

News January 7, 2026

విజయ్ ‘జన నాయగన్’ విడుదల వాయిదా!

image

సెన్సార్ జాప్యంతో విజయ్ నటించిన ‘జన నాయగన్’ <<18789554>>వాయిదా<<>> పడినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ RFT Films ట్వీట్ చేసింది. ఇప్పటికే చెన్నైలో బుక్ మై షో నుంచి ఈ మూవీని తొలగించడంతో తమిళనాడులోనూ పోస్ట్‌పోన్ అయినట్లేనని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు సినిమా వాయిదా పడిందని తమిళ మీడియా పేర్కొంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ఎల్లుండి రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజు తీర్పు చెప్తామని కోర్టు తెలిపింది.

News January 7, 2026

భారత్ ఘన విజయం

image

సౌతాఫ్రికాతో జరిగిన యూత్ మూడో వన్డేలో భారత అండర్-19 జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 393/7 రన్స్ చేసింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (118), వైభవ్ సూర్యవంశీ (127) సెంచరీలతో చెలరేగారు. అనంతరం సౌతాఫ్రికా 35 ఓవర్లలో 160కే కుప్పకూలింది. టాప్-4 ఆటగాళ్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. దీంతో 233 పరుగుల భారీ తేడాతో భారత్ విజయదుందుభి మోగించింది. 3 వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.