news

News October 27, 2024

ఫాంహౌస్ పార్టీ.. DGPకి కేసీఆర్ ఫోన్

image

TG: జన్వాడ <<14465898>>ఫాంహౌస్<<>> పార్టీపై BRS అధినేత కేసీఆర్ ఆరా తీశారు. డీజీపీ జితేందర్‌కు ఫోన్ చేసి రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర విల్లాల్లో తనిఖీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే తనిఖీలు ఆపాలని డీజీపీని కోరారు. కాగా, కేటీఆర్ బావమరిది అయిన రాజ్ పాకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

News October 27, 2024

సింగిల్స్‌కు ఫ్రీ వాటర్ బాటిల్స్.. ఎందుకంటే?

image

పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఢిల్లీ కన్సర్ట్‌ మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగించింది. కన్సర్ట్‌లో సింగిల్స్‌కు ఓ మ్యాట్రిమొనీ వాలంటీర్లు ‘సింగిల్స్ కో పానీ పిలావో యోజన’ పేరుతో ఫ్రీ వాటర్ బాటిల్స్ అందించారు. ‘మా మ్యాట్రిమొనీలో చేరి ఉంటే ఈ బాటిల్‌కు బదులుగా మీ భాగస్వామి చేతులు పట్టుకుని ఉండేవారు’ అని ప్రమోషన్స్ చేశారు. ఫ్రీ బాటిల్స్ అందుకున్న సింగిల్స్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.

News October 27, 2024

BREAKING: కదులుతున్న రైలులో మంటలు!

image

మధ్యప్రదేశ్‌లో కదులుతున్న రైలులో మంటలు అలజడి సృష్టించాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దూకారు. ఈ ఘటన రత్లాం సమీపంలోని ప్రీతమ్ నగర్, రునియా రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది. దీంతో వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News October 27, 2024

కేటీఆర్ బంధువులను రేవంత్ టార్గెట్ చేశారు: ప్రశాంత్ రెడ్డి

image

TG: కేటీఆర్ బంధువులను రేవంత్ టార్గెట్ చేశారని BRS నేత ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ బావమరిది సొంతింటి గృహప్రవేశంలో కుటుంబ సభ్యులను కలుసుకుంటే పోలీసులు సీన్ మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ ఎదుగుదల ఓర్వలేకనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు జన్వాడలో పార్టీ జరిగితే రాయదుర్గంలో రచ్చ చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

News October 27, 2024

టీ20 మైండ్‌సెట్ నుంచి రోహిత్ బయటికి రావాలి: మంజ్రేకర్

image

స్వదేశంలో భారత్ 12 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్‌పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్‌ను లైనప్‌లో కిందకి నెట్టి, వాషింగ్టన్ సుందర్‌ను ముందు పంపడం వంటి వ్యూహాలు అర్థరహితంగా అనిపించాయి. బ్యాటింగ్‌లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ అనేది టీ20 వ్యూహం. రోహిత్ ఆ మైండ్‌సెట్ నుంచి బయటపడాలి’ అని సూచించారు.

News October 27, 2024

పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు పార్థిబన్ భేటీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు, డైరెక్టర్ పార్థిబన్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కాగా పార్థిబన్ దాదాపు 70కిపైగా సినిమాల్లో నటించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

News October 27, 2024

దీపావళి కానుక ఇదేనా చంద్రబాబు: జగన్

image

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనపై YCP చీఫ్ జగన్ సెటైర్లు వేశారు. ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంట్ ఛార్జీలు పెంచడమేనా చంద్రబాబు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించేవారిమని చెప్పి, ఇప్పుడు భారీ స్థాయిలో పెంచి మాట తప్పడమే చంద్రబాబు నైజమని రుజువు చేశారని విమర్శించారు. ఈ విషయమై వైసీపీపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు.

News October 27, 2024

పాకిస్థాన్ కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్

image

పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్‌గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌ను పీసీబీ నియమించింది. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా, జింబాబ్వే సిరీస్‌లో ఆయన జట్టుకు సారథ్యం వహిస్తారు. సల్మాన్ అలీ అఘాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. టెస్టులకు షాన్ మసూద్ కెప్టెన్సీ చేస్తున్నారు. కాగా వన్డే, టీ20 కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ ఇటీవల గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

News October 27, 2024

సైనికులతో దీపావళి చేసుకోనున్న రక్షణ మంత్రి

image

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఏడాది దీపావళిని జవాన్లతో కలిసి చేసుకోనున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో తవాంగ్ జిల్లాలో బోర్డర్ వద్ద గస్తీ కాస్తున్న సైనికులతో కలిసి ఆయన వేడుక జరుపుకోనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందు భారత వాయుసేనకు చెందిన ఉత్తరాఖండ్ వార్ మెమోరియల్ కార్ ర్యాలీ తవాంగ్‌కు చేరుకోనుంది. ఆ ర్యాలీకి అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖాండూ, డిప్యూటీ సీఎం చౌనా మీన్ స్వాగతం పలకనున్నారు.

News October 27, 2024

ముగిసిన గ్రూప్-1 మెయిన్స్

image

TG: రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 563 పోస్టులకు ఈ నెల 21 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించారు. వరుసగా 7 రోజుల పాటు పరీక్షలు జరిగాయి. జీవో 29ను రద్దు చేశాకే పరీక్షలు జరపాలని కొందరు అభ్యర్థులు ఆందోళన చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.