India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు DMK మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై కేసు నమోదైంది. తమిళనాడు పర్యటనలో భాగంగా మాజీ సీఎం కామరాజ్‌ను ప్రశంసించినందుకు ప్రధానిపై ఆయన అసహ్యకరంగా, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సిద్రంగనాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెగ్ననపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 176/6 స్కోర్ చేసింది. శిఖర్ ధవన్(45), ప్రభ్‌సిమ్రన్ సింగ్(25), సామ్ కరన్(23), జితేశ్ శర్మ(27) రాణించారు. బెంగళూరు గెలవాలంటే 177 రన్స్ చేయాలి. RCB బౌలర్లలో సిరాజ్ 2, మాక్స్‌వెల్ 2, దయాల్ 1, జోసెఫ్ 1 చొప్పున వికెట్లు తీశారు.

TG: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆర్టీసీలో 3వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాలక్ష్మి పథకంతో RTCకి పూర్వవైభవం తీసుకొచ్చామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని కోరారు. అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ 100 రోజుల్లోనే కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. అన్ని మతాలను, కులాలను కాంగ్రెస్ గౌరవిస్తోందన్నారు.

IPL ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22న చెన్నైలో ప్రారంభమైన ఈ మెగా టోర్నీ.. మే 26న చెన్నైలో ఫైనల్ మ్యాచుతో ముగియనుంది. ఏ జట్టు ఎవరితో, ఎప్పుడు, ఎక్కడ ఆడనుందనే పూర్తి వివరాలు పైనున్న ఇమేజ్‌లలో చూడొచ్చు. వీటిని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SHARE IT

బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతోంది. దీంతో ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు కారు వాషింగ్, గార్డెన్లు, భవన నిర్మాణాలకు నీటిని వాడుతున్నారు. దీంతో అధికారులు 22 మందిపై కేసులు బుక్ చేశారు. వారి నుంచి రూ.1.10 లక్షల ఫైన్ వసూలు చేశారు. మరోవైపు వేసవి నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ చాలా ప్రాంతాల్లోని ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.

హీరో నానీని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గెరాత్ వైన్. కెమెరా ముందు, వెనక తన కెరీర్ గురించి ఆయన పలు విషయాలు పంచుకున్నట్లు చెప్పారు. టాలీవుడ్‌తో బ్రిటన్ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సూచనలు చేసినట్లు వెల్లడించారు. తన సినిమాలు చూడాలంటూ కొన్నింటిని సజెస్ట్ చేశాడన్నారు. నానీతో దిగిన ఫొటోలను Xలో షేర్ చేసిన గెరాత్ ‘మీరైతే ఏ సినిమా(నానీవి)లు రికమెండ్ చేస్తారు?’ అని అడిగారు.

హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ ప్రారంభంలో మంచి కథలు వచ్చేవి కావని చెప్పారు. తన పాత్రలో ఎలా ఉండాలో నిర్ణయించుకొని కథలు రాయడం మొదలు పెట్టానని తెలిపారు. కొత్త ప్రపంచాన్ని సృష్టించేలా స్టోరీస్ రాయడం బాగుందన్నారు. డీజే టిల్లు సీక్వెల్‌కు డైరెక్టర్ విమల్ కృష్ణ అందుబాటులో లేకపోవడంతో మల్లిక్‌తో తెరకెక్కించామని చెప్పారు. ఈ నెల 29న ‘టిల్లు స్క్వేర్’ మూవీ విడుదల కానుంది.

కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ.. మోదీ అని నినదించే యువత చెంప పగలగొట్టాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని దుయ్యబట్టారు. మంచి దుస్తులు ధరించి, సముద్రపు లోతుల్లోకి వెళ్లి స్టంట్స్ చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మద్దతిచ్చే యువత సిగ్గుపడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ ఫోన్లు కనిపించడం లేదని ED పేర్కొనడంపై AAP మంత్రి ఆతిశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ ఏమైనా చెప్పాలనుకుంటే జడ్జి ముందు చెప్పాలన్నారు. ఈడీ అనేది ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని ఆమె గుర్తు చేశారు. రాజ్యాంగం ఈడీకి ప్రత్యేక అధికారాలు కల్పించిందని, వాటిని తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని అవమానించవద్దని ఆమె అన్నారు.

TG: మాజీ CM KCR కుటుంబం మొదటిసారి ఎన్నికలకు దూరంగా ఉంటోంది. 2001లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి KCR ఫ్యామిలీ ఎన్నికలకు దూరంగా ఉండటం ఇదే తొలిసారి. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో KCR, KTR, హరీశ్‌రావు, కవితల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా జాబితాలో వారి పేర్లు ప్రకటించలేదు. కాగా ఆవిర్భావం నుంచి ప్రతి అసెంబ్లీ/పార్లమెంట్ ఎన్నికల్లో KCR ఫ్యామిలీలో ఎవరో ఒకరు కచ్చితంగా పోటీ చేస్తూ వచ్చారు.
Sorry, no posts matched your criteria.