India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ యువజన కార్యకర్తల దాడి ఘటనపై Dy.CM భట్టి విక్రమార్క స్పందించారు. భారత సంస్కృతి గురించి గొప్పలు మాట్లాడే బీజేపీ నేతలు ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆవేశంలో BJP కార్యాలయంపై చేసిన దాడిని పార్టీ పెద్దలంతా ఖండించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీది అహింస సంస్కృతి అన్నారు. దాడి విషయంలో కాషాయ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
TG: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో రేపు కీలక పరిణామం జరగనుంది. అరవింద్ కుమార్ రేపు ACB విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో A-2గా ఉన్న ఆయన తన పరిధిలోని HMDA నుంచి FEOకు నిధులు బదిలీ చేశారు. KTR ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లు గతంలో అరవింద్ వివరణ ఇవ్వగా, రేపు ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేయనున్నారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా KTRను ACB తర్వాత విచారించే అవకాశం ఉంది.
తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి 16 వరకు వరుసగా 6 రోజులు హాలిడేస్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 11 నుంచి 17 వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. అటు ఏపీలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
దేశంలో బెంగళూరు కంటే ముందే మరో ప్రాంతంలో hMPV కేసులు వెలుగుచూశాయి. కర్ణాటకలోని షిమోగాలోని ప్రైవేటు ఆసుపత్రిలో 6 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే గత నవంబర్లోనే వీటిని గుర్తించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన వారు 1-2 ఏళ్ల పిల్లలే కాగా ప్రస్తుతం వీరు కోలుకున్నట్లు సమాచారం. మరోవైపు నిన్న, ఇవాళ దేశంలో 8 కొత్త కేసులు వెలుగు చూశాయి.
బుమ్రా కెరీర్లో గాయాలు టీమ్ ఇండియాకు శాపంగా మారాయి. తిరిగి కోలుకొని జట్టులోకి వచ్చిన ప్రతిసారీ అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నా ఆయన దూరమైన మ్యాచుల్లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. 2018 నుంచి అదే కొనసాగుతోంది. ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్ చేయడం బుమ్రా ప్రత్యేకత. తాజాగా AUSతో చివరికి టెస్టు మధ్యలోనే మైదానాన్ని వీడటం ఆందోళనకు కలిగిస్తోంది. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆయన ప్రదర్శనే కీలకం కానుంది.
ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆయన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు ఈ ఉదయం తోసిపుచ్చడం తెలిసిందే. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ తనపై ACB కేసులు కొట్టివేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు KTR పిటిషన్ వేస్తే విచారణలో తమ వాదనలూ వినాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే SCలో కేవియట్ వేసింది.
మాజీమంత్రి కేటీఆర్ రాత్రి 8 గంటలకు మీడియా ముందుకు రాబోతున్నారు. ఫార్ములా e కేసులో హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వడం, 9న ACB విచారణ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారనే ఆసక్తి నెలకొంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ సినిమా నిడివి మరింత పెరగనుంది. 20 నిమిషాల ఫుటేజీని కలిపి కొత్త వెర్షన్ను ఈనెల 11 నుంచి థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. రీలోడెడ్ వెర్షన్ రాబోతోంది అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.1810 కోట్లు వసూలు చేయగా పండుగ సందర్భంగా హిందీ ఆడియన్స్ను అట్రాక్ట్ చేసేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి రద్దీ దృష్ట్యా SCR మరో 4 స్పెషల్ రైళ్లను ప్రకటించింది. కాకినాడ టౌన్-వికారాబాద్, వికారాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి, చర్లపల్లి-కాకినాడ టౌన్ మధ్య ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. చర్లపల్లి-కాకినాడ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా, మిగతా రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా నడవనున్నాయి.
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, MLC కవితపై BJP MP అరవింద్ విమర్శలు గుప్పించారు. మాజీ CM కేసీఆర్కు వారిద్దరూ నష్టం కలిగించారని ఆరోపించారు. ‘పదేళ్ల పాటు ఆ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంది. కొడుకు, కూతురిని అదుపులో పెట్టకపోతే కేసీఆర్ నష్టపోతారు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదు. కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు. తాము ఇంకా సీఎం, మంత్రులం అనే భ్రమల నుంచి కేసీఆర్, కేటీఆర్ బయటికి రావాలి’ అని సూచించారు.
Sorry, no posts matched your criteria.