news

News February 2, 2026

పిండి దీపం ఎలా తయారుచేయాలి?

image

పావుశేరు బియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టి, నీరు వడగట్టి నీడన ఆరబెట్టాలి. అనంతరం ఆ బియ్యాన్ని మెత్తని పిండిలా మిల్లులో పట్టించాలి. ఈ పిండిలో తగినంత బెల్లం తురుము, ఆవు నెయ్యి కలిపి ముద్దలా చేయాలి. ఈ ప్రక్రియ అంతా శుచిగా చేయాలి. ఆ ముద్దను ప్రమిద ఆకారంలో మలచి, మధ్యలో దీపం వెలిగించడానికి వీలుగా గుంటలా చేసి సిద్ధం చేయాలి. కుదిరితే ఆ దీపంపై గోవింద నామాలు దిద్దడం మరింత శ్రేయస్కరం.

News February 2, 2026

Budget: ఈ వస్తువుల ధరలు తగ్గుతాయి

image

బడ్జెట్ 2026-27 ప్రకారం ఈవీ బ్యాటరీలు, కెమెరాలు, విదేశీ విద్య, లెదర్ ఉత్పత్తులు (బ్యాగులు, షూలు, బెల్టులు తదితర వస్తువులు), క్రీడా పరికరాలు, 17 రకాల క్యాన్సర్ మందులు, డయాబెటిస్ ట్యాబ్లెట్ల ధరలు తగ్గుతాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో విదేశాల నుంచి తెప్పించుకునే ఎలక్ట్రానిక్స్ లేదా బహుమతి వస్తువులు గతంలో కంటే చౌకగా మారనున్నాయి.

News February 2, 2026

మత్స్యకారులకు బడ్జెట్‌లో భరోసా

image

మత్స్యకారుల సంక్షేమం కోసం బడ్జెట్‌‌లో రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. భారత నౌకలు అంతర్జాతీయ జలాల్లో వేటాడే చేపలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. ఇది డీప్‌సీ ఫిషింగ్‌ చేసే బోటు యజమానులకు ఊరటగా చెప్పవచ్చు. అలాగే రొయ్యలు, చేపల ప్రాసెసింగ్‌లో వాడే ముడిసరుకుల దిగుమతి సుంకం మినహాయింపు పరిమితిని 1% నుంచి 3%కు పెంచారు. ఇది ఆక్వా పరిశ్రమలకు లాభదాయకం.

News February 2, 2026

చలికాలంలో జుట్టు ఊడకుండా ఉండాలంటే..

image

మిగతా సీజన్​లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి కేశాల సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తలస్నానానికి గోరువెచ్చని నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ అప్లై చేయడం మరచిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయర్ వాడటం తగ్గించాలి. ఈ సీజన్​లో తల వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. దీని వల్ల తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు.

News February 2, 2026

పిండి దీపం వెలిగిస్తూ పఠించాల్సిన మంత్రాలు

image

పిండి దీపం వెలిగించేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచాలి. ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని జపించాలి. ‘గోవింద నామాలు’ కూడా పలకొచ్చు. ‘శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి’ పఠించడం మరింత శ్రేష్టం. వీలైతే ‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ చదువుకోవడం ఉత్తమం. ఈ మంత్రోచ్ఛారణ స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందేలా చేస్తుంది. భక్తితో చేసే ఈ నామ స్మరణ వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగి, మానసిక ధైర్యం కలుగుతుంది.

News February 2, 2026

యూరియాకు గుళికలు కలిపి వాడుతున్నారా?

image

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.

News February 2, 2026

భారత షట్లర్ దేవికా సిహాగ్ అద్భుత విజయం

image

భారత యువ షట్లర్‌ దేవికా సిహాగ్ సంచలన విజయం నమోదు చేశారు. హరియాణాకు చెందిన ఈ 20 ఏళ్ల ప్లేయర్ BWF ‘థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ 300’ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్లో 21-8, 6-3తో మలేషియా షట్లర్‌ గోజిన్‌ వీపై దేవికా గెలిచారు. దీంతో తన కెరీర్‌లో తొలిసారి BWF 300 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా దేవికా నిలిచారు.

News February 2, 2026

ఈ పంటలకు నారు పెంచి ప్రధాన పొలంలో నాటుకోవాలి

image

తీగజాతి కూరగాయలు అయినటువంటి చిక్కుడు, ఫ్రెంచ్ చిక్కుడు, బెండ, గోరు చిక్కుడు, మునగ లాంటి కూరగాయ పంటలలో విత్తన పరిమాణం పెద్దదిగా ఉంటుంది. కాబట్టి వీటిని నారుగా కాకుండా విత్తనాలను నేరుగా పొలంలోనే విత్తుకోవచ్చు. టమాట, వంగ, క్యాబేజి, కాలిఫ్లవర్, మిరప, ఉల్లి లాంటి పంటలలో విత్తన పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. అందుకే వీటిని ముందుగా నారుమడులలో పెంచుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నారును నాటుకోవాల్సి ఉంటుంది.

News February 2, 2026

అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

image

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.

News February 2, 2026

దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి?

image

పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదను ప్రసాదంగా స్వీకరించాలి. పిండిని చక్కెర పొంగలిలో కలపాలి. చిన్న చిన్న గారెలు చేసి స్వామికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు పంచుకోవాలి. పిండి దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పారేయకూడదు. చివరగా స్వామి సన్నిధిలో కొబ్బరికాయ కొట్టి, మనసులోని కోరికను చెప్పుకుని నమస్కరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వ్రత ఫలితం పూర్తయి, సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం.