India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్‌డెర్ డసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రొటీస్ బోర్డుకు, సహచర ఆటగాళ్లకు, అండగా నిలిచిన కోచ్‌లు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 37 ఏళ్ల డసెన్ SA తరఫున 71 వన్డేల్లో 2,657 పరుగులు, 57 టీ20ల్లో 1,406, 18 టెస్టుల్లో 905 రన్స్ చేశారు. 2022 IPLలో RR తరఫున, SA లీగ్‌లో MI కేప్‌టౌన్ తరఫున ఆడారు.

సీనియర్ నటి సోనాలీ బింద్రే, ఆమె భర్త గోల్డి బెహల్ తన 30 గుంటల భూమిని ఆక్రమించారంటూ పుణేకు చెందిన రైతు చంద్రకాంత్ పోలీసులను ఆశ్రయించారు. ఆ భూమి 1957 నుంచే వంశపారంపర్యంగా వస్తోందని, తనను బెదిరించి ఆక్రమించారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే తాను చట్టబద్ధంగానే ఆ భూమిని కొనుగోలు చేశానని సోనాలి చెబుతున్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని, కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు.

AP: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో ఉంటానని కూతురు చెప్పడాన్ని తండ్రి తట్టుకోలేకపోయాడు. ఆమె గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేసి, ఆపై ఉరేసి చంపాడు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి(22), అదే మండలానికి చెందిన నాగరాజు గత నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకే మాట్లాడుకుందామని పెద్దలు వారిని మాచర్ల తీసుకురాగా 18న హత్య జరిగింది. పోలీసులు నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నితేశ్ తివారీ ‘రామాయణ’ <<19543549>>టీజర్‌పై<<>> SMలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. ‘ఆదిపురుష్’ కంటే బెటర్ అని కొందరు.. అంతా ఏఐ వీడియోలా ఉందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో VFX క్వాలిటీ, గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం నేపథ్యంలో ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. PMను మంగళగిరి శాలువాతో సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్‌కు కూడా మోదీ కంగ్రాట్స్ చెప్పారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను లోకేశ్ కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

IPL తర్వాత టీమ్ఇండియా టీ20ల షెడ్యూల్ బిజీబిజీగా ఉంది. జూన్ 26 నుంచి జులై 26వ తేదీ మధ్య నెల రోజుల వ్యవధిలో ఏకంగా 10 టీ20 మ్యాచులు ఆడనుంది. జూన్ 26, 28వ తేదీల్లో ఐర్లాండ్‌తో 2 టీ20ల్లో బరిలోకి దిగనుంది. ఆ తర్వాత జులై 1, 4, 7, 9, 11వ తేదీల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. మళ్లీ జులై 23, 25, 26వ తేదీల్లో జింబాబ్వేతో ఆడనుంది. ఇక IPLలో రాణించే యువ క్రికెటర్లు ఈ సిరీసులకు సెలెక్ట్ అయ్యే అవకాశముంది.

AP: అమరావతి పేరు పలకడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదని, అందుకే వింత పేరు తీసుకొచ్చారని CM CBN విమర్శించారు. మావిగన్ పేరు పెట్టాలనడం ద్వేషానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. అమరావతిపై ఆయన వైఖరి మారదని స్పష్టమైందని కూటమి నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో అన్నారు. రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్రానికి ప్రతిఒక్కరూ ధన్యవాదాలు తెలపాలని, తాను మధ్యాహ్నం ఉద్దండరాయునిపాలెంలో సంబరాల్లో పాల్గొంటానని చెప్పారు.

హనుమంతుడు ఒళ్లంతా సిందూరం పూసుకొని ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. సీతమ్మ తన నుదుటన సిందూరం ధరించడం వెనుకున్న విశేషాన్ని హనుమ అడిగారట. శ్రీరాముడి ఆయురారోగ్యాల కోసమని ఆమె చెప్పడంతో.. తన ప్రభువుకి మరింత మేలు జరుగుతుందని ఆంజనేయుడు దానిని తన శరీరం అంతటా పూసుకుంటాడు. ఆయన అమాయకత్వంతో కూడిన భక్తికి ముగ్ధుడైన రాముడు.. సిందూరంతో హనుమను పూజించే భక్తులకు అన్ని కష్టాలు తొలగుతాయని వరం ఇచ్చారు.

హనుమంతుడు శ్రీరాముడి పరమ భక్తుడే కాదు. ఆపదల్లో ఆదుకునే రక్షకుడు కూడా. అందుకు కురుక్షేత్రంలోని ఈ ఘటనే నిదర్శనం. యుద్ధంలో అర్జునుడి రథంపై హనుమాన్ ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగిశాక అర్జునుడు రథం దిగిన వెంటనే అది బూడిదైంది. శత్రువులు వేసిన అస్త్రాల శక్తిని కృష్ణుడితో పాటు హనుమంతుడు కూడా తన దివ్యశక్తితో ఆపి, అర్జునుడిని కాపాడాడు. అందుకే హనుమంతుడిని ఆపద్బాంధవుడు అంటారు.

రామరావణ యుద్ధంలో మైరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళంలో బంధిస్తాడు. అతడిని అంతం చేయాలంటే 5 దీపాలు ఒకేసారి ఆర్పాలి. అందుకే హనుమాన్ పంచముఖ రూపం ధరించి, ఆ దీపాలను ఆర్పి మైరావణుడిని వధించాడు. దుష్టశిక్షణ కోసం ఉద్భవించిన ఈ మహోగ్ర రూపం భక్తులకు సర్వ శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. పంచముఖ హనుమత్ స్తోత్రం జపించి, ఆయనను పూజిస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.