India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హీరో రానా మరో సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయ్యారు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమయ్యే ఈ షోకు ‘ది రానా కనెక్షన్’ అనే పేరుని ఖరారు చేశారు. అయితే ఈ టాక్ షో ఎప్పటి నుంచి ప్రసారం చేస్తారనేది రివీల్ చేయలేదు. టాలీవుడ్, బాలీవుడ్‌తో సహా పలు ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలను ఈ షోకు ఆహ్వానించే అవకాశాలున్నాయి. గతంలో రానా ‘నంబర్ 1 యారీ’ పేరుతో ఓ టీవీ షోకు హోస్ట్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.

విభిన్న చిత్రాలతో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన హీరోగా, అనిల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమాలో స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు సమాచారం. ‘మహా నటి’ కీర్తి సురేశ్ ఈ మూవీలో సుహాస్ సరసన నటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

AP: నేటి నుంచి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర చేపట్టనున్నారు. 20, 21, 22 తేదీల్లో కడప, అన్నమయ్య జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనోవేదనకు గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారికి రూ.3 లక్షల పరిహారం కూడా చెల్లించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ సిద్ధం చేస్తోంది.

జంక్ ఫుడ్ తినొద్దని తండ్రి మందలించినందుకు కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది. నాగ్‌పూర్‌లో బీబీఏ చేస్తున్న భూమిక వినోద్ ధన్వానీ థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉండటంతో తండ్రి మందలించారు. కలతచెందిన యువతి వంటగదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై యాక్సిడెంటల్ డెత్‌గా పోలీసులు కేసు నమోదు చేశారు.

బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కొద్దిరోజులుగా బాహ్య ప్రపంచంలో కనిపించడం లేదు. దీంతో ఆమె అదృశ్యంపై ఊహాగానాలు, ప్రచారాలు జోరందుకున్నాయి. ఆమె కోమాలో ఉన్నారని కొందరు.. యువరాజు విలియం అఫైర్ మరో కారణమని చర్చించుకుంటున్నారు. మూడు నెలలుగా ఆమె ఎవరికీ కనిపించలేదని న్యూయార్క్ పోస్ట్ కూడా ఓ కథనం ప్రచురించింది. ఇదే విషయమై యువరాజు మామ కేట్ మిస్సింగ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. నెట్టింట దీనిపై తీవ్ర జరుగుతోంది.

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, అంజలి, జయరామ్, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తీహార్ జైల్లో ఖైదీలు ఫోన్‌లు ఉపయోగించడాన్ని అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. రూ.11.5 కోట్ల వ్యయంతో జైలులో 15 సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాల్ బ్లాకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7కి.మీ దూరంలో తీహార్ గ్రామంలో ఉన్న ఈ జైలు ఆసియాలో అతిపెద్దది. గత కొన్నేళ్లలో ఇక్కడ నుంచి గ్యాంగ్‌స్టర్లు ఫోన్లు వాడటం, బయటి వారిని బెదిరించడం వంటి ఘటనలు వెలుగు చూశాయి.

1351: ఢిల్లీ సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
1986: హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ జననం
1987: టాలీవుడ్ సింగర్ హరిచరణ్ జననం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం
అంతర్జాతీయ సంతోష దినం

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

TG: వచ్చే నెల 13న ఇల్లినాయ్‌లో జరిగే సదస్సుకు మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. అమెరికా నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘భారత పారిశ్రామిక రంగంలో అవకాశాలు-సవాళ్లు’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆయనకు లేఖ రాసింది. కాగా కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అమెరికా నార్త్ వెస్టర్న్ వర్సిటీ తెలిపింది.
Sorry, no posts matched your criteria.