news

News October 27, 2024

సైనికులతో దీపావళి చేసుకోనున్న రక్షణ మంత్రి

image

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఏడాది దీపావళిని జవాన్లతో కలిసి చేసుకోనున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో తవాంగ్ జిల్లాలో బోర్డర్ వద్ద గస్తీ కాస్తున్న సైనికులతో కలిసి ఆయన వేడుక జరుపుకోనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందు భారత వాయుసేనకు చెందిన ఉత్తరాఖండ్ వార్ మెమోరియల్ కార్ ర్యాలీ తవాంగ్‌కు చేరుకోనుంది. ఆ ర్యాలీకి అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖాండూ, డిప్యూటీ సీఎం చౌనా మీన్ స్వాగతం పలకనున్నారు.

News October 27, 2024

ముగిసిన గ్రూప్-1 మెయిన్స్

image

TG: రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 563 పోస్టులకు ఈ నెల 21 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించారు. వరుసగా 7 రోజుల పాటు పరీక్షలు జరిగాయి. జీవో 29ను రద్దు చేశాకే పరీక్షలు జరపాలని కొందరు అభ్యర్థులు ఆందోళన చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

News October 27, 2024

‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్

image

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. త్వరలో టీజర్ విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. మరో 75 రోజుల్లో సినిమా రిలీజ్ కానుందని పేర్కొంది. పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. కాగా ఇప్పటికే విడుదలైన ‘రా మచ్చా మచ్చ’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.

News October 27, 2024

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ.. UPDATE

image

TG: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పాకాల రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో రైడ్ చేశామని FIRలో తెలిపారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు తేలిందని, మిగతా వారు టెస్టులకు సహకరించలేదని చెప్పారు. రాజ్ సూచించడంతోనే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు విజయ్ చెబుతున్నారని పేర్కొన్నారు.

News October 27, 2024

ప్రజల ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోన్న కాంగ్రెస్: కిషన్ రెడ్డి

image

TG: కాంగ్రెస్‌ను నమ్మి అన్ని వర్గాలు మోసపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ఆరు గ్యారంటీలు, 400 హామీలను ఎలా అమలు చేస్తుంది? పెన్షన్లు, దళితబంధు, నిరుద్యోగ భృతి గురించి సర్కార్ ఆలోచించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. మూసీ బాధితుల కోసం కరసేవ చేసేందుకు మేం సిద్ధం’ అని ఆయన ప్రకటించారు.

News October 27, 2024

దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే!

image

ఇండియాలో 2024కి గాను అత్యుత్తమ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ SBIని బెస్ట్ బ్యాంకుగా ఎంపిక చేసింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి ఈ అవార్డును అందుకున్నారు. అత్యుత్తమ సేవలు, ఖాతాదారుల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో ఎస్బీఐ ముందంజలో ఉందని ఆ మ్యాగజైన్ తెలిపింది. మన దేశంలో SBIకి 22500 బ్రాంచులు, 62వేల ఏటీఎంలు ఉన్నాయి.

News October 27, 2024

విజయసాయి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారే: షర్మిల

image

AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగినవారే అని PCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. జగన్ మాటలే ఆయన మాట్లాడుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘విజయసాయి గారూ, మీరు చదివింది జగన్ స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా? ఆస్తులు నలుగురు బిడ్డలకు చెందాలని YS నిర్ణయించారు. కాదని ఆయన చెప్పగలరా? ఎవరినో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఈ వైఎస్ బిడ్డకు ఎప్పటికీ రాదని మాట ఇస్తున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

News October 27, 2024

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: AP పోలీస్

image

AP: దీపావళి వేళ అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పుట్టపర్తిలో ఈమేరకు ఎస్పీ వి.రత్న ప్రకటన విడుదల చేశారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామగ్రిని టపాసుల విక్రయ దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని, అన్నింటికంటే ముఖ్యంగా లైసెన్సులు ఉన్నవారే విక్రయించాలని సూచించారు. పండుగ వేళ ఎక్కడైనా ప్రమాదాలు సంభవిస్తే వెంటనే 100 లేదా 112కు ఫోన్ చేయాలన్నారు.

News October 27, 2024

జగన్ ఓ విషపు నాగు: షర్మిల

image

AP: ఛార్జిషీట్‌లో వైఎస్ పేరు చేర్చిందే జగన్ అని పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు పొన్నవోలుతో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. ‘వైఎస్ మరణానికి చంద్రబాబు కారణమైతే ఐదేళ్లు అధికారంలో ఉండి గాడిదలు కాశారా? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? చంద్రబాబుతో నాకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. స్వప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకీడ్చిన విషపు నాగు జగన్’ అని ఆమె ట్వీట్ చేశారు.

News October 27, 2024

నా తల్లిదండ్రుల ముందే అవమానించాడు: విద్యాబాలన్

image

కెరీర్ ఆరంభంలో దక్షిణాది నిర్మాత ఒకరు తనను అవమానించినట్లు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ చెప్పారు. ‘భూల్ భులయ్యా3’ సినిమా ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. మలయాళ మూవీ ‘చక్రం’లో హీరోయిన్‌గా అవకాశం వచ్చినా కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాత తమిళ చిత్రంలో అవకాశం రాగా నిర్మాత ‘యాక్టింగ్ రాదు. డాన్స్ రాదు. హీరోయిన్‌లా కనిపిస్తున్నావా?’ అని తల్లిదండ్రుల ముందే తనను అవమానించారన్నారు.