India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ డివైన్(79), సుజీ బేట్స్(58) రాణించడంతో 259 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ టాపార్డర్ విఫలమవ్వడంతో 183 పరుగులకే ఆలౌటైంది. జట్టులో రాధా యాదవ్(48) టాప్ స్కోరర్. NZ విజయంతో సిరీస్ సమమైంది. కాగా సిరీస్ విజేతను నిర్ధారించే మూడో వన్డే 29న జరగనుంది.
తెలంగాణ రాజకీయాల్లో జన్వాడ ఫాంహౌస్ పార్టీ సంచలనంగా మారింది. KTR బావమరిది పాకాల రాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు KTRను టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఫాంహౌస్‌లో డ్రగ్స్ లభించలేదని, పర్మిషన్ లేని లిక్కర్ వాడినంత మాత్రాన కేసులేంటని BRS కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. ఇది రేవ్ పార్టీ కాదు ఫ్యామిలీ పార్టీ అంటున్నారు.
AP: రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉ.10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్‌తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వనున్నారు.
AP: ఐదేళ్ల <<14468148>>జగన్<<>> దరిద్రపు పాలనలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని TDP ఆరోపించింది. ERC ప్రతిపాదన పాపం జగన్‌దేనని మండిపడింది. ‘గత ప్రభుత్వం ప్రజలపై రూ.6,072 కోట్ల భారం మోపింది. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపు ప్రతిపాదనలు. ఆ భారమంతా కూటమి ప్రభుత్వంపైనే పడింది. విద్యుత్ కొనుగోలులోనూ అక్రమాలకు పాల్పడ్డారు. చంద్రబాబు ఛార్జీలు పెంచుతామని ఎక్కడా చెప్పలేదు’ అని పేర్కొంది.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఆటగాళ్లతో అత్యుత్తమ టెస్టు జట్టును తయారుచేస్తే దానికి ఓపెనర్‌గా తాను రోహిత్‌నే ఎంచుకుంటానని తెలిపారు. ‘రోహిత్ చాలా ప్రమాదకర ప్లేయర్. నిర్భయంగా తన షాట్స్ ఆడతారు. అవసరమైతే అద్భుతంగా డిఫెండ్ కూడా చేసుకోగలరు. అతడు క్రీజులో ఉన్నప్పుడు బౌలర్లు ఒత్తిడికి గురవుతారు’ అని పేర్కొన్నారు.
AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది.
*టూరిజం ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలి
*వైద్యారోగ్యశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ
*జీఏడీలో సర్వీసుల వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా వాణీ మోహన్
*కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్
**మరో ఐఏఎస్ రొనాల్డ్ రోస్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
ఇజ్రాయెల్‌కు తమ సత్తా ఏంటో చూపాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారులను ఆదేశించినట్లు IRNA తెలిపింది. ‘మనపై జరిగిన దాడులను తక్కువ చేసి చూడొద్దు. ఎక్కువగానూ భావించొద్దు. దేశానికి మేలు జరిగే అనువైన మార్గాన్ని అధికారులే నిర్ణయించాలి’ అని ఆయన వారితో చెప్పినట్లు వెల్లడించింది. మరోవైపు ఇరాన్‌పై శక్తివంతమైన దాడి చేశామని, తమ లక్ష్యాలను పూర్తిగా సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.
TG: ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కొనలేనప్పుడే కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటారని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్ చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీని ఉద్దేశించి తమ పార్టీని నేరుగా ఎదుర్కోలేని కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ ‘మొహబ్బత్ కా దుకాణ్’ అసలైన రూపం బయటపడిందని దుయ్యబట్టారు.
TG: జన్వాడ <<14465898>>ఫాంహౌస్<<>> పార్టీపై BRS అధినేత కేసీఆర్ ఆరా తీశారు. డీజీపీ జితేందర్‌కు ఫోన్ చేసి రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర విల్లాల్లో తనిఖీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే తనిఖీలు ఆపాలని డీజీపీని కోరారు. కాగా, కేటీఆర్ బావమరిది అయిన రాజ్ పాకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఢిల్లీ కన్సర్ట్ మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగించింది. కన్సర్ట్‌లో సింగిల్స్‌కు ఓ మ్యాట్రిమొనీ వాలంటీర్లు ‘సింగిల్స్ కో పానీ పిలావో యోజన’ పేరుతో ఫ్రీ వాటర్ బాటిల్స్ అందించారు. ‘మా మ్యాట్రిమొనీలో చేరి ఉంటే ఈ బాటిల్‌కు బదులుగా మీ భాగస్వామి చేతులు పట్టుకుని ఉండేవారు’ అని ప్రమోషన్స్ చేశారు. ఫ్రీ బాటిల్స్ అందుకున్న సింగిల్స్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.