India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుతం దేశంలో తెలుగు సినీ పరిశ్రమే అగ్రస్థానంలో ఉందని మలయాళ నటుడు మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. టాలెంట్‌ను టాలీవుడ్ ప్రోత్సహిస్తుంటుందని ఓ ఇంటర్వ్యూలో కొనియాడారు. సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తూ సరిహద్దుల్ని తెలుగు సినిమా చెరిపేస్తోందని ఆయన ప్రశంసించారు. అవకాశం దక్కితే <<14978053>>మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తానంటూ<<>> ఆయన ఇప్పటికే అభిలాషను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మహేశ్ బాబు గత మూవీ ‘గుంటూరు కారం’ అంతంతమాత్రంగానే ఆడింది. సోషల్ మీడియాలో మాత్రం మూవీ గురించి మంచి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు ఆ సినిమాను డిసెంబరు 31న పరిమిత స్క్రీన్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈసారి మాత్రం సీట్లన్నీ చకాచకా నిండిపోతుండటం విశేషం. ఈ ఆదరణ కొనసాగితే స్క్రీన్ల సంఖ్యను మరింత పెంచాలని మూవీ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం.
AP: సమస్యలపై తక్షణమే స్పందిస్తుండటంతో వైసీపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కష్టకాలంలో వారికి అండగా ఉంటామని నేతలు భరోసా అందించాలని ఆయన చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపింది. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన చేపట్టాలి. ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలి’ అని ఆయన నేతలకు సూచించారు.
తన చేతిలో విషయమైతే అశ్విన్‌ను అలా సాదాసీదాగా రిటైర్ కానిచ్చేవాడిని కానని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల్ని అశ్విన్ తప్పుబట్టారు. ఫేర్‌వెల్ మ్యాచులనేవి తనకు నచ్చవని స్పష్టం చేశారు. అవి సెలబ్రిటీ సంస్కృతిలో భాగమన్నారు. ‘నాకోసం ఎవరైనా ఒక చుక్క కన్నీరు కార్చినా నాకిష్టం ఉండదు. ఒకరి ఘనతల్ని చూసి స్ఫూర్తి పొందొచ్చు. అంతే తప్ప ఆ ఘనతల వెనక పడకూడదు’ అని పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయిన ఆయన కాసేపటి క్రితం కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఇవాళ్టితో బాబు హస్తిన టూర్ ముగిసింది. రేపు ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడ జరిగే మంత్రి టీజీ భరత్ కూతురు వివాహానికి హాజరవుతారు.
సెలబ్రిటీలు క్రిస్మస్‌ను కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవడం తెలిసిందే. నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రం తమ సిబ్బందితో పండుగ వేడుకలు చేసుకున్నారు. వీరిలో వారి ఇంటి సిబ్బందితో పాటు అపోలో సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. తమ వద్ద పనిచేసేవారికీ పండుగను సెలబ్రేట్ చేయడం గ్రేట్ అంటూ మెగా ఫ్యాన్స్ వారిని కొనియాడుతున్నారు.
ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో జరిగిన బాక్సింగ్ డే టెస్టుల్లో ఐదుగురు భారత బ్యాటర్లు మాత్రమే శతకాలు నమోదు చేశారు. సచిన్ టెండూల్కర్ (1999), వీరేంద్ర సెహ్వాగ్ (2003), అజింక్య రహానే, విరాట్ కోహ్లీ (2014), చటేశ్వర్ పుజారా (2018), అజింక్య రహానే (2020) సెంచరీలు చేశారు. రహానే రెండు సార్లు శతకాలు సాధించారు. మరి రేపు ప్రారంభం కాబోయే బాక్సింగ్ డే టెస్టులో ఎవరు సెంచరీ బాదుతారో కామెంట్ చేయండి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రానున్న రెండు రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. TGలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అటు APలోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఉండనుంది. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు, రేపు ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. అటు ఏపీ ప్రభుత్వం ఇవాళ ఒక్కరోజే పబ్లిక్ హాలిడే ఇవ్వగా, రేపు ఆప్షనల్ హాలిడే అని తెలిపింది. అంటే అక్కడి పరిస్థితులను బట్టి జిల్లా విద్యాధికారులు సెలవు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటారు. ఈమేరకు సెలవు ఉండేది, లేనిది ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అందించారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్‌లో ఉదయం 5 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడొచ్చు. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో ముందుకెళ్లాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ ఓపెనింగ్ వస్తారని తెలుస్తోంది. నితీశ్‌ను పక్కనబెడతారని టాక్.
Sorry, no posts matched your criteria.