news

News January 30, 2026

నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా తగ్గి 82,150 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 140 పాయింట్లకు పైగా నష్టపోయి 25,270 వద్ద కొనసాగుతోంది. HDFC, SBI, ITC, నెస్లే ఇండియా, డా.రెడ్డీస్ వంటి కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

News January 30, 2026

‘జన నాయగన్’ ఎందుకు రిలీజ్ కాలేదో అందరికీ తెలుసు: విజయ్ తండ్రి

image

‘జన నాయగన్’ ఎందుకు విడుదల కాలేదో అందరికీ తెలుసని TVK అధ్యక్షుడు విజయ్ తండ్రి చంద్రశేఖర్ చెప్పారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ TNను 60ఏళ్లుగా పాలిస్తున్న ద్రవిడియన్ పార్టీలకు కునుకు లేకుండా చేస్తోందన్నారు. రాజకీయ కారణాలతోనే విడుదల ఆలస్యమవుతోందని చెప్పారు. ప్రస్తుత పాలకులు మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలకు సినిమాలను వాడుకోవద్దన్నారు.

News January 30, 2026

ఈనేముందు చూడి పశువుల వసతి జాగ్రత్తలు

image

చూడి పశువును ఈనడానికి 15 రోజుల ముందు దూడ వేసే స్థలానికి మార్చాలి. నేలకు, మేతతొట్టెకు, పక్క గోడలకు సున్నం పూసి శుభ్రంగా ఉంచాలి. దీని వల్ల పశువులు ఈనే సమయంలో, మావి పడిపోయే సమయంలో గర్భాశయానికి రోగకారక క్రిములు చేరకుండా రక్షణ కలుగుతుంది. మేత తొట్టె నుంచి, మురుగు కాలువ వరకు నేల ఒక అంగుళం ఏటవాలుగా ఉండేట్టు చూసుకోవాలి. పశువులకు ఎండుగడ్డినే నేలపై పరిచి పరుపుగా వాడాలి. వరి పొట్టు, రంపం పొట్టు వాడొద్దు.

News January 30, 2026

హార్వర్డ్‌లో కోర్స్ పూర్తి చేసుకున్న CM రేవంత్

image

హార్వర్డ్ కెనడీ స్కూల్‌లో TG CM రేవంత్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తయింది. ‘లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ’ అనే ప్రోగ్రామ్‌ని JAN 25 నుంచి నిర్వహించారు. CM సహా 62 మంది విద్యార్థులు ఈ కోర్సు పూర్తి చేశారు. వారికి కెనడీ స్కూల్ ఫ్యాకల్టీ సర్టిఫికెట్స్ అందజేశారు. రోజూ ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు ఈ ప్రోగ్రామ్‌ని నిర్వహించారు.

News January 30, 2026

ఒక్క రోజే రూ.10వేలు తగ్గిన కేజీ వెండి ధర

image

వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర ఇవాళ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో KG సిల్వర్ రేటు రూ.10వేలు పతనమై రూ.4,15,000కు చేరింది. కాగా నిన్న ఒక్క రోజే కేజీ వెండి ధర రూ.25వేలు పెరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అటు బంగారం ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి.

News January 30, 2026

NCERTలో 173 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>NCERT<<>>లో 173 గ్రూప్ A, B, C నాన్ అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 2వరకు పొడిగించారు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in

News January 30, 2026

టమాటా రైతుల ఆవేదన.. కిలో రూపాయి కూడా లేదు!

image

AP: టమాటా ధరలు రైతులకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. 3నెలల క్రితం కిలో రూ.60 పలికిన టమాటాకి ఇప్పుడు రూపాయి కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్లో రెండు వారాల క్రితం కిలో రూ.15 పలికిన నాణ్యమైన రకం ఇప్పుడు రూ.7 కూడా పడట్లేదని వాపోతున్నారు. మూడో రకమైతే రూపాయి కూడా రావట్లేదని చెబుతున్నారు. కోత కూలీ, ప్రయాణ ఖర్చులు కూడా రావట్లేదని కొందరు రైతులు పంటను వదిలేస్తున్నారు.

News January 30, 2026

కెనడా విమానాలపై ట్రంప్ టారిఫ్ బాంబ్‌

image

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం కొత్త మలుపు తిరిగింది. కెనడా నుంచి అమెరికాకు విక్రయించే విమానాలపై 50% టారిఫ్‌లు వేస్తానని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అమెరికన్ గల్ఫ్‌స్ట్రీమ్ జెట్లకు కెనడా సర్టిఫికేషన్ ఇవ్వకపోవడమే కారణమని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతిగా బొంబార్డియర్ సహా కెనడియన్ విమానాల సర్టిఫికేషన్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఇటీవల <<18949938>>కెనడాపై<<>> 100% సుంకాలు వేస్తానని ట్రంప్ బెదిరించారు.

News January 30, 2026

TMC or BJP: బెంగాల్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే?

image

ఇప్పటికిప్పుడు LS ఎన్నికలు జరిగితే బెంగాల్‌లో TMC 28, BJP 14 స్థానాల్లో గెలుస్తాయని ‘India Today’ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది. 2024 ఎలక్షన్స్‌లో TMC 29, BJP 12 సీట్లు గెలిచాయి. అయితే గతేడాది AUG సర్వేలో TMC 31, BJPకి 11 సీట్లు రాగా ఇప్పుడు కమలం పార్టీకి మెజార్టీ పెరగడం గమనార్హం. అదే సమయంలో TMC సీట్లు తగ్గాయి. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఖాయం కానుంది.

News January 30, 2026

కొబ్బరి మొక్కల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

కొబ్బరిలో అధిక దిగుబడి రావాలంటే మొక్కల ఎంపిక కీలకం. మొక్కల వయస్సు 10-12 నెలలు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆకుల సంఖ్య 6, అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క కాండం మొదలు చుట్టుకొలత పొట్టి రకానికి 8 సెం.మీ., పొడవు రకానికి 10 సెం.మీ. కంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క ఎత్తు పొట్టి రకాలకు 80 సెం.మీ. మరియు పొడవు, హైబ్రిడ్ మొక్కలకు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.