news

News September 7, 2025

చదువుకు పర్యాయపదం చంద్రబాబు: టీడీపీ

image

AP: మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు TDP దీటుగా బదులిచ్చింది. ‘30 ఇంజినీరింగ్ కాలేజీలు లేనిచోట 300కు పైగా నెలకొల్పింది చంద్రబాబు. DSCలతో 2 లక్షల మంది టీచర్లను నియమించారు. ISB, IIIT, NAC, NALSAR, BITS లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకొచ్చారు. 27 మెడికల్ కాలేజీలు తెచ్చి, 5015 MBBS సీట్లు తీసుకొచ్చారు. జగన్ తెచ్చింది 950 సీట్లే. చదువుకు CBN పర్యాయపదం’ అని Xలో పేర్కొంది.

News September 7, 2025

సీఎం రేవంత్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ

image

TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కడియం శ్రీహరి మినహా మిగతావారు హాజరైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ తాను BRSలోనే ఉన్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భేటీ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ పలువురు MLAలకు నోటీసులివ్వగా ఒకరిద్దరు ఆయనకు సమాధానమిచ్చినట్లు సమాచారం.

News September 7, 2025

ఫోన్ ఛార్జర్‌ను సాకెట్‌లో వదిలేస్తున్నారా?

image

చాలామంది ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ ఫుల్ కాగానే ఛార్జర్‌ను అలాగే సాకెట్‌లో వదిలేస్తారు. కానీ ఇలా చేయొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇలా చేస్తే వోల్టేజ్ పెరిగినప్పుడు ఛార్జర్ పేలిపోవచ్చు. అంతర్గత భాగాలు వేడెక్కి అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. స్విచ్ ఆఫ్ చేసినా ఛార్జర్ కొంత మేర విద్యుత్ ఉపయోగిస్తూనే ఉంటుంది. దీంతో విద్యుత్ వృథా అవుతుంది. అన్‌ప్లగ్ చేయడం ఉత్తమం’ అని చెబుతున్నారు.

News September 7, 2025

ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్

image

AP: కర్ణాటకలోని ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని మంత్రి లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలభైరవేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి మఠం సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదిచుంచనగిరి మఠం నిర్వహించే సంవిత్ పాఠశాలలను పరిశీలించారు. APలో పేదల కోసం సంవిత్ బడులు ప్రారంభించాలని కోరగా, పీఠాధిపతి జగద్గురు శ్రీనిర్మలానందనాథ మహాస్వామిజీ అంగీకారం తెలిపారు.

News September 7, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక..‘ఇండీ’ ఎంపీలకు మాక్ పోలింగ్

image

ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న క్రమంలో రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఇండీ కూటమి ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. గత ఎన్నికల్లో 15 మంది ఎంపీలు సరిగ్గా ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడం ఎంపీల బాధ్యత అని, ఈ ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని సూచించారు.

News September 7, 2025

రూ.50 లక్షలకు కేజీ డ్రగ్స్.. సంచలన విషయాలు వెలుగులోకి

image

TG: డ్రగ్స్ తయారీ యూనిట్ <<17630840>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ డ్రగ్స్‌ను కేజీ రూ.50 లక్షల చొప్పున విజయ్ ఓలేటి అనే వ్యక్తి హైదరాబాద్‌లో అమ్మినట్లు గుర్తించారు. ప్రత్యేకంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొని దందా చేశారని అధికారులు వెల్లడించారు. దీంతో రూ.వందల కోట్లు సంపాదించినట్లు తెలిపారు. ముంబై నార్కోటిక్ పోలీసుల్లో ఒకరు కార్మికుడిగా చేరి పక్కాగా వివరాలు సేకరించారన్నారు.

News September 7, 2025

క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నాం: రష్యా

image

Enteromix అనే క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది. ఇది ట్యూమర్లను కరిగించి వాటిని నాశనం చేస్తుందని తెలిపింది. లంగ్స్, బ్రెస్ట్, పెద్దపేగు తదితర క్యాన్సర్లకు చెక్ పెడుతుందని చెప్పింది. ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ దీన్ని అభివృద్ధి చేయగా, క్లినికల్ ట్రయల్స్‌లో 100% ఫలితాలొచ్చినట్లు వెల్లడించింది. దీని వినియోగానికి ఆరోగ్యశాఖ తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది.

News September 7, 2025

మంత్రి లోకేశ్‌పై అంబటి సెటైర్లు

image

AP: పలువురు లిక్కర్ కేసు నిందితులు బెయిల్‌పై విడుదలవ్వడంపై YCP నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ‘నీ లక్ష్యం నెరవేరకుండానే SIT చితికినట్లుంది. జర చూసుకో సూట్ కేసు. అప్పటి పప్పు.. ఇప్పటి సూట్ కేసు’ అంటూ మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేసి సెటైర్లు వేశారు.

News September 7, 2025

రూ.27 వేలతో ఆ దేశంలో శాశ్వత నివాసం

image

విదేశీయులు రూ.27 వేలకే పర్మినెంట్ రెసిడెన్సీ పొందేందుకు బ్రెజిల్‌ అనుమతి ఇస్తోంది. 2 వేల డాలర్ల ఆదాయం ఉన్నవారు కూడా ముందుగా తాత్కాలిక నివాసానికి అర్హులవుతారు. ఆ తర్వాత పర్మినెంట్ రెసిడెన్సీగా మార్చుకోవచ్చు. పాస్‌పోర్టు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, లీగల్ ఎంట్రీ, జాబ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ సర్టిఫికెట్ ఉంటే శాశ్వత నివాస హక్కు వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తానికి 4 నుంచి 6 నెలలు పడుతుంది.

News September 7, 2025

రానున్న 2గంటల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, హన్మకొండ, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. పిడుగులు పడే ఆస్కారం ఉన్నందున చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది.