news

News January 21, 2026

సింగరేణి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది: కిషన్‌రెడ్డి

image

తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే సింగరేణి నిర్వహణ బాధ్యత కేంద్రం తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంత్రుల మధ్య వాటాల గొడవతోనే సింగరేణి వివాదం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు.

News January 21, 2026

వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

image

ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.

News January 21, 2026

సమయం అనుకూలించనప్పుడు చేయాల్సిన పనులు

image

కాలం కలిసి రానప్పుడు పాటించే కొన్ని ఆధ్యాత్మిక నియమాలు మనలో మార్పులు తెస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బయటకు వెళ్లేటప్పుడు నుదుట కుంకుమ, విభూతి ధరిస్తే దృష్టి దోషాలు తొలగి శుభం కలుగుతుంది. శుక్రవారం లక్ష్మీ గణపతిని ఎర్రని పూలతో పూజిస్తే అభివృద్ధి లభిస్తుంది. నిద్రించే ముందు గురు చరిత్ర పారాయణం చేయడం, ఉదయాన్నే అరచేతిని దర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

News January 21, 2026

తెలంగాణకు భారీ పెట్టుబడులు

image

TG: రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు DI పైపుల తయారీ సంస్థ రష్మి గ్రూప్‌ ముందుకు వచ్చింది. దావోస్‌లో CM రేవంత్ బృందంతో ₹12,500Cr పెట్టుబడికి MOU చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12K ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. అటు ₹6వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి ‘న్యూక్లర్ ప్రొడక్ట్స్’ సంస్థ ప్రభుత్వానికి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమర్పించింది.

News January 21, 2026

NBCC 59 పోస్టులకు నోటిఫికేషన్

image

నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (<>NBCC<<>>) 59 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి మూడో వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. జూనియర్ ఇంజినీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. వెబ్‌సైట్: https://www.nbccindia.in

News January 21, 2026

అక్రమాలకు కేంద్రంగా సింగరేణి: కిషన్‌రెడ్డి

image

TG: అవినీతి, అక్రమాలకు సింగరేణి కేంద్రంగా మారిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. BRS, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతులా వాడుకున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బొగ్గు అందించాలనే నైనీ కోల్‌బ్లాక్‌ను కేంద్రం కేటాయించిందన్నారు. కేంద్రం అనుమతులిచ్చినా టెండర్లు పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, సింగరేణి అక్రమాలపై CBI విచారణ అవసరమని తెలిపారు.

News January 21, 2026

1.12 కోట్ల ఉద్యోగాలిచ్చేలా MSMEలకు కేంద్ర ప్రోత్సాహం

image

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంటు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ₹5,000 CR EQUITY సపోర్టుగా ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. MSMEలకు రుణ ప్రోత్సాహంగా దీన్ని అమలు చేయనుంది. దీని ద్వారా 25.74 L సంస్థలకు లబ్ధి చేకూరి 1.12 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. కాగా <<18915747>>అటల్ పెన్షన్<<>> యోజన స్కీమ్‌ను 2030–31 వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

News January 21, 2026

తెలంగాణలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

image

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. 36 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఈసీ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో ఉన్నవారిని, ఒకే చోట మూడేళ్లు దాటిన వారిని మార్చేసింది. ప్రమోషన్లు, పరిపాలనా కారణాలతో జరిగిన ఈ బదిలీల్లో పలువురిని జీహెచ్‌ఎంసీకి పంపగా మరికొందరిని జిల్లాలకు బదిలీ చేసింది.

News January 21, 2026

‘బంగారు’ భవిష్యత్తు కోసం చిన్న పొదుపు!

image

ప్రస్తుతం బంగారం ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. అందుకే ఒకేసారి కొనలేకపోయినా ప్రతిరోజూ చిన్న మొత్తంలో డిజిటల్ గోల్డ్ కొనడం లేదా జువెలరీ షాపుల స్కీమ్స్‌లో చేరడం మంచిది. ఇప్పుడు గోల్డ్ SIPల ద్వారా రోజుకు రూ.30 నుంచే బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా జమ చేయడం వల్ల భవిష్యత్తులో పెరిగే ధరల లాభం మీకే దక్కుతుంది. భారీ పెట్టుబడి అవసరం లేకుండానే చిన్న పొదుపుతోనే ఎంతో కొంత బంగారం కొనొచ్చు.

News January 21, 2026

గనుల కేటాయింపుపై ఎంక్వైరీకి సిద్ధమా.. పొన్నం సవాల్

image

TG: ​సింగరేణి గనుల కేటాయింపులపై హరీశ్ రావు, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 2014 నుంచి 2026 వరకు జరిగిన గనుల కేటాయింపులపై ఎంక్వైరీకి సిద్ధమని, మరి మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ బీజేపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతారని మంత్రి వ్యాఖ్యానించారు.