news

News January 8, 2026

మిరపలో వేరుపురుగు నివారణకు సూచనలు

image

మిరపలో వేరు పురుగు నివారణకు ముందుగా వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. క్లోరోఫైరిఫాస్ 8 మి.లీ ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవ సంబంధిత మెటారైజియం ఎనాయిసోప్లి వేర్ల దగ్గర పోయాలి. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 5-10 కిలోలు పొడి ఇసుకతో కలిపి నేలలో తేలికపాటి తడి ఉన్నప్పుడు సాళ్ల వెంట వేసుకోవాలి. అలాగే ఎకరాకు 10కిలోల వేపపిండి వేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 8, 2026

ఇండ్‌బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఇండ్‌బ్యాంక్ <<>>అనుబంధ సంస్థ ఇండ్‌బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (IBMBS LTD) 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBA, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్, NISM సర్టిఫికేషన్) ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల అభ్యర్థులు జనవరి 25వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.indbankonline.com

News January 8, 2026

సిరిసంపదలు కలగాలంటే.. ఇంట్లో ఉండాల్సిన విగ్రహాలు

image

అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే పూజా గదిలో కూర్చున్న స్థితిలో ఉన్న లక్ష్మీదేవి, ఎడమ వైపునకు తొండం ఉన్న వినాయకుడి విగ్రహాలను ఉంచాలి. లక్ష్మీదేవి ఎప్పుడూ నిలబడి ఉన్నట్లు ఉండకూడదు. అది చంచలత్వానికి సంకేతం. గణపతి విగ్రహం ఇంట్లోని వాస్తు దోషాలను తొలగిస్తుంది. ప్రతి గురువారం ఈ విగ్రహాలకు పసుపు, కుంకుమలతో పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతుంటారు.

News January 8, 2026

Ashes: ఆసీస్ టార్గెట్ 160 రన్స్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ చివరి టెస్టులో ఆసీస్ విజయానికి 160 రన్స్ అవసరం. రెండో ఇన్నింగ్స్‌లో ENG 342 పరుగులకు ఆలౌట్ అయింది. బెథెల్(154) మినహా ఎవరూ రాణించలేదు. AUS బౌలర్లలో స్టార్క్, వెబ్‌స్టర్ చెరో 3, బోలాండ్ 2, నెసెర్ ఒక వికెట్ తీశారు. మ్యాచ్ ఇవాళ చివరి రోజు కాగా మొత్తం 5 టెస్టుల సిరీస్‌లో AUS ఇప్పటికే మూడింట్లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంది. ENG ఒక మ్యాచులో గెలిచింది.

News January 8, 2026

బలపడిన వాయుగుండం.. తుఫానుగా మారే ఛాన్స్!

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని IMD తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. తర్వాత ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్స్ కూడా ఉంది. దీంతో అధికారులు వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టులకు ఒకటో నంబర్ తుఫాను హెచ్చరిక జారీ చేశారు.

News January 8, 2026

ప్రధాని మోదీ ఆస్తులు ఎంతంటే?

image

PM నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు చేరిందని ఏడీఆర్ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. 2014తో పోలిస్తే పదేళ్లలో ఆయన ఆస్తులు 82% పెరిగాయి. ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు 2014లో రూ.9.4 కోట్లుగా ఉండగా, 2024 నాటికి రూ.20.39 కోట్లకు చేరి 117% వృద్ధి నమోదైంది. వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల సగటు ఆస్తులు కూడా పదేళ్లలో 110% పెరిగినట్లు ADR తెలిపింది.

News January 8, 2026

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>SAIL<<>>)కు చెందిన ఇస్కో స్టీల్ ప్లాంట్ బర్న్‌పుర్ హాస్పిటల్‌లో 22కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, పీజీ డిప్లొమా/పీజీ డిగ్రీ/DNB/DM/MCh/DrNB/DIH అర్హతతో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తును జనవరి 19 నాటికి ఇ -మెయిల్ చేయాలి. జనవరి 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://sailcareers.com/

News January 8, 2026

విగ్రహాల పరిమాణం ఎంత ఎత్తు వరకు ఉండవచ్చు?

image

ఇంట్లో విగ్రహాలు రెండున్నర అంగుళాల నుంచి 6 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు. మరీ పెద్ద విగ్రహాలు ఉంటే వాటికి శాస్త్రోక్తంగా నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. లోహపు విగ్రహాలైతే పంచలోహాలు, వెండి లేదా రాగితో చేసినవి ఉత్తమం. విగ్రహాలకు ఎటువంటి పగుళ్లు ఉండకూడదు. ఒకే దేవుడి విగ్రహాలు రెండు కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవడం చాలా మంచిది. శివలింగం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

News January 8, 2026

మొక్కజొన్న కంకిలో చివరి వరకూ గింజలు రావట్లేదా?

image

మొక్కజొన్న పంటలో గింజ పాలు పోసుకునే దశలో పొలంలో తేమ తగ్గినా లేదా మొక్కకు అందాల్సిన యూరియా మోతాదు సరిపోకపోయినా మొక్క తన దగ్గర ఉన్న శక్తిని కేవలం కంకిలో కింద ఉన్న గింజలకే అందిస్తుంది. దీంతో కంకి చివర వరకూ బలం అందదు. అందుకే కంకి చివరన గింజలు రావు. అలాగే ఎకరానికి ఉండాల్సిన మోతాదు కంటే దగ్గర, దగ్గరగా ఎక్కువ మొక్కలను వేస్తే సూర్యరశ్మి, పోషకాల కోసం పోటీ పెరిగి కంకిలో చివర వరకు గింజలు రావు.

News January 8, 2026

మొక్కజొన్న కంకిలో చివరి వరకూ గింజలు రావాలంటే?

image

మొక్కజొన్న కంకిలో గింజలు నిండుగా రావాలంటే గింజలు పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకు అవసరమైన నీటిని అందించాలి. అలాగే చివరి దఫా ఎరువుగా నిపుణుల సూచనల మేరకు పొటాష్ అందిస్తే గింజ గట్టిపడి పొత్తు బరువు పెరుగుతుంది. అలాగే పంటకు సిఫార్సు మేరకు యూరియా, ఇతర పోషకాలను సరైన మోతాదులో అందించాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి.